జీవిత సత్యాలు మిమ్మల్ని ఉన్నతులుగా మార్చేది ఇదే ? The Importance of Human Birth

మానవ జన్మ విలువ తెలియక కాలం గడపటం పుశువు కంటే హీనం..
ప్రకృతిలో మానవ జన్మ ఓ అపూర్వం.. ఇది కోట్ల జీవరాశుల్లో కొన్నింటికి మాత్రమే లభించే బ్రహ్మాండమైన వరం. కానీ మనుషులుగా పుట్టిన మనం మాత్రం దాని విశిష్టతను గుర్తించడం లేదు. మానవ జన్మ విలువ తెలుసుకోకుండా అజ్ఞానంలోనూ.. ఐహిక సుఖాల్లోనూ కొట్టుకుపోతూ.. దీని విలువను గ్రహించలేకపోతున్నాం..
మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటేనే..
దానికి సార్థకత. మరి అలా సద్వినియోగం చేసుకోవాలంటే.. సత్సాంగత్యం అవసరం. మనిషి తనను తాను ఉన్నతుడిగా భావించినప్పుడే, ఉన్నత కార్యాలపై దృష్టి సారించి, ఉత్తమ లక్షణాలను అలవరచుకుంటాడు. అప్పుడే ఆదర్శవంతమైన జీవితం వైపు అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. జన్మ సార్థకత అనగానే అదేదో.. ముక్కు మూసుకుని తపస్సులాంటిది కాదు.
జన్మ సార్థకత అంటే.. ముందుగా మనల్ని మనం సంస్కరించుకోవడం. ఆ తర్వాత ఇతరులు తమన తాము సంస్కరించుకునేందుకు సహాయపడటం. అవును.. ఇదే నిజమైన ముక్తి మార్గం. మనసును అంటి పెట్టుకున్న సంకుచిత స్వార్థ స్వభావం, కపట అసూయ ద్వేషాల వంటి దుష్ట సంస్కారాలే బంధనాలుగా మారతాయి.
మీ స్నేహితులు ఎలాంటి వారో చెప్పండి.. మీరు ఎలాంటి వారో చెబుతా అంటాడో రచయిత.. అందుకే ముందు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. మన స్నేహితులను ఎంచుకోవాలి. మంచి స్నేహితులను పెంచుకోవాలి. మంచి గురువులను వెదికి పట్టుకోవాలి. వారి నుంచి అమూల్యమైన సూచనలు గ్రహించాలి. అప్పుడే మనం ఉన్నతులుగా మారేందుకు మార్గం సుగమం అవుతుంది.

