Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***2022 జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం(ఎస్ఎస్‌డి) టోకెన్ల‌ను డిసెంబ‌రు 27వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. *** తిరుమల న్యూస్ : జనవరి 13న వైకుంఠ ఏకాదశి 10 రోజులు పాటు ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది @.. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

72 యక్ష ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు | Yaksha Prasnalu | Hindu Temple Guide


యక్ష ప్రశ్నలు అంటారు, విన్నారా?

మహా భారతం లోని అరణ్య పర్వంలో, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే, ఈ యక్ష ప్రశ్నలు.

ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. అవి క్లుప్తంగా...

Also Readమీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం 

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ? బ్రహ్మం

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం

5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును? వేదం

6. దేని వలన మహత్తును పొందును? తపస్సు

7. మానవునికి సహాయపడునది ఏది? ధైర్యం

8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము..

Also Readఅప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి? 

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మృత్యుభయం వలన

12. జీవన్మృతుడెవరు? దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు

13. భూమి కంటే బరువు/ భారమైనది ఏది? జనని /తల్లి రుణం

14. ఆకాశం కంటే పొడవైనది/ ఉన్నతమైనది ఏది? తండ్రి

15. గాలికంటే వేగమైనది ఏది? మనస్సు

16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.

17. తృణం కంటే దట్టమైనది ఏది? చింత

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయటం వలన

Also Readమంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

21. జన్మించియు ప్రాణం లేనిది? గుడ్డు

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? రాయి

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది

25. రైతుకి ఏది ముఖ్యం? వాన

26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు

27. ధర్మానికి ఆధారమేది? దయదాక్షిణ్యం

28. కీర్తికి ఆశ్రయమేది? దానం

29. దేవలోకానికి దారి ఏది? సత్యం

30. సుఖానికి ఆధారం ఏది? శీలం

Also Readకొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

31. మనిషికి దైవిక స్నేహితుడు / బంధువులెవరు? భార్య / భర్త

32. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు

33. మానవునకు జీవనాధారమేది? మేఘం

34. మనిషికి దేనివల్ల సంతసించును? దానం

35. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం

36. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు

39. ఎవరితో సంధి శిధిలమవదు? సజ్జనులతో

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? యాగకర్మ

Also Readభర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

41. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు

43. లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ఞానం

44. శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు

45. మనిషి దేనిని విడచి స్వ్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో...

46. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తికుల ధర్మం ఆచరించడం

47. క్షమ అంటే ఏమిటి? ద్వందాలు సహించడం

48. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం

49. సర్వధనియనదగు వాడెవడు? ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు

50. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం

Also Readకూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

51. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం

52. అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండటం

53. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట

54. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం

55. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం

56. స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం

57. దానం అంటే ఏమిటి? సమస్తప్రాణుల్ని రక్షించడం

58. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు

59. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు

60. ఏది కాయం? సంసారానికి కారణమైంది

Also Read :  భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

61. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం

62. డంభం అంటే ఏమిటి? తన గొప్పతానే చెప్పుకోవటం

63. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో

64. నరకం అనుభవించే వారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మ శాసా్త్రల్నీ, దేవతల్ని, పితృదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు

69. జీవితం మొత్తము మీద సుఖముగా ఉండే వాడు ఎవరు? ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు

70. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతి రోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ, మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం

Also Readసంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

71. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు? ప్రియయూ అప్రియయూ, సుఖమూ దుఃఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు

72. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు? నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదుఃఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడై ఎవరైతే ఉంటాడో వానిని.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

యక్ష ప్రశ్నలు,  ధర్మరాజు, Yaksha Prasnalu, yaksha prashna questions and answers, yaksha prashnalu garikapati, yaksha prashna pdf, yaksha prashna Telugu, 72 Yaksha Risky questions, 

Comments

Popular Posts