Drop Down Menus

Palakollu Sri Ksheera ramalingeswara Swamy Temple | Tours & Travels Details

ఆ అమృతలింగపు ఐదు ఖండాలు పడిన ఐదు ప్రాంతాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్దికెక్కాయి.
Temple Timings
5.30 am to 8.30 pm
ఆ ఐదు ఖండాలని
మొదటి దానిని మహావిష్ణువు "క్షీరపురి"(పాలకొల్లు)లో శ్రీ రామలింగేశ్వరునిగా
రెండవ దానిని ఇంద్రుడు అమరావతిలో అమరేశ్వరునిగా (అమరరామ),
మూడవదానిని దక్షుడు"ద్రాక్షారామం"లో భీమేశ్వరునిగా,
నాల్గవదానిని చంద్రుడు "గునుపూడి"భీమవరంలో సోమేశ్వరునిగా,
ఐదవదానిని కుమారస్వామి సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్టించారు.

ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది ఈ ఆలయాన్ని క్షీరారామంగా పేరొందింది. పంచరామ క్షేత్రాలలో ఈ “క్షీరారామ" ఒకటి. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం పెద్ద గోపురముగా పిలవబడుతుంది.ఇక్కడి రాజగోపురం 9అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది.
పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు'గా వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. 
ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. 
శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. 
ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు.
మరో పురాణ ఇతిహాసం ప్రకారం, శ్రీ రాముడు బ్రాహ్మణుడు అయిన రావణుణ్ణి చంపడం వల్ల అతను పాపం మూటగట్టుకున్నాడని మహర్షి అగస్త్యుడు పాపవిమోచనం కోసం నల్ల రంగు గల శివలింగాలను పుణ్య ప్రదేశాలలో ప్రతిష్టింప చేయాలనీ శ్రీరాముడికి చెప్తాడు. అలాగే శ్రీరాముడు సతి సమేతముగా పవిత్ర నదులలో స్నానం చేసి మరియు శివ లింగాలను ప్రతిష్టించడం ప్రారంభించాడు.
అనేక శివ లింగాలను స్థాపించిన తరువాత శ్రీ రాముడు సీతా మరియు లక్ష్మణులతో పాటు శివ లింగాన్ని స్థాపించడానికి (క్షీరపురి) గోథాని నదికి వచ్చాడు, సీతా హనుమంతుడిని శివలింగము కోసం పంపిస్తుంది హనుమంతుడు సమయం లోపు తిరిగి రాలేడు, అందువల్ల సీత నారతో కూడిన ఇసుకతో శివ లింగమును చేసి పూజలు చేస్తుంది. 
దీనితో నిరాశ చెందిన హనుమంతుడు నది ఒడ్డున కూర్చొని బాధపడుతుంటే ఈ వేదనను గమనించిన శ్రీ రాముడు నది ఒడ్డున లింగను ఉంచమని హనుమంతుడిని కోరారు మరియు హనుమంతుడు ఆ శివలింగమునకు పూజలు చేసిన తర్వాత సీతాదేవి కూడా పూజలు చేయడం ప్రారంభించారు.
హనుమంతుడు చాలా ఆనందంగా భావించాడు. ఈ దేవాలయం పంచరామ ఆలయాలలో ఒకటి. ఇక్కడ ఒక రోజు గడిపిన భక్తులు వారణాసి వద్ద ఒక సంవత్సరం పాటు పొందే దయతో సమానమైన పరమేశ్వరుని యొక్క కృపను పొందుతారు.
ఈ మండపంలోని నైరుతి స్థంభం వద్ద పశ్చిమ ముఖంగా రుణహరణ గణపతి ఉన్నాడు.
పంచగణపతి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రంలో ఈ గణపతితోపాటుసాలమండపాలలోనిఆగ్నేయభాగంలోనూ,ప్రధానాలయానికిదక్షిణభాగంలోనిగణపతిఆలయంలోనూ,ముఖమండప ద్వారబంధంలో ఉత్తరపు వైపున,ప్రధానాలయానికి ఉత్తరవైపున గల సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలోనూ గణపతి విగ్రహాలు పూజలందుకొంటున్నాయి.
ఈ గణపతులను వరుసగా కుమార గణపతి,సంతాన గణపతి,స్థాపిత గణపతి(ప్రథమ గణపతి),బాలగణపతి అని పిలుస్తారు.ఋణ బాధల నుండి విముక్తి పొందటానికి ఋణహరణ గణపతిని భక్తులు విశేషంగా అర్చిస్తారు.
ఇక ఇక్కడ పర్వ దినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారినీ, అమ్మవారిని దర్శించుకుంటారు.
Related Postings:

Near By famous Temples:
1.Someswara Swamy Temple (Somaramam)
2.Bheemeswara Swamy Temple (Draksharamam)

Transport
By Road:
Palakollu is located at the National Highway-214, A.P.S.R.T.C operates buses from Palakollu to major cities like Hyderabad, Visakhapatnam, Vijayawada, Tirupati etc.
By Train:
The nearest Railway station is Palakollu Railway Station which is 1.7 kilometers away from the Temple. Almost all Trains are stopped at Palakollu in Narsapur – Vijayawada railway route.
By Air:
The nearest Domestic Airport is Rajamundry Airport it is 81 kilometers away from the Temple.

Contact Details Of Sri Ksheera ramalingeswara Swamy Temple
Palakol
West Godavari District
A.P- 534260
Office : 08814222822

              

Key Words:
Palakollu Sri Ksheera ramalingeswara Swamy Temple , Sri Ksheera ramalingeswara Swamy Temple ,Palakollu ,weat godavari Temple ,Lord Shiva temple,Shiva Temple,Pancharamas,Pancharamalingas,Pancharamalu,Pacharamalu In telugu,Palakollu Sri Ksheera ramalingeswara Swamy Temple history in telugu,Palakollu Sri Ksheera ramalingeswara Swamy Temple story In Telugu,Ksheera ramalingeswara,Ksheera ramam,Ksheera ramalingeswaram temples Details, Room Booking, Ksheera ramam Temple timings And Pooja Timing,Ksheera ramam Accommodation,Pancharama kshetras, 
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. snap chat online login is principally utilized for making mixed media messages referred to as “snaps”, snaps can comprise of a photograph or a short video, and can be altered to incorporate channels and impacts, content inscriptions, and drawings

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON