పంచారామ క్షేత్రాలు, పంచభూత క్షేత్రాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు వాటి విశేషాలు కాస్తో కూస్తో మనకి తెలుసు. అంతేకాదు పెద్ద పెద్ద శివలింగాలు ఎత్తైన గోపురాలు కలిగిన శివ క్షేత్రాలు విశేషాలు కూడా తెలుసు కదా!.
శివునికి భూలోకం లో విగ్రహ రూపం లో ఉన్న దేవాలయాలు మనకి ఎక్కువగా కనిపించవు. ఆలా కనిపిస్తే మనం ఆశ్చర్యకరంగా చెప్పకుంటాం ఆ క్షేత్రాలకోసం.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రం విగ్రహ రూపం లోనే కాదు పైగా శివుడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్టు కనిపించే ఆలయం అది. ఈ ఆలయాన్నీ చూడాలంటే మీరు పశ్చిమ గోదావరి జిల్లాకు రావాల్సిందే. పంచారామ క్షేత్రం కొలువైన భీమవరం దగ్గర్లో గల యనమదుర్రు గ్రామం లో ఈ క్షేత్రం ఉంది.
ఒకే రాతిపై పార్వతీదేవి శివుడు ఇద్దరు మనకు దర్శనం ఇస్తారు. పైగా పార్వతీదేవి తో చిన్నపిల్లాడైన కుమారస్వామి తల్లి ఒడిలో ఉంటాడు. ఇలా మనకి వేరెక్కడ కానరాదు.
స్థలపురాణం ప్రకారం యమధర్మరాజు ఈ క్షేత్రం లో పరమశివుడి కోసం తపస్సు చేశాడు. ఎందుకు చేసాడు అనేగా మీ అనుమానం ఏ కారణం లేకుండా ఎవరు ఏ తపస్సు చెయ్యరుకదా .. శివ భక్తుల ప్రాణాలు తీసేముందు పరమశువుని ఆజ్ఞలేకుండా భక్తుల దగ్గరకు వెళ్తే ఏమౌతుందో మీతో పాటు యమధర్మరాజు కి కూడా గుర్తొచ్చి. శంబరుడు అనే పరమ శివభక్తుని ప్రాణాలు తీయడానికి పరమశువుని అనుమతి కొరకు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఆ సమయం లో శివుడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు.. పార్వతి దేవి పిల్లవాణ్ణి లాలిస్తుంది. లోకకల్యాణం కోసం ఉన్నపళంగా ప్రత్యక్షం కావాలని యమధర్మరాజు ప్రార్ధించాడు. యమధర్మరాజు కోరికను మన్నించి పార్వతి దేవి, శివుడు యదా స్థితిలో ప్రత్యక్షం అయ్యారని స్థలపురాణం. అందుకే మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా ఈ క్షేత్రం లో పరమశివుడు మనకు దర్శనం ఇస్తాడు.
how to Reach Yanamadurru:
యనమదుర్రు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి 5 కిమీ దూరం లో ఉంది.
Sri Shakteeswara Swamy Temple is Located at Yanamadurru just 5KM away from Bhimavaram ( west godavari, Andhra Pradesh) .
Shaketeeswara Temple Address:
Yanamadurru Village,
Bheemavaram,
West Godavari District,
Andhra Pradesh - 534201
famous temples near yanamadurru :
Somarama Temple Bhimavaram
Mavulamma Talli Bhimavaram
Palakollu Sri Ksheera Ramalingeswara Swamy
Dwarapudi Ayyappa Swamy Temple
website : http://yanamadurrushivalayam.com/
Shakteeswara Temple google map :
click here
how to Reach Yanamadurru:
యనమదుర్రు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి 5 కిమీ దూరం లో ఉంది.
Sri Shakteeswara Swamy Temple is Located at Yanamadurru just 5KM away from Bhimavaram ( west godavari, Andhra Pradesh) .
Shaketeeswara Temple Address:
Yanamadurru Village,
Bheemavaram,
West Godavari District,
Andhra Pradesh - 534201
famous temples near yanamadurru :
Somarama Temple Bhimavaram
Mavulamma Talli Bhimavaram
Palakollu Sri Ksheera Ramalingeswara Swamy
Dwarapudi Ayyappa Swamy Temple
website : http://yanamadurrushivalayam.com/
Shakteeswara Temple google map :
click here
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment