Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

మంచి నీతి కథ చదవండి | Stories With A Moral Archives | Hindu Temple Guide


ఒక ఉడత నుండి మనం నేర్చుకోగల మంచి నీతి కథ... చదవండి
రామాలయం ప్రాంగణంలో ఉన్న జామ చెట్టెక్కి, పండు కొరికి తింటున్నది చిన్నారి ఉడుత. ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి! దాంతో చెట్టు దిగి, శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది..

"శ్రీరాములవారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు! వాళ్లకంటే చిన్న జంతువు- ఉడుత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందిట!
అందుకు రాములవారు సంతోషించి, ఉడుతను దగ్గరకు తీసుకొని, దాని వీపును ప్రేమగా నిమిరాడట! దానికి గుర్తుగానే ఉడుత వీపు మీద చారలు ఉంటాయట" అని శాస్త్రి గారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడుత కూడా శ్రద్ధగా విన్నది.

"ఏంటీ! నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా?! రామయ్య వ్రేళ్ల గుర్తులా ఇవి! ఆహా! నేనెంత గొప్పదాన్ని?! నా గురించి నాకు తెలీకుండా ఇట్లా పెరిగానే?! ఇప్పుడు చెబుతాను!" అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడలేని సంతోషం వేసింది దానికి. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి, ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది.

అట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతూ పోతున్న ఉడుతకు దాని ఫ్రెండ్స్ ఎలుక, తాబేలు ఎదురయ్యాయి.
వాటిని చూస్తే ఉడుతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవాళ్ల ఎందుకో, అవి రెండూ ఒట్టి పనికిమాలినవి అనిపించాయి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్ధయింది ఉడుతకి.
అది అట్లా పైకి పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక, తాబేలు కూడా దాని వెంట పరుగుపెడుతూ "ఆడుకుందామారా?" అని అడిగాయి అనురాగంతో.

"నేనా?! మీతో ఆడాలా?! అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో? నా వీపుపైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు? ఇవి మామూలు చారలు కాదు! రామయ్య తండ్రి
వేళ్ళ గుర్తులివి! నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి?! పోండి, పోండి!" అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడుత.

అంతలో ఎదురుగా కనిపించాడు గున్నేనుగన్నయ్య. "ఏయ్‌! నీ ఫ్రెండ్స్ ఏరీ, ఆడుకోవడం లేదా?" అన్నాడు.
"లేదు లేదు" అంటూ రాగం తీసి, "ఆ విలువ లేనోళ్ళతో ఆడనన్నాను" అంది ఉడుత.
"అయ్యో! అదేమి? విలువ లేదంటావేమిటి? వాళ్ళు మంచోళ్ళేనే? రోజూ నీతోటి ఆడుకుంటుంటారు కదా?" "నిజమే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నా వీపున చారలున్నై. ఇవి ఎలా వచ్చినై? రాముల వారు.. "అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడుత.

అంతా విని ఆగకుండా నవ్వింది గున్న ఏనుగు. "ఎందుకు, నవ్వుతున్నావు?" అని అడిగింది ఉడుత, కోపంతో...

"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావే, మరి ఇంక ఎలుక ఎంత గర్వపడాలి, ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా?! మరి ఇంక తాబేలు సంగతికొస్తే, విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు గదా?! అసలు ఇప్పుడు ఆ ఎలుక, తాబేలే 'నీతో‌ స్నేహం చెయ్యం పో!’ అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, చెప్పు?! మరలా పడి పడి నవ్వింది ఏనుగు..

నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను విను తల్లీ, నువ్వు వాటి 'మంచితనాన్నే' 'చేతకానితనం' అనుకున్నావు. అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు- అంతకు మించి ఏమీ లేదు" అంటూ ముందుకు సాగింది ఏనుగు.

దాని మాటలు వినగానే ఉడుత తలకెక్కిన గర్వమంతా టప్పుమని ఎగిరిపోయింది. సృష్టిలోని ప్రతి జీవికీ దానిదైన గొప్పతనం ఉందని అర్థమై, తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు వెనక్కు తిరిగి పరుగులు తీసింది..
Famous Posts:
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

devotional moral stories, short devotional stories with morals, short devotional stories for youth, hindu devotional stories, devotional stories in telugu, moral stories from vedas, short religious story with moral, devotional stories in hindi, devotional stories for kids

Comments

Popular Posts