Drop Down Menus

పెళ్లికి అడ్డొచ్చే విగ్నాలు తొలగించే అద్భుతమైన కళ్యాణ క్షేత్రాల గురించి మీకు తెలుసా ? Do you know about the amazing wedding fields that remove the vignettes that hinder the wedding?

పెళ్లికి అడ్డొచ్చే విగ్నాలు తొలగించే అద్భుతమైన కళ్యాణ క్షేత్రాల గురించి మీకు తెలుసా ?

ఈ 11 దివ్యక్షేత్రాల యాత్ర మూడు రోజుల సమయం పడుతుంది. దీనినే కల్యాణ క్షేత్రాల పర్యటన అని అంటారు. అంటే పెళ్లి కానీ అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా పెళ్లి కావాలన్నా, పెళ్ళికి అడ్డొచ్చే విగ్నాలు తొలగిపోవాలన్న ఈ క్షేత్రాలని దర్శిస్తే అన్ని తొలగిపోయి శుభం కలుగుతుందని నమ్మకం.

మరి ఈ క్షేత్రాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి? అక్కడ కొలువై ఉన్న స్వామివారు, అమ్మవారు ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు రాష్ట్రంలో త్వరగా పెళ్లయ్యేలా దీవించే కొన్ని దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలన్నిటిని కలిపి కల్యాణ క్షేత్రాల పర్యటన అని అంటారు. ఈ పర్యటన కోసం తమిళనాడు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రేత్యేకంగా ఒక ప్యాకేజి కూడా ఏర్పాటు చేసింది. ఇక మూడు రోజుల సమయం పట్టే ఆ 11 క్షేత్రాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముదిచూర్:

చెన్నై లో ఉండే ఈ ఆలయం దర్శనంతో ఈ యాత్ర అనేది మొదలువుతుంది. ఈ ఆలయంలో విద్యంబిగై అమ్మవారు కొలువై ఉన్నారు.

తిరువిడనత్తై:

ఈ ఆలయం మహాబలిపురం దగ్గరలో ఉంది. ఇక్కడ శ్రీలక్ష్మి వరాహస్వామి ఆలయం ఉంది. అయితే తేత్రాయుగంలో కలవుడు అనే మహర్షికి జన్మించిన 360 మంది కుమార్తెలను శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతుంది.

తిరుమణంజేరి:

ఈ ఆలయంలో శివుడిని కల్యాణ సుందరేశ్వర్ గా కొలుస్తారు. ఇక్కడే శివపార్వతుల వివాహం జరిగిందని చెబుతారు.

ఉప్పళియప్పన్:

ఇది ఒక వైష్ణవ క్షేత్రం. అయితే మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలికగా లభించింది. ఆమె కోకిలంబాల్ పేరుతో పెరిగి శ్రీ మహావిష్ణువుని చేసుకుందని పురాణం.

నాచ్చియార్ ఆలయం:

ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు నరైయూరు నంబిగా, అమ్మవారు నాచ్చియార్ గా కొలుస్తారు. అయితే 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు.

తిరుకరుకావుర్:

ఈ శివాలయంలోని శివలింగం ఒక పుట్టమన్నుతో తయారైంది. అందుకే ఆ మన్ను ఎక్కడ కరుగుతుందో అనే భయంతో ఇక్కడ స్వామికి ఎలాంటి అభిషేకాలు ఉండవు.

తిరుచ్చేరై:

ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సామెత సారనాధుడిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ అమ్మవారికి సారనాయికి అనే పేరు. అయితే కావేరి నదీదేవి శ్రీహరిని వివాహం చేసుకుంది ఇక్కడే అని పురాణం.

మధురై:

ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గొప్ప దివ్యక్షేత్రం. ఈ ప్రాంతం లోనే పాండ్యరాజు తన కుమార్తె మీనాక్షి దేవి చొక్కనాథుడైన పరమేశ్వరునకు ఇచ్చి వివాహం చేసాడని పురాణం. ఇక అనాదినుండి మధుర మీనాక్షి అమ్మవారిని పెళ్లికాని అమ్మాయిలు దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.

తురునల్లూరు:

ఇక్కడ శివుడు పంచావర్ణేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఈ స్వామిని కల్యాణ సుందరేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు. ఇంకా శివపార్వతుల వివాహం అగస్త్యుడు ఈ ప్రాంతం నుండే చూశాడని పురాణం.

తిరువేడగం:

ఈ ఆలయం వేగై నది తీరాన ఉంది. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని ఏడగానాథర్ అని పిలుస్తారు.

తిరువిళిమిలై:

ఇది ఒక గొప్ప శైవక్షేత్రం. శివుడు కాత్యాయనీ దేవిని వివాహం చేసుకున్న ప్రదేశం ఇదేనని పురాణం. ఇక్కడ స్వామివారిని విలీనాథుడు అని పిలుస్తారు.

ఇలా ఈ 11 కల్యాణ క్షేత్రాలను దర్శిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోయి త్వరగా వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

marriage temple in tamilnadu, temple for marriage wish fulfillment, hindu temple marriage requirements,kalyana kshetralu tamil nadu, Nithya Kalyana Perumal Temple, marriage remidies telugu.

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON