Drop Down Menus

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం Kanipakam Varasiddhi Vinayaka Temple Guide



శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కాణిపాకం లో ఉంది. కాణిపాకం  చిత్తూరు నుండి 11 కి.మీ దూరంలోనూ, తిరుపతి నుండి 68 కి.మీ దూరంలోనూ ఉంది.
ఆలయ చరిత్ర : 
ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళ రాజు మొదటి కుళుత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తరువాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేసారు. 
చారిత్రిక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతాంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూచాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది.

దర్శన సమయాలు : 
4.00 A.M To 5.00 A.M
SUPRABATHA SEVA ( సుప్రభాత సేవ )

5-00 A.M To 5-30 A.M
NIJAROOPA DARSHANAM ( నిజరూప దర్శనం )

5-30 A.M To 6-00 A.M
PANCHAMRUTHABHISHEKAM ( పంచామృతాభిషేకం )

6-00 A.M To 6-15 A.M
MAHA HARATHI ( మహా హారతి )

6-15 A.M To 7-00 A.M
SARVA DARSHANAM (సర్వ దర్శనం )

7-00 A.M To 7-30 A.M
NIJAROOPA DARSHANAM ( నిజరూప దర్శనం )

7-30 A.M To 8-00 A.M
PALABHISHEKAM ( పాలాభిషేకం )

8-00 A.M To 8-30 A.M
SARVA DARSHANAM  ( సర్వదర్శనం )

8-30 A.M To 9-00 A.M
NIJAROOPA DARSHANAM ( నిజరూప దర్శనం )

9-00 A.M To 10-00 A.M
PANCHAMRUTHABHISHEKAM ( పంచామృతాభిషేకం )

10-00 A.M To 10-30 A.M
SARVA DARSHANAM  ( సర్వదర్శనం )

10-30 A.M To 11-00 A.M
NIJAROOPA DARSHANAM ( నిజరూప దర్శనం )

11-00 A.M To 12-00 P.M
PANCHAMRUTHABHISHEKAM ( పంచామృతాభిషేకం )

12-00 P.M To 4-30 P.M
SARVA DARSHANAM  ( సర్వదర్శనం )

4-30 P.M To 5-00 P.M
NIJAROOPA DARSHANAM ( నిజరూప దర్శనం )

5-00 P.M To 5-45 P.M
PRAMANAM & TEMPLE CLEANING 

5-45 P.M To 6-15 P.M
PALABHISHEKAM ( పాలాభిషేకం )

6-15 P.M To 6-30 P.M
MAHA HARATHI, MANTRA PUSHPAMULU

6-30 P.M To 9- 30 P.M
SARVA DARSHANAM  ( సర్వదర్శనం )
Kanipakam Temple is Located in Kanipakam , Chittoor District Andhrapradesh.

వసతి సౌకర్యం :
కాణిపాకం ఆలయం లో వసతి కొరకు ఇప్పుడు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు . ఈ వెబ్సైటు ఓపెన్ చేయండి 

ఎలా చేరుకోవాలి ? :
కాణిపాకం చేరుకోవడానికి తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సు లు ఉన్నాయి. సుమారు 1.45 నిముషాల సమయం పడుతంది.కాణిపాకం నుంచి వెల్లూరు గోల్డెన్ టెంపుల్ చేరుకోవడానికి బస్సు లు ఉన్నాయి.  కాణిపాకం  చిత్తూరు నుండి 11 కి.మీ దూరంలోనూ, తిరుపతి నుండి 68 కి.మీ దూరంలోనూ ఉంది.


చుట్టుప్రక్కల చూడాల్సిన ఆలయాలు :

Varasiddhi Vinayaka Swamy


Kanipakam Temple Timings :
Morning : 4.00 am to 1 pm
Evening : 4.00 pm to 9 pm
                                    Kanipakam Temple 


Near by Temples :
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి మిగతా టెంపుల్స్ సమాచారం తెలుసుకోండి ;


Accommodation in Kanipakam :
Kanipaka Devastanam  Rooms - 6 
TTD Choultries - 14

Kanipakam Temple Contact Details : 
Sri Swayambu Varasidhi Vinayakaswamy 
Vari Devasthanam,
Kanipakam, Irala Mandal
Chittoor. (A.P)
Phone Numbers :
Kanipakam Temple Office :  91 8573281540
Kanipakam Temple E O : 91 8573281747
Kanipakam Temple P A : 91 8573281547

Kanipakam Temple Official Website : 
https://srikanipakadevasthanam.org/

Kanipakam Temple Information in Telugu, Kanipakam Temple Accommodation , Kanipakam Temple Darshan Timings, Nears Temples in Kanipakam. hindu temples guide.com
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments