Sarpavaram Bhavanarayana Swamy Temple Kakinada History Accommodation Details

Sarpavaram Bhavanarayana Swamy Temple

కాకినాడ లో ప్రచారానికి నోచుకోని 5000 సంవత్సరాల ప్రాచీన వైష్ణవ క్షేత్రం కలదు. ఈ క్షేత్రం కాకినాలో సర్పవరం లో ఉంది. ఈ క్షేత్ర మహత్యం బ్రహ్మదైవర్త  పురాణము కాశీఖండము,భీమఖండములో ఉన్నది. శ్రీనాధుడు,కూచిమంచి తిమ్మకవి పండితులు ఎందరో ఈ క్షేత్ర మహాత్యమును విశేషంగా వర్ణించారు.
ఈ క్షేత్రాన్ని దర్శిస్తే 108 వైష్ణవ క్షేత్రాలను దర్శించుకున్న దర్శన ఫలం ఇస్తుందని స్థలపురాణం. 


సర్పవరం: ( Sarpavaram )
Sarpvaram Temple History 
సర్పం ( ఆదిశేషుడు ) వరం పొందిన ప్రదేశం కాబట్టి సర్పవరం అని ఈ ప్రాంతానికి పేరొచ్చింది. ఆదిశేషుడు మోక్షప్రాప్తికై తపస్సు చెయ్యగా విష్ణుమూర్తి  ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చితిని ఈ ప్రదేశమంతయు "సర్పవరం" గా ఖ్యాతి చెందును అని, నీవు నాకు చల్లని సుకుమార తల్పముగా ఉండేదవనియు వరములు ఇచ్చెను. 

ముగ్గురు మూర్తులు:
ఈ క్షేత్రం లో స్వామి వారు భావనారాయణ అని పిలువబడుతూ, శ్రీ రాజ్యలక్ష్మీ సమేతుడై మనకి దర్శనఇస్తున్నారు. ఈ క్షేత్రమును త్రిలింగ క్షోణి వైకుంఠం అందరు. ఇచ్చట రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావనారాయణ స్వామిని నారద మహర్షి ప్రతిష్ఠగాను,

 శ్రీ మూల భావనారాయణ స్వామి ని అనంతుడను సర్పము ప్రతిష్ఠ చేసినట్లుగాను, స్వయం భూ శ్రీ గరుడ వాహనము మీద మహా విష్ణువు "శ్రీ పాతాళ భావనారాయణ స్వామి " ముగ్గురు మూర్తులు వెలసి యున్నారు. 


పంచ భావనారాయణ క్షేత్రాలు:
పంచభూత లింగాలు, పంచరామాల వలే పంచ భావనారాయణ క్షేత్రాలున్నాయి. అవి బాపట్ల, పొన్నూరు, భావదేవరపల్లి, సర్పవరం, పెదగంజాం.
ముక్తికాసరస్సు :

ఈ క్షేత్రం నారదుని వల్ల ఏర్పడిన క్షేత్రం గా చెప్పబడుతుంది. ముక్తికా సరస్సు అంటే కోనేరు. భావనారాయణ స్వామి ఆలయం బయట కలదు. నారద కుండము అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు కోసం ఆలయ ప్రధాన పూజారి గారు వివరించిన వీడియో క్రింద ఇచ్చాను చూడండి.

భావనారాయణ స్వామి ఆలయం :


ఈ ఆలయం విశాలమైన ప్రకారము, ఉత్తరమున గాలిగోపురం, తూర్పున సింహద్వారం కలదు. దక్షిణమున పూలతోట, ఉత్తరమున కళ్యాణ మండపము, తూర్పుదిశగా ధ్వజస్థంబము, పైన ఒక ప్రక్క గరుడ వాహనము, మరో ప్రక్క ఆంజనేయ స్వామి వారి శిలావిగ్రహము కలదు. లోనికి ప్రవేశించగానే ప్రదిక్షణముగా వెళ్ళినచో శ్రీ ఆళ్వారాధులు దాని ప్రక్కనే పురాణసిద్దమైన అభయహస్తము, శంఖము, చక్రము, గదా హస్తము వృక్షస్థలమందు లక్ష్మీదేవితో మూల భావనారాయణ స్వామి సన్నిధులు కలవు.
How to Reach Sarpvaram Bhavanarayana Swamy Temple : 
ఎలా చేరుకోవాలి?
మీరు కాకినాడ చేరుకుంటే  చాలు సర్పవరం వెళ్లడం చాల సులభం, ఈ సర్పవరం కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లే దారిలో ఉంటుంది. సర్పవరం జంక్షన్ లో దిగితే గుడికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. మీరు దూరప్రాంతాల నుంచి వచ్చేటట్లైతే సామర్లకోట రైల్వే స్టేషన్ లో దిగడం ఉత్తమం, సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుంది. కాకినాడ వెళ్లే బస్ ఎక్కి మీరు మాధవపట్నం లో దిగితే అక్కడ నుంచి భావనారాయణ స్వామి ఆలయం 1.5 కిమీ దూరం ఉంటుంది ఆటోలు ఎలాగో ఉంటాయి. 
Accommodation in Bhavanarayana Swamy Temple:
వసతి:

ఆలయానికి ఎదురుగానే కొత్తగా నిర్మించిన భవనం కలదు, a/c రూమ్స్ కూడా ఉన్నాయి. వివాహాలు చేస్కోవడానికి హాలు కూడా ఉన్నది. non a/c రూమ్స్ 400/-, a/c రూమ్స్ 800/- ఛార్జ్ చేస్తున్నారు. 
Bhavanarayana Swamy Temple E.O gari Phone Number : 9866077935 
Bhavannarayana Swamy Temple Timings:
Morning : 6 am to 11 am
Evening : 5 pm to 8 pm

Temple Address:
Sri Rajyalakshmi Sameta Sree Bhavanarayana Swamy Temple,
Sarpavaram,
Kakinada Rural Mandal,
East Godavari District,
Andhra Pradesh. 

