Krishna Puskaralu 2016 August 12th

కృష్ణాపుష్కరాలు ఆగష్టు 12వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి. 
ఈ  సారి  యాత్రీకులందరూ  విజయవాడలో  నే పుష్కర  స్నానాలు  చేయటం  సాధ్య పడక పోవచ్చు. ముఖ్యంగా  రహదారి  గుండా  ప్రయాణాలు చేసే వారు చాలా  ఇబ్బందులకు  గురయ్యే  అవకాశం ఎక్కువగా  ఉంది. కారణంవిజయవాడలో గత సంవత్సరం నుండి  జరుగుతున్న Fly  Over మరియు  రహదారి మరమ్మత్తు  పనులు ఇంత వరకు  ఒక కొలిక్కిరాలేదు. ఎన్నేళ్ళు పడుతుందో  ఎప్పుడు పూర్తవుతాయో  చెప్పడం అసాధ్యం .

ఈ  ఏడాది అంతా  హైదరాబాద్  రోడ్డు  మార్గం ద్వారా  వెళ్ళే వాళ్ళు  మరో  రెండు  గంటలు  ట్రాఫిక్  లో ఇరుక్కుని  తీవ్ర  అసౌకర్యానికి  లోనై  తిట్టుకుంటూ , పసి పిల్లలతో  తీవ్ర  అవస్ధల పాలవుతూ  ప్రయాణాలు  చేస్తున్నారు. అలాంటిది  పుష్కరాల సమయంలో  పట్టే  ఆలస్యాన్ని మనం  ఊహించగలమా ? చాలా  అవస్ధల పాలు  కావలసి వస్తుంది.
దీనికి  నా  సలహా !
పుష్కరస్నాన  ఫలితం ఏ  పరీవాహక ప్రాంతంలో చేసినా  వస్తుంది. విజయవాడ లోనే  చెయ్యాలన్న నియమం పెట్టుకోవద్దు. ముఖ్యంగా హైదరాబాదు వైపు నుండి వచ్చేవారు విజయవాడ లో దిగే ప్రయత్నం చేసే కన్నా తెనాలి లో దిగితే బస్టాండు వద్ద మంచి  హోటల్స్మ రియు బస చేసే  సౌకర్యాలు  ఉన్నాయి. విశ్రాంతి తీసుకొని వల్లభాపురం, గాజుల్లంక, చిలుమూరు  ఇత్యాది కృష్ణా నదీ పరివాహిక ప్రాంతాలున్నాయి. హాయిగా పుష్కర స్నానం చేసుకొని దైవదర్శనం కూడా చేసుకోవచ్చు .
లేదా రేపల్లే కు హైదరాబాదు నుండి రైలు సౌకర్యం ఉంది. చక్కగా రేపల్లె వెడితే రేపల్లె లో ఇప్పుడు మంచి హోటల్స్  వసతి  సౌకర్యాలు ఉన్నాయి.  పెనుమూడి రేవులో స్నానం చేసుకొని మోపిదీవి సుబ్రహ్మణ్యస్వామి వారిని , శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువును, అడవుల దీవి, మోర్తోట ,హంసల దీవి , ఇలా  ఎన్నో  చారిత్రాత్మక  పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు.


ఇదంతా కృష్ణానది పరీవాహిక ప్రాంతం. సంగమ ప్రదేశం. పరమ పవిత్రం. మరో ముఖ్యమైన విషయం. పుష్కరాలు మొదటి రోజునే అదీ పుష్కరుడు ప్రవేశించబోయే సుముహూర్త సమయంలోనే పుష్కరస్నానం చెయ్యాలనే  మూఢనమ్మకాలు వదిలేయండి. ఆ పుష్కరాలు 12 రోజులలో ఎక్కడ చేసినా ఏ ప్రాంతంలో స్నానం చేసినా సంపూర్ణమైన ఫలితం  లభిస్తుంది . 
అనవసరమైన  మూఢ నమ్మకాలతో  మీరు  అవస్ధల పాలై మీ కుటుంబ  సభ్యులను  పసి పిల్లలను చిన్నారులను అవస్ధల పాలు  చేయవద్దు. 
Credits : రాసినవారికే దక్కుతుంది. 

krishna puskaralu dates, krishna puskaralu information in telugu, krishna puskaralu details, krishna puksaralu near famous temples, famous temples in krishna district. 

                

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS