Rameswaram Temple Information in Telugu | Hindu Temples Guide

Rameswaram Temple Complete Information

మీరు మొబైల్ లో చూస్తుంటే స్క్రీన్ అడ్డంగా తిప్పండి. 
రామేశ్వరం మొదటిసారి వెళ్లేవారు ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.

ఈ వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే ఈ క్రింది లింక్ పై  క్లిక్ చెయ్యండి. 
https://goo.gl/CLXYUp
రామేశ్వరం స్థలపురాణం మరియు కాశి రామేశ్వరం యాత్ర చాగంటి వారి చెప్పిన విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
కాశి రామేశ్వరం పేర్లు తెలియనివారు ఎవరుంటారు? రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి,  రామేశ్వరం తమిళనాడు రాష్త్రం లో ఉంది. చెన్నై నుంచి 570 కిమీ , ట్రైన్ లో 12 గంటల సమయం పడుతుంది. నా సలహా ఏమిటంటే ఉదయాన్నే 7 am  చెన్నై నుంచి ట్రైన్ ఉంటుంది, మీరు ఆ ట్రైన్ లో తంజావూరు వెళ్లి అక్కడ నుంచి శ్రీరంగం వెళ్లి దర్శనం చేస్కుని , శ్రీరంగం లో లేదా తిరుచనాపల్లి లో  ఉంటే 9-10  pm కి రామేశ్వరం వెళ్ళే ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఉదయం 5 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. 

How to Reach Rameswaram From Vishakapatnam :
Train Name : BBS RMM EXPRESS
Train Number : 18496
Arrival  Time : 7pm 
Departure Time : Next Day 11:45 pm  ( 23:45 )
Stops : 20 ; 
Journey  : 28 hrs
Day : Only Friday 
Ticket Cost : SL - 575, 2A - 2260, 3A - 1545
Majaro Train Stops & Timings :
Visakhapatnam ( 7pm )
Duvvada ( 7.50 pm )
Vijayawada ( 1.25 am )
Nellore ( 4.47 am )
Gudur Jn ( 5.55 am )
Chenni Egmore ( 8.35 am )
Sirkazhi ( 2.27 pm )
Kumbakonam ( 3.24 pm )
Thanjavur ( 4. 13 pm )
Tiruchhirapali ( 5 pm )
Sivaganga ( 8.14 pm )
Manamadurai Jn ( 8.50 pm )
Ramanathapuram ( 9.30 pm )
Rameswaram ( 11.55 pm )


Rameswaram Temple History

శ్రీరాముడు లంకను చేరడానికి సమద్రం పై  రామలులవారు వారది కట్టింది  ఎక్కడో కాదు రామేశ్వరం దగ్గర్లోనే , రామేశ్వరం లో చాల చోట్ల నీళ్ళపై  తేలియాడే రాళ్ళూ కనిపిస్తాయి. వీళ్ళు సమద్రం దగ్గర నుంచి తీస్కుని వచ్చి ఆ రాయిలను మనకు చూపిస్తారు. మనం నమస్కారం చేస్కుని కానుకలు చూపించినందుకు వారికీ ఇవ్వాలి. రాములవారు రావణ సంహారం గావించిన తరువాత.. బ్రహ్మహత్య పాతకం నిర్ములించుకోవడానికి ( రావణుడు బ్రాహ్మణుడు .. తెలిసిన ఎందుకు చెబుతున్నాను అంటే ఈ మధ్య కాలంలో రాక్షసులందరూ దళితులు క్రిందే లేక్కగాడుతున్నారు మన మేధావులు ) రామేశ్వరం లో శివలింగం ప్రతిష్ట చేసారు. ఆంజనేయుడు శివలింగం తీస్కుని రావడం ఆలస్యం కావడం తో ముహూర్తసమయం దాటకుండా సీతమ్మ వారు ఇసుకతో శివలింగం చేస్తే అలిగిన ఆంజనేయుడు ఆ లింగాలన్ని తన తోకతో కదిలించే ప్రయత్నం లో విఫలం చెందాడు అని స్థలపురాణం. 

దేవాలయం లో సీతమ్మ వారు ప్రతిష్ట చేసిన లింగం ప్రక్కనే ఆంజనేయుడు తీస్కుని వచ్చిన లింగాన్ని కూడా మనం దర్శించవచ్చును.
Rameswaram Temple Entrance
Before having the darshan of the deities in the temple one has to take bath in the Bay of Bengal sea which is known as Agni teertha and also in 22 teerthas (wells) that are located inside the temple.


రామేశ్వరం లో గుడిలోనే 22 బావులు / తీర్ధాలు ఉన్నాయి. ఒక్కోబావికి ఒక్కో పేరు ఉంది , పైగా అవి ఒక్కో రుచి ఉండటం విశేషం. మనం ముందుగా అక్కడ సముద్ర స్నానం ( అగ్ని తీర్ధం అని పిలుస్తారు ) చేసి తరువాత నూతి / బావి లో స్నానం చెయ్యాలి. 22 బావుల్లో స్నానం చేయడానికి 25/- టికెట్ తీస్కోవాలి. పై ఫోటో లో చూసారుగా ఒకాతను చేదా  పట్టుకుని నిలబడ్డాడు.. ఒక్కో మనిషికి 100/- తీస్కుని 25 బావుల్లో స్నానం చేయిస్తారు. వీళ్ళ ద్వార వెళ్ళడం వాళ్ళ స్నానం త్వరగా అవుతుంది మరియు మనకి ప్రతి భావి దగ్గర ఒక్కో బకెట్ నీళ్ళు పోస్తారు. విడిగా వెళ్తే అందరికి కలిపి ఒక బకెట్ నీళ్ళు జల్లుతారు. 
Rameshwaram 22 Tirths  List :
రామేశ్వరం లో 22 బావుల పేర్లు ఏమిటో తెల్సుకోవాలి అనుకుంటున్నారా? తీర్ధాల పేర్లు వరుసగా మహాలక్ష్మి, సావిత్రి,గాయత్రీ,సరస్వతి,సేతుమాధవ,నల, నీల, గవయ,కవచ, గంధమాదన, చక్ర, శంఖు, బ్రహ్మహత్యాపాతక విమోచన, సూర్య, చంద్ర, గంగా, యమునా, శివ, సర్వ, కోటి, సత్యామృత, గయా తీర్ధాలు. 

rameswaram information in telugu, rameshwaram temple details, rameshwaram temple timings, how to reach rameswaram, 

2 Comments

  1. Sir, Thanks for the information About Rameswaram
    Need / Share
    > Room's contact no's near bus stand @ matam

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS