Famous Temples In Visakhapatnam

హిరణ్యకశిపుని భటులు ప్రహ్లాదుని చంపడం కోసం అతడిని సముద్రంలో పడవేసి , అతడు లేచి బయటకు రాకుండా పైన ఒక పర్వతాన్ని పడవేశారు . అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి , ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లాదుని రక్షించాడు . అదియే సింహాచలం కొండ . నిజరూపంలో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం , నరుని శరీరం , సింహం తోక యుండుట విచిత్రం .  ఇక్కడ స్వామి పదాలు భూమిలో కప్పబడి ఉంటాయి . సుమారు 12 మణుగుల శ్రీ చందనంతో నిండి ఉన్న రూపమే మనకు దర్శనమవుతుంది . ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అనగా వైశాఖశుద్ధ తదియనాడు (మే నెలలో ) చందనపు పొరలు తొలగించుకొని తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆషాడ పౌర్ణమినాడు జరిగే గిరిప్రదక్షిణ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది . 32 కి .మీ . వైశాల్యంగల సింహగిరి చుట్టూ కాలినడక ప్రదక్షిణం చేసి , స్వామిని దర్శించుకుంటారు . విశాఖజిల్లా , విశాఖపట్టణమునకు 11 కి . మీ దూరంలో తూర్పు కనుమలలో సింహగిరి పర్వతం పైన వెలిసిన దైవం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి .
ఈ ఆలయంలో ఉన్న విచిత్రమేమిటంటే పూజారి మనకు కనిపించడు. పూజారితో పనిలేకుండా భక్తులే అమ్మవారిని స్వహస్తాలతో పూజించుకొనవచ్చును. 24 గంటలూ ఈ ఆలయం భక్తులకు తెరిచే ఉంటుంది . ఒకసారి తపస్సంపన్నుడైన ఒక పండితుడు కాశీయాత్ర చేసి శివసాయుజ్యం పొందాలనుకున్నాడు . వెళ్తూ వెళ్తూ ప్రస్తుతం ఆలయం ప్రాంతములో ఉన్న బావి వద్దకు చేరుకొని స్నానం ముగించి సంధ్యావందనాన్ని జరుపుకుని తిరిగి బయలుదేరబోగా బావిలోనుంచి "జగన్మాతా | నిను కనకమహాలక్ష్మి దేవిని . బావిలో ఉన్నాను . నన్ను వెలుపలకు తీసి పూజా కార్యక్రమాలను జరిపించు " అని బావిలో నుంచి మాటలు వినిపించాయి . బావిలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వెలుపలకు తీసి ప్రతిష్టిoచి పూజలు నిర్వహించారు . అప్పటి నుండి అమ్మవారు ఆరాధనలందుకుంటూ ఉన్నది . ఈ అమ్మవారికి గురువారం రోజున కానుకలు సమర్పించి , తమ మనసులోని కోర్కెలు తెలియజేస్తే అవి తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం . ప్రతి సంవత్సరం మార్గశిరమాసమంతా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఉత్సవాలు అతివైభవంగా జరుగును . విశాఖపట్నం నడిబొడ్డున వన్ టౌన్ లోని బురుజుపేటయందు వెలసిన ఒక గ్రామ దేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు . ఈ అమ్మవారిని దర్శించుటకు విశాఖపట్నం అన్ని ప్రాంతాల నుండి బస్సు , రైల్వే సౌకర్యాలు ఉన్నాయి . 
3) Bheemili Narasimha Swamy Temple Pavurallakonda hill
కృతయుగంలో ప్రహ్లదుని రక్షణార్ధము విష్ణువు ఉగ్రనరసింహునిగా అవతరించగా, ఆ ఉగ్రరూపాన్ని చూసి దేవతలు , మునులు భయభ్రాంతులై నరసింహస్వామిని సకలదేవతలతో కూడిన ప్రహ్లాదుడు ప్రార్ధించగా , స్వామివారు వారి ప్రార్థనకు శాంతించి తన ఉగ్రనరసింహావతారం చాలించి శంఖు , చక్ర , గద అభయ వాస్తములతో వారిని కరుణిస్తాడు . ఈ ఆలయము 12,13 వ శతాబ్దాలలో నిర్మిచినట్లు తెలియచున్నది . ఇది చాలా ప్రాచీన ఆలయం . ఇచట స్వామి స్వయంభువుగా వెలిసాడని ప్రసిద్ధి .  తరువాత ఇది శ్రీకృష్ణదేవరాయలవారి అభిమానము చూరగొని, మరింత వన్నెకెక్కింది . శ్రీ నరసింహజయంతి , వైకుంఠ ఏకాదశి , మకర సంక్రాతి మొదలగు పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . మాఘమాసం ఆదివారం , అమావాస్య , శ్రావణ నక్షత్రంలో కూడిన రోజును అర్ధోదయం, మహోదయ విశిష్టత . ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అర్ధోదయం , మహోదయం మరియు 60 ఏళ్లకు ఒకసారి వచ్చే గోవింద ద్వాదశి పర్వదినాలు హిందువులకు అత్యంత పుణ్యదినాలు . విశాఖ జిల్లా , విశాఖపట్నంనకు సుమారు 27 కి.మీ దూరంలో విశాఖ - భీమిలి బీచ్ రోడ్డుపై చివరన భూమినిపట్నం లేక భీమిలి గ్రామము కలదు.  
4) Bojjana Konda Anakapalli

5) Nookambica Temple Anakapalli

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అనే పట్టణంలో శ్రీ నూకాంబికా దేవి అనే గ్రామదేవత ఆలయం కలదు . ఇది పూరితమైన ఆలయం . ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 550 సంవత్సవరాలు అయినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది . అనకాపల్లి పట్టణంలో వేంచేసియున్న లక్షలాది మందికి ఆరాధ్యదైవం అయిన శ్రీ నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒకశక్తి అయిన "శ్రీ అనఘాదేవి "గా ప్రతిష్ఠితమై పూజలందుకొనుచున్నది . ఉగాది పర్వదినానికి ముందురోజు అమావాస్యనాటి నుండి అనగా ఫాల్గుణ బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఈ నూకాంబిక సమక్షంలో "కొత్త అమావాస్య జాతర " జరుగుతుంది . ఉత్తరాంధ్రలో బాగా పేరుపొందిన ఈ జాతరకు రాష్టహ్యప్తంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు . 

చిత్తూరుజిల్లాలోని కాణిపాకం తర్వాత అంతటి పేరున్న సర్వసిద్ది వినాయకుడు ఈ చోడవరంలో స్వయంభువుగా వెలిశాడు . స్వయంవ్యతకమైన ఈ వినాయకుని విగ్రహానికి 15వ శతాబ్దంలో మత్స్యవంశపురాజులు ప్రతిష్ట చేసినట్టు స్థలపురాణం ప్రకారం తెలియచున్నది . ఈ స్వయంభు వినాయకుడిని దర్శించుకుంటే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని , కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం . గణపతి నవరాత్రలు గొప్పగా నిర్వహిస్తారు .
7) Sri Venugopala Swamy Temple Upamaka at visakhapatnam

పురాతన విష్ణుక్షేత్రంగా పిలువబడే శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఎంతో  ప్రసిద్ధి చిందినది .  క్రీ. శ, 6వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతి శ్రీకృష్టభూపాలుడు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది . ఉపమాకలో వేంకటేశ్వరస్వామి వెలిశాడనడానికి రెండురకాల స్థలపురాణాలు చెబుతారు . బ్రహ్మ , కశ్యపుడు తరితరులు కలిసి ఇక్కడ చేసిన తపస్సు ఫలితంగా ఆలయం ఎదురుగా ఉన్న తటాకం వెలిసిందనీ వీరి కారణంగానే ఇది బంధుర సరస్సుగా పేరొందిందని పురాణాలు వెల్లడిస్తున్నాయి . విశాఖజిల్లా , విశాఖపట్నంకు 85 కి మీ దూరంలో , తుని రైల్వే స్టేషన్ నుండి ,20 కిమీ దూరంలో, నర్సీపట్నం రైల్వే స్టేషన్ నుండి 10కిమీ దూరంలో నక్కపల్లి మండలం , నక్కపల్లి గ్రామమునకు సుమారు 2కిమీ దూరంలో ఉపమాక గ్రామం కలదు . 
8) Sri Sampath Vinayaka Temple
విశాఖపట్టణం సాగరతీరమందు ఆశీలుమెట్ట అనే ప్రాంతమునందు శ్రీ సంపత్ వినాయగర్ ఆలయ కలదు . తమిళనాడుకు చెందిన ముగ్గురు భక్తులు విశాఖపట్నం లో స్థిరపడి స్వామి వారికీ ఒక ఆలయం నిర్మించాలని వారు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు . కొంతకాలం తర్వాత కంచి పీఠాదిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి దివ్యహస్తాలతో శ్రీ గణపతి యంత్రము ను ఇచ్చట ప్రతిష్టాపన చేశారు . నాటినుండి గణపతి దివ్య ఘనతేజస్సులతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారు . తమిళనాడుకు చెందిన అర్చకస్వాములే పూజలు నిర్వహిస్తారు . విశాఖతీరంలో జాలరులు, భక్తులు ప్రతిరోజు తమ వృత్తివ్యాపారాలు ప్రారంభించేముందు ఈ సంపత్ వినయాగర్ స్వామిని దర్శించడం అనవాయితీ . స్వామివారిని స్మరించినంతనే సకల ఆపదలు తొలగి శుభం జరుగుతుందని వీరి నమ్మకం . 
13)శ్రీ నూకాంబిక మహత్యంRelated Postings in Hindu Temples Guide Articles :
Famous Temples In Visakhapatnam District, Vizag Famous Temple list, Best Temples in Visakhapatnam, Temple Information in Hindu Temple Guide.com, Temple Timings, AP District Temple History, Hindu temples Guide.

               

Comments

Post a Comment