Near by Famous Temples:

Samarlakota Kumarabhimeswara Swamy
Pithapuram Padagaya
> Kakinada Sree Peetham
Draksharamam
Kotiphalli

             

sarpavaram temple information, sarpvaram bhavannararayana swamy, bhavanarayana swamy temple sarpavaram, sarpvaram temple timings, sarpvaram temple accommodation, sarpvaram temple history in telugu, sarpavaram temple history pdf, sarpvaram near by famous temples, kakinada surrounding temples list, bhavannarayana kshetras details, east godavari famous temples information, vishnu temples details, 5000 years old vishnu temples ,

Comments

 1. అసలు ఆంధ్రప్రదేశ్ .. కాకినాడ లో ఉన్న సర్పవరానికి ఆపేరు ఎలా వచ్చిందంటే..’కశ్యపుడు, కదృవ ‘అనే దంపతుల పిల్లలు సర్పరూపం లో ఉంటారు.’జనమేజయుడు’ అనే రాజు చేసే సర్పయాగం లో ఈ దంపతుల పిల్లలు ఆహుతి కాబోతున్నారని తెలుసుకుని బాధపడుతూ ఉంటారు కశ్యప దంపతులు, అప్పుడు ఆ పిల్లల్లో ‘అనంతుడు’ అనేపేరుగల పిల్లాడు, విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుని ఆపదనుండి బయటపడతాడు..

  ‘అనంతుడు’ తపస్సు చేసిన స్థలం లోనే భావనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని, ఒక సర్పం తపస్సు చేసిన ప్రాంతం లో ప్రతిష్టించబడిన మూర్తికాబట్టి ఆ ఊరిపేరు సర్పవరం ఆయిందని ఒక పురాణ కధనం ప్రచారం లో ఉంది,అంతేకాదు సర్పాలు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతానికి ‘సర్పవరం’ అనే పేరు వచ్చిందని కూడా అంటారు.


  ఇక భావనారాయణ స్వామి అనే పేరు ఎలా వచ్చిందీ తెలుసుకుందాం..

  ఒకసారి దేవతల సభ జరుగుతుంటే అక్కడే ఉన్న నారద మహర్షి, విష్ణుమాయ తెలుసుకోవడం నాలాంటి నిరంతరనారాయణ జపం చేసేవాళ్ళకే సాధ్యమని చెప్పాడు. కొన్నాళ్ళకి నారదుడు భూలోకసంచారం చేస్తూ ఒక అందమైన సరస్సు చూసి, అందులో స్నానం చేద్దామని నీళ్ళలో దిగేసరికి విష్ణుమాయ వలన స్త్రీరూపం లోకి మారిపోయాడు నారదుడు, అలా నారద స్త్రీ అయ్యాడు..

  ఈ స్త్రీ ని ,పీఠికాపురమహారాజు పెళ్ళి చేసుకున్నాడని,ఈ దంపతులు 60 మంది పిల్లలకి జన్మనిచ్చారని వాళ్ళే తెలుగు సంవత్సరాలకి ఉన్న 60 పేర్లని ఒక కధనం..పొరుగు రాజ్యం తో జరిగిన గొడవలో భర్తని పిల్లలని పోగొట్టుకున్న ఈ నారద స్త్రీ ఏడుస్తూ, ఆ సరస్సు దగ్గరే కూర్చుంటే అప్పుడు ఒక బ్రాహ్మణుడు చూసి, నీ ఎడమచేయి తడవకుండా సరస్సులో దిగి స్నానం చెయ్యమని చెప్పేసరికి అలాగే చేస్తుంది నారద స్త్రీ.

  వెంటనే నారదుడు అసలు రూపం లోకి వస్తాడు ,కానీ ఎడమచేతి కి ఉన్న గాజులు అలానే ఉండిపోయాయి, స్నానం చెయ్యమని చెప్పిన బ్రాహ్మణుడు ఎక్కడా కనిపించడు …ఇదే విష్ణుమాయ అనుకున్న నారదుడు తన తప్పు తెలుసుకుని విష్ణుమూర్తికోసం తపస్సు చేసి పూర్తిరూపం లోకి మారతాడు..అప్పుడు రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావన్నారాయణ స్వామి ని అక్కడ ప్రతిష్టించాడని స్థల పురాణ కధనం..


  అలా నారదుడి గర్వమనే భవరోగాన్ని వదిలించిన స్వామి కనుక భావనారాయణ స్వామి అని అంటారు..

  ఈ క్షేత్రం లోనే స్వయంభూ గా వెలసిన పాతాళ భావనారాయణస్వామి రూపం కూడా ఉంది ముగ్గురు మూర్తులుగా ఉన్నటువంటి ఈ మూర్తిని త్రిలింగక్షోణి వైకుంఠము అంటారు..ఇక్కడే నారదుడు స్నానం చేసిన సరస్సు కూడా ఉంది.

  పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం కూడా ఇక్కడే ఉంది ( పంచభావనారాయణ క్షేత్రాలు : బాపట్ల, పొన్నూరు, నరసరావుపేట, భావదేవరపల్లి, సర్పవరం).4

  ఎంతో మహిమ ఉన్న ఈ భావనారాయణ స్వామి గుడి దాదాపు 2000 సంవత్సరాల పైనే పురాతనమైనది..

  కాకినాడ కి చెందిన సర్పవరానికి 2 కిలోమీటర్లదూరం లో ఉంది ఈ దేవాలయం..

  ReplyDelete

Post a Comment