Drop Down Menus

Juttiga Temple History in Telugu | Timings

Sri Uma Vasuki Ravi Someshwara Swamy Vari Temple Juttiga

శ్రీ విష్ణు స్వరూపుడైన హ్యస మహర్షిచే పదునెనిమది పురాణము చెప్పబడినవి. అందు వాయు పురాణమొకటి . ఆహాయు పురాణమున గోస్తనీనది మహత్యము . శ్రీ ఉమవాసుకి రవి సోమేశ్వర క్షేత్ర ప్రస్థావన కలదు . 
పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలంలో జుత్తిగ అని పిలవబడుచున్న ఈ జుతికాపురమున శ్రీ ఉమవాసుకి రవి సోమేశుడు వెలసియున్నాడు . ఈ ఈశ్వరుడు నిత్యపుష్కరిణియు, ఉత్తరహహినియూ ఆయన గోస్తనీనది తీరమున వాసుకి రాయి సోములచే ప్రతిష్టంపబడినది .

త్రేతాయుగమున దుష్టుడైన రావణాసురుడు వాసుకి అను సర్వరాజును రవి (సూర్యుడు)ని సోము  (చంద్రుడు )ని పరాభవించినాడు . రావణుని పరిహారంగా భయంకర రాక్షసులు దేవతలందరిని పీడింపసాగిరి.
వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు , ధనుంజయుడు అను సర్వములచే రావణుని రధము మోయించిరి. రావణ భటులచే పీడింపబడిన లోకోపకారులైన సూర్య చంద్రులు వాసుకి గోస్తనీనది తీరమున ప్రతిష్టించి పూజించిరి. కావున ఈ లింగమునకు వాసుకి సోమేశ్వర లింగమని పేరు కలిగినది. అనంతర కాలమందు శ్రీ విష్ణువు శ్రీ రామునిగా జన్మించి రావణాదులను నశింపచేసినాడు.

గోదావరి నది కన్నా పురాతనమైన గోస్తనీనది బస్తరు జిల్లా, ధేను పర్వతము నందు జన్మించి నాలుగు పాయలై ఒకపాయ దూతికపురం (జుత్తిగ) మీదుగ ఉత్తర దిశగా ప్రవగించి కాళీపట్నం వద్ద సముద్రం సంగమం చేయుచున్నది . ఇట్టి పవిత్ర గోస్తనీనది తీరమున వెలసిన శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర క్షేత్రము భక్త జనులకు ఇహపర సౌఖ్యములిచ్చి కొంగు బంగారమై విరాజిల్లుచున్నది. 
ఈ లింగము సేవించు వారికీ శతృ, ఋణ, రోగము మృత్యు భయములు ఉండవు. సోమవారం రోజున ఈ శివలింగమును సేవించి, అన్నదానము చేసినచో కోటిరెట్లు ఫలితము కలుగును. 
మహాశివరాత్రి పర్వదినమున ఈ శివలింగమును సేవించువారు పునరావృతి రహితమైన కైవల్యము పొందుదురు. పశ్చిమాభిముఖముగా శివలింగము, ఉత్తరవాహినిగా నది ఉన్న క్షేత్రము కాశీతో సమానమైనది ఆ లింగము పూజించు వారికీ ముక్తి నిస్సంశయముగా లభించును. అన్నప్రమాణము ఈ క్షేత్ర మహాత్యమును చెప్పబడుచున్నది. 
ఈ ఆలయములో ఉత్తరమున దక్షిణాభిముఖముగా శ్రీ పార్వతిదేవి ఎడమ భాగమున శ్రీ భద్రకాళీ వీరభద్రేశ్వరులు, శివలింగమునకు ఎదుగురుగా ముఖమండపమున శ్రీ శారదాదేవి, శ్రీ కుమారస్వామి నెలకొనియున్నారు. 
ఈ దేవాలయమునకు కొడమంచిలివారు, ర్యాలివారు వంశపారం పరిరక్షకులుగా కొనసాగుతున్నారు.

Temple Address: 
Place: Juttiga
Mandal: Penumantra
District: West Godavari
State: Andhra Pradesh
Pin code: 534124

Temple Timings:
5.a.m To 8.30 p.m

Related Postings:
History of Yanamadurru Shakteeswara Temple

Bheemavaram Mavullamma Temple Online Accommodation

> Bhimavaram Someswara Temple West Godavari

Shakteeswara Temple Yanamadurru Details

Sri Ksheera Ramalingeswara Swamy Temple Guide

Somarama Temple Bhimavaram Information

     

juttiga temple information in telugu, jiggita temple, siva, siva temples, juttiga temple history, juttiga, west godavari temples list, ap, andhrapradesh temples, juttiga temple timings, hindu temples guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. As mentioned in the article the heridatory trustees are incorrect.Sattiraju family are the heridatory trustees.At present Sri Sattiraju Sri Rama Rao garu representing the Sattiraju family as the founder trustee.

    ReplyDelete

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.