Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా? Definition of antyakriyalu

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?
జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి.
పుట్టిన తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి ఒక కారణం సందర్భం ఉంటుంది. చనిపోయిన తర్వాత చేసే అంతక్రియలు లో పాటించే కొన్ని వీధులకి కూడా కారణం ఉంటుంది. అందులో ఒకటి కుండ పగలగొట్టడం. అది కూడా రెండు రంధ్రాలు పెట్టిన తర్వాత పగలగొడతారు. అలా చేయడం వెనకాల ఉన్న కారణం ఏమిటి అంటే

సాధారణంగా మనిషి ఆయుష్షు 120 సంవత్సరాలు. కాలక్రమేణా వంద సంవత్సరాల కి వచ్చింది. ఇంక ఇప్పుడు జనరేషన్ లో మనుషులు వాడే మందులు కారణంగా 60 70 ఏళ్ల కి వచ్చేసింది. ఇది సాధారణంగా ఒక మనిషి బతికే కాలం. కానీ నిజం చెప్పాలంటే చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీదు.మనిషి కంటే అతను సంపాదించిన దానికే ఎక్కువ విలువనిచ్చే ఈ కాలంలో, అలా ఆ మనిషి ఆరోగ్యాన్ని కూడా పక్కనపెట్టి కష్టపడుతూ ఉంటుండడంతో ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి వల్ల మరణించే సమయం ఇంకా ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇవి కాకుండా బలవన్మరణాలు యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఏదేమైనా మొదటి ఊపిరి నుండి చివరి శ్వాస దాకా మనిషి పడే జీవితం అనే తపన లో చివరికి జరిగేది ఊపిరి ఆగిపోవడం.
మీరు సినిమాల్లో ఒక మనిషి చనిపోయిన తరువాత తన శరీరం లో నుండి అదే మనిషి రూపం బయటికి వచ్చి పడిపోయిన తన శరీరాన్ని లేపడం, తన బంధువులతో స్నేహితులతో తను చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పడం చూసే ఉంటారు. దాన్ని ఆత్మ అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే నిజజీవితంలో కూడా ఇలానే జరుగుతుంది.మనిషి చనిపోయిన తర్వాత తన అంతక్రియలు అయ్యేవరకు తన ఆత్మ మనిషి లోపలి కి వెళ్లి మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుంది. శరీరం ఆత్మ రెండు వేరు వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే బతికే ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మ చెప్తే శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్లతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

చనిపోయిన తర్వాత శరీరం మీద ఒక మూటలో కట్టిన బియ్యపు గింజలను తీసి పరుస్తారు. ఆ గింజల అన్ని ఆత్మ సూర్యోదయం అయ్యే లోపు లెక్కించాలి. అప్పుడే ఆత్మకు తన వాళ్ళని చూసే అవకాశం వస్తుంది. ఒకవేళ సూర్యోదయం లోపు లెక్కించలేకపోతే మళ్ళీ మొదటి నుండి లెక్కించాల్సి వస్తుంది.మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండ ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు మనిషి ఆత్మ. చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మన లో నుండి బయటికి వెళ్లి పోతుందో అలాగే నీరు కూడా మెల్ల మెల్లగా బయటికి వెళ్లి పోవడానికి రంధ్రాలను పెడతారు.

ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.

బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.
పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని
(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు. ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.

శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.
హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...
ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే...
ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను
కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.

దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.
Famous Posts:
పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు

> తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

విచిత్ర వినాయక  దేవాలయము ఓ అద్భుతమైన దేవాలయం ఉంది

ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు

రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా ?

ఈ విచిత్ర దేవాలయాల గురించి మీకు తెలుసా?

తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా


అంత్యక్రియలు, Definition of antyakriyalu, funeral meaning in telugu, Hindu samradayam, Funeral Meaning In Telugu, Funeral Rites Meaning in Telugu, funeral ceremony meaning in telugu

Comments

Popular Posts