Drop Down Menus

Pancharama Kshetras Information in Telugu | Pancharama Kshetras History Route Map

pancharama kshetras


పంచారామ క్షేత్రాలు మొత్తం 5 క్షేత్రాలు . ఈ క్షేత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి . తూర్పు గోదావరి జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో ఒక క్షేత్రము ఉంది. పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయంటే సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడింది , ఆ 5 ప్రదేశాలలో దేవతలు శివలింగాలని ప్రతిష్టించారు అవే  పంచారామాలు అవి తూర్పుగోదావరి జిల్లా లోని ద్రాక్షారామం, కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, గుంటూరు జిల్లా లోని అమరారామం. 

ఇవి చదివారా ?
సోమారామము
శ్రీ కుమారభీమారామము
క్షీరారామం
అమరారామం
ద్రాక్షారామం

దాక్షారామం :

పంచారామ క్షేత్రాలలో ద్రాక్షారామం ఒకటి . పూర్వం దక్ష రామం గా పిలిచేవారు . దక్షుడు ఇక్కడే యజ్ఞం చేసారని స్థలపురాణం. ద్రాక్షరామం కాకినాడకు 30 కిమీ , రాజమండ్రికి 40 కిమీ దూరం లోను ఉంది.  తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య ఈ ఆలయం  నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. 

కుమారభీమారామము :

ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ కు దగ్గర్లో కలదు.   ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి. ఇక్కడ శివ లింగం 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం సా.శ.892లో ప్రారంభమై సుమారు సా.శ.922 వరకు సాగింది. సామర్లకోట నుంచి ద్రాక్షారామం 42 కిమీ దూరం ఉంటుంది. 

సోమారామం : 

పశ్చిమ గోదావరి జిల్లాలో  భీమవరం (గునిపూడి) లో సోమారామము క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవారు పైఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి. భీమవరం నుంచి క్షీరారామ క్షేత్రం ఉన్న పాలకొల్లు 24 కిమీ దూరం లో ఉంది. 


క్షీరారామము :

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధనుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపై పడతాయి. పాలకొల్లు నుంచి భీమవరం 24 కిమీ దూరం . 


అమరారామము : 

అమరారామం గుంటూరు జిల్లాలో అమరావతి లో ఉంది. ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల శాసనాలను చూడవచ్చును. ముఖమండపంలోని ఒక స్తంభంపై కోట రాజు శాసనాన్ని ఉన్నాయి. ఈ దేవాలయంలోని శివలింగాని దేవతలరాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీ రామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచింది.త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి. అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది.ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా వుండుటవల్ల అర్చకులు ఒక పీఠమీద ఎక్కి, ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూవుంటారు.ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రనిరంగు మరక ఉంది. ఆ మరకే రక్తపు మరక.శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తలమీద కొట్టడంజరిగింది. శివలింగంపైభాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికీ ఆ రక్తపు మరక ఉంది.దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి

గుంటూరు నుండి 40 కిలోమీటర్లు దూరంలో ఉంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు


ఆంధ్ర లో మూడు శక్తి పీఠాలున్నాయి : 

ఆంధ్రప్రదేశ్ లో  మూడు శక్తి పీఠాలున్నాయి . దాక్షారామం లో మాణిక్యాంబ  లోను , పిఠాపురం లోను మరియు శ్రీశైలం లోను శక్తి పీఠాలున్నాయి . 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.