పంచారామాల్లో ఒకటైన సోమారామము ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరమునకు రెండు కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో గ్రామంలో ఉంది.ఇక్కడ భక్త సులభుడైన పరమశివుడు సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూఉంటాడు.
Temple Timings
5.00 am to 11.00 am
4.00 pm to 8.00 pm
ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. పంచారామాల్లో భీమవరం ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం ఎంతో విశిష్టమైనది.
ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది.
చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. క్రీ.శ.3 వ శతాబ్ద చాళుక్య భీములు నిర్మించిందిగా శాసనాలు చెబుతున్నాయి.చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్నినిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలువబడుతుంది.
ఆలయపు ముందు బాగమున కోనేరు కలదు ఈ కోనేరు గట్టున రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము కలదు ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది.
అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.
ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.ఆలయంలో శివుడి గుడి పై భాగంలో అన్నపూర్ణమ్మ వారి కొలువై ఉండడం మరో ప్రత్యేకత.
అలాగే పంచ నందీశ్వరాలయంగా కూడా ఈ ఆలయానికి పేరు. దేవాలయం ముందు భాగంలో రెండు నందులు, ధ్వజస్తంభం వద్ద మరో నంది, ఆలయ ప్రాంగణంలో ఒక నంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది.
మన దేశంలోని ఎన్నో ప్రవిత్రమైన పుణ్య క్షేత్రాలు ఉన్నాయి అందులో జరిగే అంతుచిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అదే విధంగా ఇక్కడి ఈ ఆలయంలోని స్వామి వారి శివలింగం రంగులు మారుతూ ఉంటారు.
మనం నిచ్చం ఈ ఆలయాన్ని దర్శించిన మనం గమనించాము, ఈ సారి వెళ్ళినప్పుడు తప్పకుండా గమనించండి.
దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయంలో ఉన్న శివలింగం శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమ క్రమముగాఅమావాస్య వచ్చే సరికి భూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది, తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది.
ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. అమావాస్య నాడు నలుపు వర్ణంలోను, పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.
ఈ మర్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది.ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
Related Postings:
Near By famous Temples:
1.Dworaka tirumala
2.Bheemeswara Swamy Temple (Draksharamam)
Transport
By Road:
Palakollu is located at the National Highway-214, A.P.S.R.T.C operates buses from Palakollu to major cities like Hyderabad, Visakhapatnam, Vijayawada, Tirupati etc.
By Train:
The nearest Railway station is Palakollu Railway Station which is 1.7 kilometers away from the Temple. Almost all Trains are stopped at Palakollu in Narsapur – Vijayawada railway route.
By Air:
The nearest Domestic Airport is Rajamundry Airport it is 81 kilometers away from the Temple.
Keywords:
Pancharama kshetras,bhimavaram someswara swamy temple timings,Somarama Temple Bhimavaram Timings, Poojas & History Guide,sri someswara temple bhimavaram, andhra pradesh,someswara swamy temple bhimavaram,bhimavaram surrounding temples,sri mavullamma vari temple bhimavaram andhra pradesh,mavullamma temple bhimavaram, andhra pradesh,famous temples near bhimavaram,bhimavaram temple history,Bhimavaram Someswara Temple (భీమవరం సోమేశ్వర ,Gunupudi Someswara Temple (గునుపూడి సోమేశ్వర,శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి విశిష్టతలు,bhimavaram someswara swamy temple radham,Gunupudi Bhimavaram Sri Someshwara Janardhana Swamy,The temple here is called Sri Someshwara Janardhana swamy, The attraction of Bhimavaram is spiritual as the temple dedicated to Lord Shiva, Sri Someswara Janardhana swamy , Very good South Indian food is available in the town.Someswara Swamy Temple Bhimavaram - History, Timings, Address,someswara swamy temple.సోమారామ దేవాలయం,భీమవరం ,పశ్చిమగోదావరి,Pancharamalu,Pancharamas,Pancharamamulu
Comments
Post a Comment