17.పాశురము
అమ్బరమే, తజ్జీరే శోణే అఱమ్ తెయ్యుమ్ ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్, కొమ్మనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే. ఎమ్బెరుమాట్టి! యశోదాయ్ ! అఱివురాయ్!. అమ్బర మూడఱుతోణ్ణి యులగలన ఉమ్బర్ కోమానే ! ఉఱజ్జాదెళున్దిరాయ్ శామ్ పొర్కళడిలా ! బలదేవా ! ఉమ్చియుమ్ నీయు ముఱజ్ఞేలో రెమ్బావాయ్.
భావము: ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ నిద్ర చాలునయ్యా! మేలుకో' అని ప్రార్ధించిరి.
ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రెండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు. కృష్ణా!
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags : తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 17వ పాశురం