Drop Down Menus

Kotappakonda Sri Trikoteswara Swamy Temple | Kotappakonda Temples

దేవాలయ చరిత్ర 
పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. ఈ త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. 
సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతిగడించి  భక్తులతో  పూజలందుకుంటుంది ఈ  త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం. 
శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీ.శ 1172లో నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది మరియు  పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు భూమిని విరాళాలు ఇచ్చారని శాసనాలు తెలుపుతున్నాయి. 
కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కొండమీద ఒక సరస్సు ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. 
 
ఈ కొండను ఏ వైపు  (కోణం) నుంచి చూసిన మూడు శిఖరాలు కనబడుతుంటాయి ఇక్కడి విశేషంగా చెప్పవచ్చు. 
అందుకే దీనికి త్రికూటాచలమనే పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.బ్రహ్మ శిఖరం మీద ఉన్న లింగానికే కొత్త కోటప్పకొండ అని పేరు.
స్థలపురాణం:
బ్రహ్మ శిఖరం
దక్షయజ్ఞం అనంతరం త్రికోటేశ్వరుడు (శివుడు)  కోటప్పకొండలో ధ్యానశంకరునిగా, దక్షిణామూర్తిగా వెలిశాడని స్థల పురాణం.ఆయన వద్ద బ్రహ్మ, విష్ణువులు, దేవతలకు ఈ ప్రదేశంలో బ్రహ్మోపదేశం చేశారు. 
అందువల్లే ఇక్కడ బ్రహ్మశిఖరం ఏర్పాటైంది.శివుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత బాలదక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సును ఆచరిస్తూంటాడు.
ఆ సమయంలో బ్రహ్మది దేవతలందరితోను కలిసి దక్షిణామూర్తిని సందర్శిస్తాడు.పరమేశ్వరుడిని జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మతో పాటు దేవతలందరు కూడా కలిసి త్రికూటాచలానికి వస్తారు. 
 
అప్పుడు స్వామి వారు  త్రికూట కొండపైనే వెలసి బ్రహ్మతో పాటు దేవతలందరికి జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు. ఆ ప్రదేశంలో ఉన్న దేవాలయానికి పాత కోటప్పగుడి అని పేరు. ఆలయం లోపలి లింగం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది. 
గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరమని, రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరమని పేరు.పక్కన ఉన్న శిఖరాన్ని విష్ణు శిఖరమని అంటారు.
విష్ణు శిఖరం 
దక్ష యజ్ఞం సమయంలో విష్ణువు హవిస్సును స్వీకరించిన పాపం పోవడానికి  ఈ కొండ పై తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై చేతిలో ఉన్నత్రిశూలంతో నేల మీద పొడుస్తాడు. అలా పొడిచినప్పుడు రంధ్రాల నుంచి వచ్చిన జలాన్ని స్వీకరించి స్నానమాచరిస్తే సకల పాపాలు తొలుగుతాయని శివుడు చెప్తాడు. 
విష్ణువు శివుడు చెప్పిన విధంగా చేసి తన పాపాలను పోగొట్టుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ వెలసిన శివుడికి  పాప వినాశనేశ్వరుడనే పేరు వచ్చింది .  రుద్ర విష్ణు శిఖరాలపై స్వయంభువు లింగాలు వెలిశాయి. 
బ్రహ్మ శిఖరం పై ఏమి లేకపోవడంతో దిగులుపడిన  బ్రహ్మ, శివుని కోసం తపస్సు చేసి లింగావిర్భవం అయ్యేటట్లు చేస్తాడు. 
ఈ ఆలయ చరిత్రకు సంబంధించిన జానపద కథ ఒకటి ప్రచారంలో వుంది. ఆ కథ ఈ క్రింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 
 
Pooja Timings
Eka Rudrabhishekam : 5.30 am  to 6.30 am
Abhishekam :  6.30 am to 12.30 pm 
Darshan, Archana  : 6.30 am to 1.00 pm
Archana on Gotras Panchaharati Darshan:1.30pmto 1.45 pm
Ashtothara Pooja, Archana, Darshan : 3.30 pm to 7.00 pm
Pradoshakolarchan, Gotranamamulu, Panchaharati, Darshan :7.00 pm to 7.30 pm

Transport:

By Road

Buses are available from Chilakaluripet, Vijayawada, Hyderabad to reach the temple. And there is also a route to reach Kotappakonda from Addanaki via Santha Maguluru and Minnekallu.

By Train
Nearest railhead to Kotappakonda Temple is Narsaraipet.
By Air
Nearest airport to reach Kotappakonda Temple is Gannavaram airport, which is near Vijayawada.

Near By Famous  Temple
1. Kondapaturu poleramma temple
2. Sri Lakshmi Ammavari temple Adigoppula
3. Pedakakani Sri Bramaramba malleswara Swamy temple
4. Mangalagiri Sri malleswara Swamy Temple
5. Vykutapuram Laksmi Venkateswara Temple
6. Sri Jagannadha Sri Anjaneya Sri Venkateswara Swamy Temple Lalapeta

Related Postings





Contact Details Of Sri Trikoteswara Swamy Temple
Sri Trikoteswara Swamy Temple
Narasarao Peta,Kotappakonda-522601
Guntur District,A.P
Office Phone : 9440532905

Key words :
kotappakonda temple website,kotappakonda temple address,kotappakonda temple photos,kotappakonda temple darshan timings,kotappakonda temple accommodation,kotappakonda history in english,kotappakonda temple contact number,kotappakonda history,Kotappakonda Temple History Telugu Trikoteswara,Trikoteswara Swamy Temple Kotappakonda,Onlin Room Booking, Rooms Booking,Accommodation,kotappakonda temple timing and Phone No,kotappakonda temple history in telugu,Sri Trikoteswara Swamy Temple, Kotappakonda,Guntur,AP

                
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON