Drop Down Menus

అమ్మవారి చీరలు భక్తులు ధరించవచ్చా ?, Can devotees wear Goddess saree? Dharma Sandehalu

అమ్మవారి చీరెను భక్తులు ధరించవచ్చా ?

సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింప చేసిన చీరె(శేష) వస్త్రాన్ని భక్తులు(మహిళలు) ధరించవచ్చా..?

అందులో  లాభాలేంటి ? 

పాటించాల్సిన నియమాలేంటి? 

ఈ విషయాలను తెలుసుకోవాలంటే మనం ఈ వార్త చదవాల్సిందే.

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి ఉంటారు. పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఆ దేవాలయాలకు క్యూ కడుతుంటారు.

పూలు, కుంకుమ, గాజులు, చీరె, రవికెలను కానుకలుగా సమర్పిస్తుంటారు. ఆ చీరెను విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింప చేయమని పూజారులకు చెబుతుంటారు.

👉ఆ తరువాత ఇలాంటి చీరెలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. ఆ చీరె దక్కితే చాలని చాలా మంది భక్తులు వేలంలో కొనుక్కుంటుంటారు.

అయితే అసలు అమ్మవారి చీరె(శేష వస్త్రం)ను సాధారణ మహిళలు ధరించవచ్చా ? 

అనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. అమ్మవారి చీరెలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి.

కానీ, ధరించినప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి? 

ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో.. ఆ చీరెను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి.

అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి.

అమ్మవారి శేష వస్త్రాన్ని ధరించే ముందు తిథి – వర్జ్యం చూసుకుని “శుక్రవారం” రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి.

ఈ చీరెను ధరించినంత సేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరెను ధరించ కూడదు. ఆ చీరెను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది.

అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా కాకుండా నియమాలను పాటించకపోతే, ఫలితం ఉండదు. ఆ పవిత్రత మనకు దక్కదు.

Famous Posts:

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

అమ్మవారి చీరలు భక్తులు ధరించవచ్చా ?, Can devotees wear Goddess saree?, 

how to do arti of god, deity sarees, sarees sale, garments offered, wash water, adiparasakthi, bhakthi, dharma sandehalu telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.