Drop Down Menus

Attirala Treteswara Temple | Parasurama Temple

మహా భారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం. సుమారు వెయ్యేళ్ళ చరిత్రను సొంతం చేసుకొన్న ప్రాంతం. లోకాలను పాలించే స్థితి లయకారులు, అవతార పురుషులు, మహా మునులు, మహోన్నత వ్యక్తిత్వం గల వారు నడయాడిన పుణ్యభూమి. శివ కేశవుల ఉమ్మడి నిలయం. 
కురుక్షేత్ర యుద్దానంతరం భంధు మిత్రుల మరణానికి, జరిగిన రక్త పాతానికి తనే కారణం అంటూ ఉదాసీనంగా ఉన్న ధర్మ రాజుకు కర్తవ్యం భోధిస్తూ, రాజ ధర్మాన్ని గురించి తెలియజేసే క్రమంలో శ్రీ వ్యాస భగవానుడు పలికిన పలుకులలో అత్తిరాల ప్రస్తావన వస్తుంది. ( శాంతి పర్వం, ప్రధమాశ్వాశం).
పరశురాముడి పాపం తొలగించిన శివలింగ ఉన్నది ఇక్కడే :      
ఆంధ్రప్రదేశ్ రాష్టం వైస్సార్ కడప జిల్లాలో హత్యారాల లేధా  అత్తిరాల గ్రామంలో మహాశివుడు దేవాలయాలలో అత్యంత పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనది ఈ దేవాలయం.  
యుగాలనాడే ఉద్భవించిన శివుడు ఇక్కడ త్రేతేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. 
ఇక్కడ ఆవిర్భవించిన  మహాదేవుడు త్రేతేశ్వరుడిగా వెలిసిన పుణ్య క్షేత్రం. ఈ ఆలయ ప్రాంగణంలోనే పరశురామాలయం కూడా ఉండటం ఒక్క ముఖ్య విశేషం. ఇక్కడ ఒకవైపు గధాధర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. 

కొండమీది రాజగోపురానికి మెట్లదారి ఒకటి ఉంది. ఆ గోపురానికి పై భాగంలో ఎత్తయిన దీపస్తంభం ఉంది. అక్కడ ఏటా మహాశివరాత్రి, కార్తిక పౌర్ణమి రోజుల్లో శిఖర దీపాన్ని వెలిగిస్తారు. ఆ వెలుగును చూసే చుట్టుపక్కల ప్రాంతాలను పాలించే రాజులు ఉపవాస దీక్షలు పాటించేవారని ప్రతీతి. అ చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఎంత దూరం నుండి అయిన కనిపించే దీపపుస్తంభం ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ.

స్థలపురాణం ఆధారంగా 
పూర్వం దండకారణ్యంలో  భైరవుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు  ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడగగా,  అప్పుడు  భైరవుడు ఎప్పుడూ మీ పాదాల చెంతే ఉండేలా వరాన్ని అనుగ్రహించ’మని అన్నాడట. అందుకు అంగీకరించి శివుడు భైరవకొండగా మారి తన రాకకోసం ఎదురుచూస్తూ ఉండమని తెలిపాడట. 
త్రేతాయుగంలో ఈ కొండమీదే అనేక మంది  మహర్షులు ,నారద, శుక్ర, భరద్వాజ, వశిష్ఠ మహర్షులు చేపట్టిన మహా యజ్ఞం ఫలితంగా మహాశివుడు ఇక్కడ లింగ రూపంలో వెలిశాడు. అందువల్లనా ఇక్కడ స్వామిని త్రేతేశ్వరుడిగా పూజిస్తారు. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది.
లింగం మీద పుట్టలు  పెరిగిపొయ్యాయి . ఈ ప్రాంతాని పాలిస్తున్న ధర్మపాలుడు అనే రాజుకు స్వామి కలలో కనిపించి పుట్టలో ఉన్న లింగాన్నీ, ఉత్తర దిశలో మడుగు వద్ద ఉండే కామాక్షీదేవి విగ్రహాన్నీ ఒకే దగ్గర ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడట.  పుట్టదగ్గరకు చేరుకున్న రాజు జాగ్రత్తగా దాన్ని తవ్వించి లింగాన్ని బయటకు తీసి, ఆ ప్రదేశంలోనే కామాక్షీ దేవి సమేతంగా త్రేతేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. 
అప్పటి నుంచీ తరతరాలుగా ఆ వంశానికి చెందినవారే ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ వచ్చారు. ఈ ప్రాంగణంలోనే చండీశ్వరుడి విగ్రహాలూ ,నందీశ్వరుడు,  శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పంచ శివలింగాలు, నవగ్రహ మండపం,  కొలువుదీరి ఉన్నాయి.
పరశురాముడు తండ్రి  అయిన జమదగ్ని మహర్షి ఆజ్ఞానుసారం తల్లిని వధిస్తాడు. ఆ తర్వాత మాతృహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఫలితం లభించదు. 
చివరికి మహర్షుల సూచన మేరకు బహుదా నదిలో స్నానం ఆచరించి, ఆ త్రేతేశ్వరుడిని అర్చించిన తర్వాత పరశురాముడి మాతృహత్యా పాతకం తొలగిపోయిందనీ అందుకే ఈ ప్రాంతానికి హత్యరాలె అనే పేరొచ్చిందనే కథ ప్రచారంలో ఉంది. తర్వాతి కాలంలో అది హత్యరాల, అత్తిరాలగా మారిందని అంటారు. పరశురామ క్షేత్రాల్లో హత్యరాల పరశురాముడి ఆలయం అతి పురాతనమైంది. 
ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. అది  పురాణ కథనాల్లోని పరశురాముడు నారవస్త్రాలతో, రుద్రాక్షమాలలు ధరించి ఉంటాడు. కానీ, ఇక్కడ మాత్రం కిరీటం, మెడలో ఆభరణాలతో దర్శనమిస్తాడు.
ఈ ఆలయాన్ని చేరుకోవడం ఎలా ?
పరశురామ లేదా త్రేతేశ్వరస్వామి ఆలయానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కడప నుంచి 57 కిలోమీటర్ల దూరం.  ఈ ఆలయానికి బస్సు సౌకర్యం ఉంది.  రైళ్లు సౌకర్యం కూడా ఉంది . ఈ రైళ్లూ రాజంపేట రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో ద్వారా వేళ్ళవచ్చు.  లేదా బస్టాండు నుంచి బస్సులో ప్రయాణించీ స్వామిని దర్శించుకోవచ్చు.
Related Postings:
Lord Shiva Famous Temples

There is the temple of sri Thretheswara swamy in the form of a stone sivalingam. According to tradition there lived a Rakshasa by name Threthasura in Thretayuga who brought misery not only to man kind but to sages also. Then to get rid of him, sage Narada and other Maharshis peformed a yagna in propitiation of lord Eswara. Eswara came out from the homa gundam in the form of a Tejo lingam and emancipated the rakshasa by killing him. This temple is picturesquely situated on the bank of the river Bahuda (Cheyyeru) on a hillock with a beautiful Kalyana mantapanm (marriage hall) and gali gopuram (tower). The hillock is known as Thretachalam on account of the manifestation of Threteswara swamy.

                       
Keywords:
Parasurameeswaram Temple Attirala.Sri Parasurama Temple ysr kadapa District,Attirala (Hatyarala), Parasurama Temple.Attirala Tritheswara Swamy Temple,Parasurama temple,Attirala, Tour Package Details,Room Booking,Online Rooms ,Tour Packeges,Hotel Rooms ,Online Room Booking
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.