Tirupati Sri Govindarajaswamy Temple Information | Timings History


గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలో ఉన్న కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి.

శ్రీనివాసునికి అన్నగా... 
స్థానికులు, కొన్ని కథనాల ప్రకారం శ్రీ గోవిందరాజస్వామి తిరుమల శ్రీనివాసునికి అన్నగా పేరొందారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోనే ఉంది. అందుకు తగ్గట్టే కుంచాన్నే తలగడగా చేసుకొని స్వామి నిద్రపోతున్న విగ్రహాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. ప్రతి ఏడాది కార్తీక
మాసం కృతికా నక్షత్ర సమయంలో అన్న తిరుమంజనానికి తిరుమల నుంచి మంచినూనె, తమలపాకులు వస్తాయి. తన అన్న కోసం తమ్ముడు వాటిని పంపిస్తాడు.

Temple History..
ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఆలయ గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ, భాగవత గాథల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తరదిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకుని, శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభికమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. మూల విరాట్టు గోవిందరాజస్వామితో పాటు అండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాళ మహాముని సన్నిధులున్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజ స్వామి కొలువైయున్నాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామా సహితుడైన పార్ధ సారధి మందిరం ఉంది. వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గుడి ముందు పెద్ద కోనేరు ఉంది. కోనేరు నాలుగు ప్రక్కలా విశాలమైన మెట్లు కట్టారు. ఆలయం ప్రక్కనే "ఆలయ వాస్తు మ్యూజియం" ఉంది. ఇక్కడి మూల విగ్రహం మట్టితో చేసినందువలన అభిషేకం చేయకపోవడం ఒక విశేషం. తిరుమల లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలాగే గోవిందరాజస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతులే పాటిస్తారు.

అమ్మవారు.. 
శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో అమ్మవారు పుండరీకవల్లి పేరుతో భక్తులకు దర్శనమిస్తారు. శాలైనాట్చియార్‌ పేరిట ఆమెకు ప్రత్యేకమైన ఆలయం ఉండటం విశేషం. అలాగే వైకుంఠ నాథుని సుదర్శనచక్రానికి మందిరం ఉంది. ఆళ్వారులు పెరియాళ్వార్‌, పొయిగై, పూదత్త, తిరుమాళిశై, నమ్మాళ్వారుల ఆలయాలను చూడవచ్చు. వైష్ణవ గురువుల్లో అగ్రగణ్యులైన రామానుజాచార్య, వేదాంత దేశిక, మాణవాళ ముని, తిరుమల నంబిలకు ప్రత్యేకమైన గుడులున్నాయి. 
పుష్కరిణి..
ఆలయానికి సమీపంలోనే పుష్కరిణి ఉంది. నాలుగు వైపులా విశాలమైన మెట్లతో నిర్మించిన పుష్కరిణి తిరుపతి నగరంలో జరిగే పలు కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. 
శిల్పకళ ..
ఆలయం ప్రహరీ గోడలపై పలు శాసనాలు కనిపిస్తాయి. ప్రధాన గోపురం వద్ద శిల్పకళ అందర్నీ ఆకర్షిస్తుంది. ఆలయానికి ఉత్తరంగా ఉన్న మ్యూజియంలో పలు శిల్పకళా రీతులను చూడవచ్చు.
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని వృక్షం వద్ద నాగదేవత విగ్రహం

How to Reach: 
> తిరుపతికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సౌకర్యముంది. 
> తిరుమలకు వెళ్లే యాత్రికులు తిరుపతిలోని స్వామివారిని దర్శించేందుకు అన్ని సౌకర్యాలను తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. 
> తిరుపతి రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే ఈ ఆలయం ఉంది. 
> ప్రధాన బస్‌ స్టాండ్‌ నుంచీ ఆలయానికి చేరుకోవచ్చు. 
> రేణిగుంట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి వివిధ వాహనాలతో శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకునే సదుపాయముంది.

Temple Openings Timings:
All days of the week
9:30 AM - 12:30 PM
1:00 PM - 6:00 PM
7:00 PM - 8:30 PM

Related Postings :

> Tirumala Alipiri Steps Information

> Tirumala Surrounding Temples List

> Tirumala Good News For New Couples

> Sivari Abhisekham & Nijapada Darshnam

> History of Tirumala Srivari Laddu

> Srivari Sevalu Tomala Seva

Tirumala, Tirumala Govindaraja swamy Temple Information in telugu, Tirumala Alipiri steps information, Tirumala Govindaraja swamy temple timings, Tirumala Address, History, Tirupati, Hindu temples guide.

1 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS