Drop Down Menus

Sri Penusila Lakshmi Narasimha Swamy Temple Information | Penchalakona Timings


హిందూదేవతలు స్వయంభువులుగా వెలిసిన పుణ్యక్షేత్రాలు భారతదేశంలో ఎన్నోవెలిశాయి. అందులో ముఖ్యంగా దక్షిణభారతంలో అయితే చాలా ఎక్కువగానే వున్నాయి. అటువంటి క్షేత్రాల్లో ‘పెంచలకోన’ ఒకటి! దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం పేరుగాంచింది.


Temple History:
శ్రీ నవ నారసింహ పుణ్యక్షేత్రములలో శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి క్షేత్రము మిక్కిలి ప్రసిద్దమయినది. ఈ క్షేత్రము నెల్లూరు జిల్లా, రాపూరు మండలము, గోనుపల్లి గ్రామమునకు 7 కీమీ దూరమున, నెల్లూరు పట్టణమునకు పశ్చిమభాగమున 80 కీమీ దూరంలో ఉంది . ఇక్కడ లక్ష్మి నారసింహ ఒకరిగా పిలవబడుతున్నారు . శ్రీ స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై నిరాకార రూపమున స్వయంభువుగా వెలిసి ఉన్నారు. అల్లంత దూరాన ఆదిలక్ష్మి అమ్మవారునూ స్వయంభువుగా వెలిసి ఈ దేవ దేవేరుల భక్తాభిష్టఫలప్రదులై బ్రోచవారలను కరుణించి వారి కోరికలు నెరవేర్చుచున్నారు.
దశవతారాలలో మేటియై, కౄతయుగంలో అవతరించిన నాల్గవ అవతారం నృసింహ అవతారం. ఈ అవతారంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణలు అనగా దుష్ట రాక్షసుడయిన హిరణ్యకశిపుని వధ, భక్తప్రహ్లద రక్షణ చేసి తనచే సృజించబడు ముక్త జీవులను తరింపజేయుటకు ఇలపై నవ నారసింహులుగా స్థిరమయినారు. ఇట్టి క్షేత్రాలలో ఈ ఛత్రవటి నారసింహ క్షేత్రం అత్యంత మహిమాన్వితమయింది. నృసింహ అవతారంలో హిరణ్యకశిపుని వధ అనంతరం ఉగ్రరూపుడైన నారసింహుడు 'సర్వం విష్ణుమయం జగత్' అను రీతిగా ఈ జగత్తునంతటా సర్వవ్యాప్తియే భక్తుల అభీష్టం మేరకు అచ్చటచ్చట అవతరించినారు. కృతయుగంలో, వైషాఖమాసంలో, స్వాతినక్షత్రంలో సాయంసంధ్య సమయంలో స్వామివారు ఆవిర్భవించారు.

ఈ క్షేత్రము చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడయిన నారసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో శాంతించి చెంచు రాజులకు కప్పము చెల్లించి, చెంచుపట్టిని చేపట్టి వివాహం చేసుకుని, ఆ సుందర వనితను పెనవేసుకుని నిరాకార శిలరూపమున ఇక్కడ స్థిరమయినట్లు చరిత్ర వలన తెలుస్తోంది.
శిలరూపంలో కుడి భాగమంతా నారసింహస్వామిగానూ, ఎడమ భాగమంతా చెంచులక్ష్మి అమ్మవారిగానూ, వక్షస్థలంలో బిలరూపంలొ ఉన్న రంధ్రం వైకుంఠానికి మార్గంగాను, ఆ మార్గం గుండా రాత్రాది కాలలందు దేవతలు వచ్చి స్వామివార్లను అర్చిస్తారని భక్తుల ప్రగాడ విశ్వాసం. స్వామివారు ఉగ్రరూపం దాల్చి కిందకు వచ్చినందుకు గుర్తుగా చంద్రాయుధం గీచినటువంటి గీం ఇప్పటికీ కనిపిస్తుంటుంది.
ఈ క్షేత్రం తూర్పు కనుమల మధ్య పర్వత పాదమున, సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్వయమవాతారమూర్తి వెనుక భాగంలో మహాశిలగిరి (గొప్ప పర్వతరాజం) ఉంది. ఇది పన్నగాకృతిగా నెల్లూరూ, కడప జిల్లాల మధ్యభాగంలొ, హిమగిరి తూర్పూ పశ్చిమ సముద్రాలకు కొలబద్దమానముగ ఉన్నట్లు, ఉత్తర దక్షిణముగా, శ్రీశైల వరాహ (వేంకటాచల) క్షేత్రమునకు కొలబద్ద వలె కనిపిస్తుంది. ఈ సర్పాకృతి గల పర్వతముల యొక్క శిరోభాగంలో వరాహ క్షేత్రమున వేంకటేశ్వరుడు వెలిశాడు. కటి భాగమున ఈ క్షేత్రమున (శ్రీ పెనుశిల క్షేత్రం) చత్రవటి నారసింహుడు వెలసి, స్థితికారకుడై తనను ఆరాధించు భక్తులకు వరాలను ఇస్తూ, లయచక్రవర్తి అయిన పార్వాతీశుడు శ్రీశైల క్షేత్రమున వాల (అంత్య) భగమున వెలిసి ఆర్తులను ఆరాధింపచెయుచున్నడు.

