Drop Down Menus

Sri Raja Rajeswara Swamy Devasthanam | History Timings


శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం - ( వేములవాడ) కరీంనగర్‌కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్‌-కామారెడ్డి దారిలో ఉంటుంది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది.


Temple History:
మాళవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్రలో ఉంది. చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు, అతని కుమారుడు అరికేసరి, ఆ తర్వాత రెండో యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా రాజ్యాన్ని పాలించారు. చాళుక్య రాజుల్లో చివరివాడు.. భద్రదేవుడి కుమారుడైన మూడో అరికేసరి అని దేవస్థానంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

Temple Specialty:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) స్వామికి మొక్కుగా చెల్లించి.. ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ప్రతినెలా దాదాపు 10లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకొంటారని అంచనా.ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉన్నది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్లో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట.

Address:
Executive Officer
Sri Raja Rajeswara Swamy Devasthanam
Vemulawada
Rajanna Siricilla Dist.
Telangana
Pin: 505302

Temple Opening Timings:
4:00 a.m To 9:00 p.m

Accommodation Details:
Rajeshwarapuram Choultry A.C. rooms:
Number of Rooms: 4
Room Rent: 750/-

Sri Nandeeshwara Complex:
Number of Rooms: 56
Room Rent: 750/-

Nandeeshwara Complex A.C. Suits:
Number of Rooms: 8
Room Rent: 2000/-

Sri Ammavari Guest House:
Number of Rooms: 8
Room Rent: 1000/-

Rajeshwarapuram choultry Non-AC Rooms:
Number of Rooms: 27
Room Rent: 350/-

Parvathipuram choultry:
Number of Rooms: 88
Room Rent: 200/-

Sri Lakshmi Ganapathi Complex:
Number of Rooms: 88
Room Rent: 250/-

Sri Nandeeshwara Complex:
Number of Rooms: 112
Room Rent: 350/-

Bus Route:
From Hyderabad via Siddipet
From Khammam via Warangal & Karimangar
From Kothagudem via Warangal & Karimangar
From Mahabubabad via Warangal & Karimangar
From Karimangar
From Nizamabad via Sircilla
From Kamareddy via Sircilla
From Yadagirigutta via Siddipet
From Warangal via Karimangar
From Narsampet via Karimangar
From Basar via Nizamabad & Kamareddy
From Manthani via Peddapelly & Karimangar
From Godavarikhani via Peddapelly & Karimangar

Train route:
The nearest broad-gauze Railway Station is Warangal – Khajipet and nearest meter-gauze is Kamareddy and the nearest Airport is Hyderabad.

Related Postings:

> Chaya Someswara Swamy Temple History

> Jogulamba Sakthi Peetham Alampur Information

> Chilkur Balaji Temple Information

> Yadadri Lakshminarasimha swamy Temple History

> Kondagattu Anjanna Temple Information

> 400 Years Old Ghatkesar Sri Venkateswara Swamy Temple


Vemulawada temple information in telugu, vemulawada temple history, vemulavada temple, vemulawada temple timings, vemulawada temple accommodation details, travel information in vemulavada, vemulawada, sri rajarajeswara temple vemulawada, hindu temples guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.