తిరుప్పావడ సేవ ప్రతి గురువారం జరుగుతుందండి
స్వామివారి నేత్రాలు ఆ రోజు తగ్గించబడతాయి . స్వామివారి తిరునామం తగ్గించబడుతుంది
స్వామివారి నేత్ర దర్శనం అలంకరణ కూడా విభిన్నం గా ఉంటుంది సాయంత్రం పులంగి సేవ తరువాత పువ్వులు తో మాత్రమే అలంకరణ ఉంటుంది
స్వామివారి నేత్రాలు తీక్షణమైన చూపు సాధారణ ప్రజలు తట్టుకోలేరు.
కాబట్టి ఆ రోజు పులిహోర అన్నాన్ని పెద్ద రాసిగా చేసి స్వామివారి ముందు పేరుస్తారు అలాగే జిలేబి కొబ్బరికాయలు అప్పాలు మొదలైన తీపి పదార్థాలు స్వామివారి ముందు నివేదిస్తారు
స్వామివారి నేత్రాలు తగ్గించబడటం వల్ల తీక్షణంగా ఉన్న ఆ చూపు పులిహోర అన్నం మీద పడి ఆ టీక్షణం కొంచెం తగ్గుతుంది
అలాగే ఈ సమస్త ప్రాణకోటికి ఆహారం అందుబాటులోకి వస్తుంది
ఈ టికెట్టు ధర వచ్చి 850 రూపాయలు ఒక మనిషికి
ఇవి కూడా కేవలం ఆఫ్ లైన్ లక్కీ డిపి లో మాత్రమే లభిస్తాయి
రోజుకి 25 టికెట్స్ మాత్రమే ఉంటాయి.
బుధవారం నాడు కొండపైన ఆఫ్ లైన్ లక్కీ డిప్ పాల్గొనాల్సి ఉంటుంది
సెలెక్ట్ అయిన వారు గురువారం ఈ తిరుప్పా వడ సేవలో పాల్గొనవచ్చు.
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
#tirumala , tirumala tiruppavada seva, tirumala latest information. tirumala seva tickets darshan details.