Penchalakona temple nellore:
sri lakshmi narasimha swamy temple,
penchalakona,Nellore
District,Pin:524001.

Darsanam: Penchalakona temple timings: 6.00 am to 7.30 pm


శ్రీవార్ల ఆలయమునందు జరుగు నిత్య సేవలు:
Penchalakona Pooja Details: ఉదయం -
04-00 ని.లకు - సుప్రభాత సేవ

04-30 ని.లకు - గోపూజ


05-00 ని.లకు - అభిషేకం (అర్జిత సేవ)


06-30 ని.లకు - సర్వదర్శనం


07-30 ని.లకు - సహస్రనామార్చన, మంత్రపుష్పం, బాలభోగనివేదన


08-30 ని.లకు - వేద పారయణము


10-30 ని.లకు - శ్రీవార్ల నిత్యకల్యాణము (అర్జిత సేవ)


11-30 ని.లకు - మహ నివేదన


మధ్యహ్నం -

12-30 ని.లకు - కవాట భందనం, బీగ ముద్ర

03-00 ని.లకు - పునః సర్వదర్శనము


సాయంత్రం - 

05-00 ని.లకు - సహస్రనామ పారయణము

05-30 ని.లకు - పల్లకీ సేవ (అర్జిత సేవ), అమ్మవారికి అస్థాన సేవ


06-30 ని.లకు - మహ నివేదన


రాత్రి - 

07-30 ని.లకు - ఏకాంత సేవ

07-45 ని.లకు - కవాట భందనం, బీగ ముద్ర
Near By Temples:

పెంచలకోన క్షేత్రంలో దర్శనీయ స్థలాలు:
> శ్రీవారి ఆలయం(పెంచల కోన)
> శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం(పెంచల కోన)
> శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం(పెంచల కోన)
> శ్రీవార్ల పుష్కరిణి(పెంచల కోన)
> లోకోన జలపాతము (వాటర్ ఫాల్స్)(పెంచల కోన)
> శ్రీవార్ల ఉత్సవమూర్తుల ఆలయం(గోనుపల్లి)
> శ్రీ గొల్లబోయస్వామివారి ఆలయం(గోనుపల్లి)
> శ్రీ ఉడుమేశ్వర స్వామివారి ఆలయం (పెనుబర్తి)
> శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం(పెనుబర్తి)
> శ్రీదేవి భూదేవి సమేత(కల్లూరు గ్రామం)
> శ్రీ అచ్యుతస్వామివారి ఆలయం(కలువాయి) (మం)

 పెంచలకోన క్షేత్రానికి చేరు మార్గములు:

> నెల్లూరు పట్టణము నుండి పొదలకూరు మీదుగా - 75 కిమీ
> గూడురు పట్టణము నుండి రాపూరు మీదుగా - 67 కిమీ
> తిరుపతి పట్టణము నుండి వెంకటగిరి మీదుగా - 115 కిమీ
> రాజంపేట పట్టణము నుండి చిట్వేలి మీదుగా - 90 కిమీ
> కడప పట్టణము నుండి రాజంపేట మీదుగా - 140 కిమీ
> బద్వేల్ పట్టణము నుండి సోమశిల మీదుగా - 110 కిమీ
> కలువాయీ నుండి కుల్లూరు గ్రామం మీదుగా - 35 కిమీ
> రాపూరు నుండి గోనుపల్లి గ్రామం మీదుగా - 28 కిమీ

Penchalakona accommodation:
Accommodation is available near temple and maintained by temple authorities.How To Reach:
Different routes to reach kona, People from Andhra Pradesh surrounding areas can come to PenchalaKona by passing the places Rajampeta – Rapuru on the way.

There is a bus facility from Rapuru to Penchalakona every half an hour. Distance around 30 Kilometers.

People coming from Andhra Pradesh Vijayawada and Vizag should take the train route till Nellore. From Nellore, for every hour there will be a bus to Penchulakona. The distance is around 75 Kilometers.

People coming from Andhra Pradesh Tirupati and surroundings can reach here via VenkataGiri and Rapuru. Distance from Tirupati is 115 Kilometers.

People from Tamil Nadu Chennai and other southern parts can come till Guduru on train. From there they can come here by bus via Rapuru. Distance from Guduru is 65 Kilometers.

Related Postings:

> Famous Temples in Nellore District

> Sri Chengalamma Sullurupet Temple Accommodation

> List of Famous Temples in Andhra Pradesh

> Famous Temples in Krishna District

> Tirumala Complete Information in Telugu


penchalakona Temple History in Telugu Penchalakona Information penusila Temple penchalakona penchalakona penchalakona temple timings penchalakona accommodation nellore to penchalakona distance penchalakona waterfalls nellore to penchalakona bus timings penchalakona rooms booking penchalakona temple photos penchalakona temple darshan timings penchalakona accommodation
penchalakona map penchalakona rooms booking nellore to penchalakona bus timings penchalakona temple photos penchalakona amma penchalakona to tirupati penusila lakshmi narasimha swamy temple hindu temples guide.com
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.