2.పాశురము
వైయత్తు వాళ్వర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ పై యత్తు యిన పరమనడిపాడి నెయ్యుణ్ణమ్ పాలుణోమ్ నాట్కాలే నీరాడి మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్ శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్ ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
భావము : భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యముల వినుడు. శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కల్గిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను దాల్చము. అనగా శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము చేతము. సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు యీ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురాలు:
Tags: తిరుప్పావై, తిరుప్పావై రెండో రోజు పాశురం, తిరుప్పావై పాశురం, Tiruppavai, Tiruppavai Pasuram, Pasurams Telugu, Godhadevi, Telugu Pasuralu, Tiruppavai Telugu Pasuralu, Pasuralu pdf
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment