శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి? Symbolism Behind The Form Of Shiva
శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి?
ఆది పరాశక్తి , జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయ్యి శివుడు అర్ధనారీశ్వరుడైనాడు. గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులు గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు, వాటికి ఈశ్వరుడికి గల సంబంధం గురించి కొంత తెలుసుకుందాం.
Also Read : ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను | ధన దేవతా స్తోత్రం
నంది (ఎద్దు):- శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్త మిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల కనబడుతుంది.
శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని నందీశ్వరుని చెవులవద్ద భాదలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు.
త్రిశూలము :- శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము.
శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది.
త్రిశూలములో ఉండే మూడు వాడి అయిన మొనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక,
చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి.
Also Read : దుర్గామాత రూపాలను తలచుకుని ప్రార్థిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయట.
నెలవంక చంద్రుడు :- శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందుమత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.
నీలిరంగుకంఠం :- శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతిదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు.
రుద్రాక్ష :- శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తాడు. అంతే కాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' ( శివ యొక్క మరొక పేరు ) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్లినాయి.
Also Read : శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ.
పాము :- శివుడు ఆయన మెడ చుట్టూ మూడు సార్లు చుట్ట బడిన ఒక పామును ధరిస్తారు. పాము మూడు చుట్టలకు అర్ధం .భూత,వర్తమాన,భవిష్యత్ కాలాలను సూచిస్తాయి.నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది.
మూడో కన్ను:- శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపాని గురిఅయినప్పుడు చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది.అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వ వ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది.
డమరుకం :- శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు.
Also Read : దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!
జటా :- అట్టకట్టుకొని పీచులాగా ఉన్న జుట్టు.సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది.
కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది.శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.
Also Read : సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్
శివుడిని భక్తితో కోలిస్తే తనపై ఒక్క చెంబేడు నీళ్ళను మంచి మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరునించే బోళాశంకరుడు.శివపంచాక్షరీ ఆపదకాలంలో శివ భక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది.
Famous Posts:
> దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది
> భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.
> ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు
> చాలామందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం
> ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
> ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి
> నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..?
> అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!
> భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం
lord shiva puja procedure, which flower is not used for shiva puja, shiva pooja mantras, how to worship lord shiva, lord shiva likes and dislikes, how to please lord shiva for marriage, shiva puja at home in tamil, signs that lord shiva is with you, damarukam, nandiswara, trisulam, nandi
Comments
Post a Comment