తల్లితండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుంది అని పూర్వీకులు చెబుతుంటారు. అయితే దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లితండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటు౦బంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం పితృ దేవతలకు శ్రాద్దం నిర్వహించనందువలన పిత్రుశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు. సంతానం కలగదు. వ్యాపారాలలో నష్టం మొదలయినవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది.
ఆడా, మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే, ఆ పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా, కాల క్రమేనా అవయవాలు పాడవడం జరుగుతుందని కొంత మంది పండితులు చెబుతున్నారు. దానినే "వంశపార్యపరం" అంటారు. అందుకే మనం వయసులో "ధర్మoగా" ఉంటే, మనకు పుట్టే వారు కూడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు.
Also Read : అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?
|| గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పిడోపశాంతయే || అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తోలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినపుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై ఆ ప్రభావం ఉంటుంది.
ఈ లోకంలో ఉండే అన్ని జీవులలో దత్తుడు ఉన్నాడు. అంటే గురు అవతారం దత్తాత్రేయుడు తెలిసో తెలియకో ఇతరులను విమర్సి౦చడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.
Also Read : మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.
ఇలా ఎన్నో రకాలుగా తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది.
Related Posts:
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
తల్లిదండ్రులు, పాపం, పిల్లలు, Talli Tandrulu, Tappulu, dharma sandehalu telugu, dharma sandehalu telugu book, parents meaning, parents, importance of parents, devotional Story's.
Comments
Post a Comment