4.పాశురము
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్ ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్ ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు తాళాదే శార్ జ్ఙముదైత్త శరమళైపోల్ వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్
భావము: ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురాలు:
Tags: తిరుప్పావై, పాశురాలు, తిరుప్పావై పాశురాలు, Thiruppavai, Thiruppavai 1 to 30 Pasurams, Thiruppavai Telugu , Thiruppavai 4th Day Pasuram, Pasurams Telugu, Tiruppavai Pasurams pdf