మానవ శరీరం దొరకడం అనేది అంత సులభంగా రాదు. వచ్చింది అంటే ఎన్ని రకాల సుకృతాలు చేసుకున్నామో, వాటి ఫలితంగా వచ్చింది. వచ్చేసింది కనుక తెలియటం లేదు. సంపన్నుల గృహంలో పుట్టినవాడికి సంపధ విలువ అంతగా తెలియదు, సంపధ లేని వారికి ఆ విలువ ఏమిటో తెలుస్తుంది. చందన వనాల్లో ఉండే బిల్ల స్త్రీ తనం నిత్యం చందనపు కట్టెలతో వంట చేసుకుంటుందట, వారికి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని అంత దృష్టి ఉండదు. అట్లానే మనకి మానవ శరీరం వచ్చేసింది మనం కోరుకుంటే రాలే, అది వచ్చే సరికి మనకు దాని విలువ తెలియడం లేదు. చేసుకోవాల్సిన పనులు మర్చిపోతున్నాం. శరీరానికి కావల్సిన వన్నీ ఇవ్వాలి, అది తప్పదు. కానీ దానితో పాటు మనం భగవంతునికి శరణాగతి చేయడం అనేది మనిషిగా మనం చేయాల్సింది. శరీరంలో ఆత్మ అనేది ఉంది అని జంతువులు గుర్తించలేవు, మనం గుర్తించగలం. అదే తేడా మనకీ జంతువులకీ. శరీరం విషయంలో అవే చాలా సరిగ్గా ఉంటాయి మనకంటే. మన గురించి మనం ఆలోచించుకొనే అవకాశం మనకు మాత్రమే ఉంది. ఇది గుర్తించి బ్రతకమని చెబుతారు.
పగలు రాత్రి దేవుడెందుకు ఇచ్చాడు ? పగలు శ్రమించి పనిచేయి, రాత్రి విశ్రాంతి తీసుకో. జంతువులు తెలతెల వారేప్పటికీ లేస్తాయి, సూర్యాస్తమయానికి పడుకుంటాయి. అదే మనుషులు సమయాన్ని రకరకాలుగా వాడుకుంటారు. విశ్రాంతికి ఇచ్చిన సమయాన్ని విశ్రాంతికి వాడుకోరు, శ్రమించాల్సిన సమయాన్ని శ్రమకు వాడుకోరు. వారిని వారే అధోగతి చేసుకోవడానికి అస్తవ్యస్తంగా లేదా, విరుధ్ధంగా వాడుతుంటారు. “నిశి వనితా సుఖ నిద్రాలోలః” రాత్రిని నిశా అంటారు, పగటిని దివా లేదా ప్రాతః అంటారు. రాత్రి పగలు గడుస్తుంటాయి, ఆయువు నాశనం కావడానికి మన చుట్టూ ప్రకృతిలో ఏవో ఒకటి ఉండనే ఉంటాయి. కానీ వాటిని మనం అయువు నాశనం కోసం కాక అయువు మర్దకంగా వాడుకో గలగాలి. నీటి ప్రవాహం ఎక్కువైతే మనుషులు కొట్టుకు పోతారు, కానీ నీటి ప్రవాహం అనేది చెడ్డదా ? కట్టలు కట్టి దాన్ని వాడుకొనే రీతిలో వాడుకుంటే ఎందరికో ఆహారాన్ని ఇస్తుంది. ప్రాణం ఇచ్చేది అదే, సరిగా వాడుకోకపోతే ప్రాణం తీసేదీ అదే.

ఆధ్యాత్మిక చింతన:
మానవ జన్మ ఉత్కృష్టమైనదని, ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మానవజన్మ పొందడం దుర్లభం అని మహాత్ములు అంటారు.

పశుపక్ష్యాదులకు లేని విచక్షణా జ్ఞానం, బుద్ధి, మనిషికి భగవంతుడు ప్రసాదించాడని చాటి చెపుతారు.

అసలు భగవంతుని పొందడటానికి ఆయనను చేరుకోవడానికి మానవజన్మ ద్వారానే సాధ్యమని ఎక్కువ మంది నమ్మకం కూడా. కానీ భగవంతుని సృష్టిలో ఏ ఒక్క జీవి అల్పమైనది కాదు. అలాగే ఏ జీవి ఉన్నతమైనది కాదు.
ఆ జీవి చేసుకున్న పూర్వజన్మల కర్మను బట్టి అలాగే ఆ జీవి ప్రస్తుత జన్మలో చేసే కర్మలను బట్టి ఆయా జీవ్ఞల జీవితానికి సార్ధకత ధన్యత సంభవిస్తాయి.
నిజానికి 84 లక్షల యోనులలో జన్మ పొందిన ప్రతి జీవి. జీవితానికి ఒక అర్ధం పరమార్ధం ఉన్నాయి.

భగవంతుడు వివిధ జీవ్ఞలలో తానే ఉన్నానని అనేక సందర్భాలలో చాటి చెప్పాడు. అటువంటప్పుడు ఒక జీవి ఉన్నతమైనది.

ఒక జీవి అధమమైనది అన్న ప్రశ్నే ఉదయించకూడదు గదా! గీతోపదేశం చేస్తూ భగవంతుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు.

అన్ని రూపాలలో నేను సంచరిస్తూ ఉంటానని భగవంతుని ఉవాచ. వినాయకుని వాహనమైన మూషికము, విష్ణుమూర్తిని తన భుజస్కంధాలపై మోసేటి గరుత్మంతుడు, ఈశ్వరుని ఆనందంగా ఊరేగించే నందీశ్వరుడు, శనీశ్వరునకు వాహనమైన వాయసము మొదలగు వాటిని అల్పజీవ్ఞలు అనగలమా?

