Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి | Kanakadhara Stotram Meaning and Benefits

కనకధార_స్తోత్రం ..ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి.

శ్రీ శంకర భగవత్పాదులు ఒక రోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తన వద్ద యేమి లేకపోయే సరికి బాధతో..., ఇల్లంతా వెతికితే ఒక ఉసిరికాయ మాత్రమే ఆమెకి దొరికింది...

Also Readశుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

"స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది " అని గురువుకి సమర్పించింది... 

ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి,

ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు....లక్ష్మీదేవి ప్రసన్నయై,

స్వామి కోరినట్లు,ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది... ఆ స్తోత్రమే కనకధార_స్తోత్రం.

ఈ స్తోత్రమును పఠించిన వారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది.

1. అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ

భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం

అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా

మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః

భావం :- మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడు తుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురముల తోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక..

Also Readభార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

2. ముగ్ధాముహు ర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని

మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయ

సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః

భావం :- పెద్ద నల్లకలువపై నుండు ఆడు తుమ్మెదవలె శ్రీహరి ముఖము నందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక...

Also Readశ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 

3. ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం

ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం

ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం

భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః

భావం :- నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక...

Also Readకొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

4. భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే య

హారావలీవ హరినీలమయీ విభాతి

కామప్రదా భగవతోపి కటాక్షమాలా

కల్యాణమావహతు మే కమలాలయాః

భావం :- భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక..

Also Readభర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

5. కాలాంబుదాలి లలితోరసి కైటభారేః

ధారా ధరే స్ఫురతి యా తటిఙ్గ నేవ

మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

భావం :- కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక...

Also Readకూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

6. ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్

మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన

మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం

మందాలసం చ మకరాలయ కన్యకాయాః

భావం :- ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తి యగు మధుసూదనుని యందు ముఖ్య స్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించును గాక....

Also Readసాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

7. విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం

ఆనందహేతు రధికం మధువిధ్విషోపి

ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం

ఇందీ వరోదర సహోదర మిందిరాయాః

భావం :- సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరి యగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్ల కలువ లను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక...

Also Readకాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

8. ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర

దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే

దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్క్రవిష్తరయ

భావం :- పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టి వలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్ర పదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక...

Also Readసంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

9. దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారా

అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే

దుష్కరమ ఘర్మ మపనీయ చిరాయ దూరం

నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

భావం :- శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయా వాయు ప్రేరితమై, నా యందు చాలాకాలము గా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించును గాక...

Also Readభస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

10. గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి

శాఙ్కభరీతి శశిశేఖర వల్లభేతి

సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ

తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై

భావం :- వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము...

Also Readమహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు.

11. శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై

రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై

శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై

పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

భావం :- పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము...

Also Readమంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

12. నమోస్తు నాళీక నిభాననాయై

నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై

నమోస్తు సోమామృత సోదరాయై

నమోస్తు నారాయణ వల్లభాయై

భావం :- పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము

Also Read మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం 

13. నమోస్తు హేమాంభుజ పీఠికాయై

నమోస్తు భూమణ్డల నాయికాయై

నమోస్తు దేవాది దయాపరాయై

నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై

భావం :- బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము...

Also Readవాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

14. నమోస్తు దేవ్యై భృగు నందనాయై

నమోస్తు విష్ణోరురసి స్థితాయై

నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమోస్తు దామోదర వల్లభాయై

భావం :- భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము..

Also Read :  భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

15. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై

నమోస్తు దేవాదిభి రర్చితాయై

నమోస్తు నందాత్మజ వల్లభాయై

భావం :- తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము..

Also Readమీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

16. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి

త్వద్వందనాని దురితా హరణోద్యోతాని

మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

భావం :- పద్మముల వంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి.., ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక...

Also Read :  దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?

17. యత్కటాక్ష సముపాసనా విధిః

సేవకస్య సకలార్ధ సంపదః

సంతనోతి వచనాఞ్గ మానసై

త్వాం మురారి హృదయేశ్వరీం భజే

భావం :- ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును...

Also Read : ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

18. సరసిజనిలయే సరోజ హస్తే

ధవళతమాం శుక గంధమాల్యశోభే

భగవతి హరివల్లభే మనోఙ్ఞే

త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం

భావం :- కమలముల వంటి కన్నులు గల ఓ తల్లీ, చేతి యందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము...

Also Read స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

19. దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం

ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష

లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధి పుత్రీం

భావం :- దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను...

Also Readనిమ్మకాయల దీపం పెట్టటం వలన కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

20. కమలే కమలాక్ష వల్లభేత్వం

కరుణాపూర తరఙ్ఞితై రపాఙ్ఞైః

అవలోకయ మా మకిఞ్చనానాం

ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః

భావం :- శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణా కటాక్షముతో చూడుము...

Also Read : అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం

21. స్తువంతి యే స్తుతిభిరమాభిరన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం రమాం

గుణాధికా గురుతర భాగ్యభాగినో

భవంతి తే భువి బుధ భావితాశయాః

భావం :- ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నరు...

Also Readఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు

22. సువర్ణ ధారాస్తోత్రం య చ్చఙ్కరాచార్య నిర్మితం

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమోభవేత్

భావం :- శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారాస్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును.

వివరణ : ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా భక్తి ముఖ్యం.... భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలో పోసిన నీళ్ళ వలె వృధా అవుతుంది... సర్వం మహాలక్ష్మీ ఆధీనం. ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు.

Also Readసూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

 కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు. వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహ పాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది.

అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి... 

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

Kanakadhara Stotram, kanakadhara stotram miracles, kanakadhara stotram benefits in telugu, kanakadhara stotram pdf, kanakadhara stotram story, kanakadhara stotram in telugu, కనకధార స్తోత్రం, lakshmi devi stotrams

Comments

Popular Posts