Drop Down Menus

Tiruppavai Pashuram Day 13 in Telugu - Meaning | తిరుప్పావై పదమూడవ రోజు పాశురం - పద్యం మరియు భావము

Thiruppavai 13 Pasuram Lyrics in Telugu

13.పాశురము

పుళ్ళిన్ వాయ్ కీజ్ఞానై పొల్లావరక్కనై క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్ గల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్ వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్జిత్తు ప్పుళ్ళుమ్ శిలుంబినకాణ్, పోదరిక్కణ్ణినాయ్ కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే పళ్ళిక్కి డత్తియోపావాయ్ ! నీ నన్నాళాల్ కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్

భావము: కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరును సంకేతస్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను. ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా!

నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీ కృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! ఇంకను పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతము సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును' అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.

1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:

తిరుప్పావై 1వ పాశురం

తిరుప్పావై 2వ పాశురం

తిరుప్పావై 3వ పాశురం

తిరుప్పావై 4వ పాశురం

తిరుప్పావై 5వ పాశురం

తిరుప్పావై 6వ పాశురం

తిరుప్పావై 7వ పాశురం

తిరుప్పావై 8వ పాశురం

తిరుప్పావై 9వ పాశురం

తిరుప్పావై 10వ పాశురం

తిరుప్పావై 11వ పాశురం

తిరుప్పావై 12వ పాశురం

తిరుప్పావై 13వ పాశురం

తిరుప్పావై 14వ పాశురం

తిరుప్పావై 15వ పాశురం

తిరుప్పావై 16వ పాశురం

తిరుప్పావై 17వ పాశురం

తిరుప్పావై 18వ పాశురం

తిరుప్పావై 19వ పాశురం

తిరుప్పావై 20వ పాశురం

తిరుప్పావై 21వ పాశురం

తిరుప్పావై 22వ పాశురం

తిరుప్పావై 23వ పాశురం

తిరుప్పావై 24వ పాశురం

తిరుప్పావై 25వ పాశురం

తిరుప్పావై 26వ పాశురం

తిరుప్పావై 27వ పాశురం

తిరుప్పావై 28వ పాశురం

తిరుప్పావై 29వ పాశురం

తిరుప్పావై 30వ పాశురం

Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 13వ పాశురం

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments