Arulmigu Subramaniya Swamy Temple Tiruchendur | తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం


తిరుచెందూర్ తమిళనాడు రాష్ట్రం లో సముద్రపు ఒడ్డున గల సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఆరుపడైవీడు క్షేత్రాలలో ఈ క్షేత్రం మాత్రమే సముద్రపు ఒడ్డున కలదు.  తిరుచెందూర్ సుబ్రహ్మణ్య క్షేత్రం చాల శక్తివంతమైన క్షేత్రం. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం లో చెప్పబడింది. తిరుచెందూర్ క్షేత్రం లో ఆదిశంకరులు  ధాన్యం లో ఉండగా సుబ్రహ్మణ్య స్వామి కనిపించగా  సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.
సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడైవీడు క్షేత్రాలలో మొదటిది తిరుచెందూర్ క్షేత్రం. ఈ క్షేత్రం నుంచే   తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి  బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు.   ఈ ఆలయం ప్రసాదం గా ఇచ్చే విభూతి శక్తి వంతమైనదిగా చెబుతారు.  నాగదోషము ఉన్నవారు ఎవరైనా ఈ ఆరుపడైవీడు క్షేత్రాలను దర్శిస్తే ఆ దోషం పోతుందని చెబుతారు. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.

తిరుచెందూర్ వెళ్ళడానికి చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు ట్రైన్ ఉంటుంది . మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ట్రైన్ వెళ్తుంది.  స్లీపర్ టికెట్ ధర 395/-. తిరుచెందూర్ నుంచి కన్యాకుమారి 90 కిమీ దూరం . మదురై నుంచి తిరుచెందూర్ 180 కిమీ , రామేశ్వరం నుంచి తిరుచెందూర్ 223 కిమీ దూరం. 
ఆరుపడైవీడు క్షేత్రాలపై క్లిక్ చేసి ఆ క్షేత్రాల గురించి తెలుసుకోండి : 

తిరుచెందూర్ ( Arulmigu Subramaniya Swamy Temple, Thiruchendur)   టెంపుల్స్ వెబ్సైటు :   http://www.tiruchendurmurugantemple.tnhrce.in/

పూజలు : ఉదయం 5 గంటలకు సుప్రభాతం తో ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచివుంటుంది . 
5.10 : Subrapadam - Thirupalli Eluchi
5.30 : Viswaroopam Darshan
5.45 : Dwajasthamba Namaskaram
6.15 : Udaya Marthanda Abishegam
7.00 : Udaya Marthanda Deeparadhanai
8.00 to 8.30 : Kalasandhi Pooja
10.00 : Kalasha Pooja
10.30 : Uchikala Abishegam
12.00 : Uchikala Deeparadhanai
5.00 : Sayaratchai Pooja
7.15 : Arthasama Abishegam
8.15 : Arthasama Pooja
8.30 : Ekanda Seva
8.45 : Ragasia Deeparadhanai, Palliarai Pooja
9.00 : Nadai Thirukappiduthal
Arulmigu Subramaniya Swamy Temple Tiruchendur Phone Numbers : 04639-242221, 04639-242270, 04639-242271


keywords : arupadaiveedu , arupadaiveedu , six abodes of murugan, Truchendur Temple , Tiruchendur Temple Timings, Tiruchendur Temple Tour , Madurai to Tiruchendur , Hotels in Tiruchendur , Aurpadaiveedu kshetras, Tiruchendur Temple Details. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS