27.పాశురము
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్ద ఉన్దన్నై ప్పాడిప్పటై కొణ్ణుయామ్ పెఱుతెమ్మానమ్ నాడుపుగళుమ్ పరిశినాల్ ననాగ చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే, పాడగమే, యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్, ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు మూడ నెయ్ పెయ్ దు ముళదైవళివార కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్
భావము: నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి.
భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లే!
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 27వ పాశురం
Comments
Post a Comment