ఒక కారడవిలో ఆలనాపాలనా లేక పడి ఉన్న శివలింగానికి తమ తమ భక్తి శ్రద్ధ, శక్తికొలది పూజించి ఈశ్వరుడు పెట్టిన పరీక్షలో గెలుపొంది సాయుజ్యము పొందిన శ్రీకాళము, హస్తి ఎంతటి ధన్యజీవ్ఞలు. అవి మానవ్ఞలు కావే.
వానరోత్తముడైన ఆంజనేయుడి శౌర్య పరాక్రమాలకు భయకంపితులకు అభయమిచ్చే దయకు తన స్వామి అయిన శ్రీరామచంద్రమూర్తి యందుగల అచంచలమైన వినయవిధేయతలకు భక్తి విశ్వాసాలకు సాటికలదా.

మరి హనుమంతుడు మానవ్ఞడు కాదే. రావణునితో యుద్ధకాలంలో శ్రీరాముడు సేతువ్ఞ నిర్మించినపుడు తన భక్తికి గుర్తుగా ఇసుకలో పొర్లి, ఆ ఇసుకను సేతువ్ఞపై జల్ల సాగిన ఉడుతా భక్తికి విలువ కట్టగలమా?

శ్రీరాముడు అపారమైన ప్రేమతో ఉడుత వీపు నిమిరి ఆయన హస్త ముద్రికలు దాని వీపు పైన ఉంచిన సంగతి లోకవిధితమే గదా!

అంతకు ముందు కాలంలో రావణుడు సీతను అపహరించుకుపోయే వేళ అతనిని అడ్డగించి అతనితో పోరు సలిపినది జటాయువ్ఞ. జటాయువ్ఞ ఒక పక్షి అయినా అంతటి మహాకార్యం చేసింది.

అలాగేనే రావణుడు చేసిన దుష్కార్యాన్ని అతడు సీతను తీసుకెళ్లిన దిక్కును చెప్పినది ఆ పక్షియే కదా! పురాణాలలో అనేక ఘోరమైన తపస్సులు చేసి భగవంతుని మెప్పించి ఆయన పొందిన వారంతా మానవ్ఞలే కాదు గదా.

నిజానికి భగవంతునిపై అవ్యాజమైన ప్రేమ నిష్కపటమైన భక్తి, ఆరాధన పశుపక్ష్యాదులకు ఉన్నట్లు మానవ్ఞలకు ఉండదేమో.

అందుకే సదా భగంతుడు వాటిని కాపాడుతూ ఉంటాడు. భగవంతుని ఆరాధించటానికి పొందడానికి మనస్సు, తపన , ప్రయత్నం ముఖ్యం కానీ జన్మ ముఖ్యం కాదు. అది మానవ్ఞజన్మకావచ్చు. మరేదైనా జన్మ కావచ్చు.
ఇక పశువు జీవనమే కదా మనిషిది. భగవంతుడు పనిచేయడానికి ఇచ్చిన రంగంలో నిరంతరం స్పర్థ నిరంతరాం ఈర్ష్య అసూయలు, అవి పడకపోతే పరదూషణ. రేపు చేద్దాం అని అనుకున్న మంచిపని కాస్త ఇక్కడికే ఆగిపోతుంది. జంతువుల జీవనం కంటే వ్యర్థం అవుతుంది మనిషి జీవనం. ఇది తగదు, ఆచార్యుల ఆశ్రయణ చేయాలి, భగవంతుణ్ణి గుర్తించగలగాలి, ఆ భగవంతుని సేవగా గుర్తించి జీవనం గడపాలి. 
Famous Posts:
రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం
సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన
సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
శనేశ్వరుడు శనివారాల నోము
శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


మానవ జన్మ, Significance Of Human Birth, importance of human birth, purpose of human birth, importance of birth, after how many births we get human life, 7 births of human, origin of life according to hinduism, human birth is rare, giving birth, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS