Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ఏప్రిల్ 25న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.***ఉచిత దర్శనం టిక్కెట్ల జారీ TTD వారు, ప్రతి రోజు తిరుపతిలో 30,000 ఉచిత దర్శన టిక్కెట్లను (రోజుకు) దిగువ ప్రదేశాలలో జారీ చేయనుంది • భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి బస్టాండ్ దగ్గర) * శ్రీనివాసం కాంప్లెక్స్ (బస్టాండ్ దగ్గర)** గోవిందరాజ స్వామి చౌల్ట్రీ (రైల్వే స్టేషన్ వెనక)@.. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

మన సమస్యలను మన బాధలను తొలగించుకునేందుకు సరైన సమయం దేవి నవరాత్రులు....| Devi Navaratrulu Special

వరాత్రి దీక్ష...చేయవలసిన విధానం...ఆచరించవలసిన.... పద్ధతులు....

మన సమస్యలను మన బాధలను     తొలగించుకునేందుకు సరైన సమయం దేవి నవరాత్రులు....

ప్రతి మనిషి ఏదో ఒక  సమస్యతో బాధపడుతూ ఉంటాడు వారి జీవిత కాలంలో ఎంత ప్రయత్నించినను వాటికి పరిష్కారం లభించదు కొందరికి ఎన్ని పూజలు చేసిన ఫలితం దొరకదు చాలామందికి తరచుగా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

ఇటువంటి సమస్యలకు సమాధానం దేవీ నవరాత్రి దీక్ష

నవరాత్రి దీక్ష : అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే అన్న లోకోక్తి అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదిస్తే దొరకనిది జరగనిది రానిది కానిది అంటూ ఏదీ ఉండదు

అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సరైన సమయం ఈ దేవీ నవరాత్రులు

భక్తిశ్రద్ధలతో నవరాత్రి దీక్షను ప్రతి ఒక్కరు ఆచరించి మీ యొక్క సమస్యలను దూరం చేసుకోండి

నవరాత్రి దీక్ష విధానం : అవకాశం ఉన్నవారు శరీరం సహకరించేవారు ఉదయాన్నే స్నానమాచరించి గురువుల వద్ద నవరాత్రి దీక్షను చేపట్టండి

నవరాత్రి మాలను ధరించండి

నవరాత్రి దీక్ష చేయలేని వారు: 

తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం స్నానం ఆచరించి అమ్మవారి పూజలు చేసుకోవాలి దీక్ష కంకణాన్ని చేతికి కట్టుకోవాలి చెప్పులు ధరించకూడదు శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి.

సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి

అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టండి

లలితా సహస్రనామాలు చదవడం వస్తే ఉదయం సాయంత్రం రెండు పూటలా కానీ వీలు లేని వారు ఒక్క పూట అయినా కానీ పారాయణం చేయండి

చదవడం రానివారు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి

సహస్ర నామాలు చదివేంత సమయం లేని వారు దుర్గ సప్త శ్లోకి ఎక్కువసార్లు వినడానికి ప్రయత్నం చేయండి

సప్తశ్లోకి చదవడం వచ్చిన వారు ఎక్కువ సార్లు పారాయణం చేయండి

శక్తి ఉన్నవారు తొమ్మిది రోజులు రోజుకు ఒక కుటుంబానికి అయినా తోచిన సహాయం దానం చేయండి

9రోజులు రోజుకు ఒక మంచి పని అయినా చేయండి 

నవరాత్రి దీక్ష చేసే వారు మెడలో దీక్ష వస్త్రం ధరించాలి

దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం మహిమ : ఈ స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది ఎటువంటి ఆపదలను అయినా తొలగిస్తుంది

ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం చేయవలసిన సోత్రం ఇది

ఈ నవరాత్రి సమయంలో ఈ స్తోత్రాన్ని ఎంత ఎక్కువగా పారాయణం చేస్తే అంత శుభ ఫలితాలు ఏర్పడతాయి

దీక్ష నియమాలు చేయలేనివారు కనీసం ఈ ఒక్క స్తోత్రం పారాయణం చేసినా సరిపోతుంది

పైన చెప్పినవి ఆచరించడానికి వీలు లేని వారు తొమ్మిది రోజులు చెప్పులు ధరించకండి దీక్ష ఉండండి మీకు తోచిన విధంగా అమ్మవారి సేవ చేసుకోండి

నిజమైన దైవం ఆలయాల్లో విగ్రహాల్లో లేదు 

ప్రతి మనిషిలో దైవం ఉన్నాడు మనిషి మనిషికి సహాయం చేసినప్పుడే దైవం కరుణిస్తుంది

కాబట్టి  అశాశ్వతమైన డబ్బు కోసం అశాశ్వతమైన ఈ దేహం కోసం ఇతరులను విమర్శించకండి ఇతరులను ఇబ్బంది పెట్టకండి ఇతరులకు హాని చేయకండి సోదర సోదరి భావంతో మెలగండి 

శక్తి మేర ఇతరులకు ఏ రూపంలో అయినా సరే సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి.

అమ్మవారి కృప కటాక్ష వీక్షణాలు అందరి పైన సదా ఉండాలని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా జగన్మాతను వేడుకుంటున్నాను...

అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం.. నవరాత్రి దీక్ష చేయండి ..... అమ్మను ఆశ్రయించడానికి అమ్మ అనుగ్రహం పొందడానికి ఇదే సరైన సమయం.....

నవరాత్రి, navratri 9 days devi names, devi navaratri 2021, devi navaratri 2021 telugu, devi navaratri alankaram and prasadam, 10 points on navratri, chaitra navratri, which goddess is worshipped on each day of navratri, what is navratri, 

Comments

Popular Posts