వీరభద్రస్వామి దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకొని ఉన్న రాముడు మరియు కృష్ణుడు యొక్క పురాణ గాథలకు సంబంధించినవి ఉన్నాయి. అచట పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటిగా అలరాలుతుంది. లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం, ప్రతి స్తంభం మలిచిన తీరు వర్ణనాతీతం.
తాబేలు ఆకారం
వీరభద్రాలయం కూర్మశిల అనే కొండమీద నిర్మించబడింది. కొండ ఆకారం తాబేలు రూపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. విజయనగర ప్రభువుల కాలంలో లేపాక్షి పెద్ద వాణిజ్య కేంద్రంగానూ, యాత్రాస్థలంగానూ విలసిల్లింది.
బసవయ్య విగ్రహం
ఇచట గల బసవయ్య 15 అడుగులు ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మండమైన విగ్రహం .108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియ చేస్తుంది. ఇక్కడ గల పాపనశేశ్వర స్వామిని అగస్త్య మగర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరికి ఒకరు ఎదురుగా పాపనశేశ్వరుడు, రఘునతమూర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత.విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు, రమణీయమైన ప్రదేశం. సీతమ్మవారిని అపహరించికొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాములవారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే ! పక్షి ! అని మోక్షం పప్రాసదించిన స్థలం. అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది.
నృసింహస్వామి
ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది. అలాగే నంది కుడి ఎడమపక్కలలో నృసింహస్వామి ముఖం చెక్కబడి ఉంటుంది. విగ్రహం కుడివైపున నిలబడి నంది దృష్టిలోంచి చూస్తే వీరభద్రాలయంలోని నాగరాజు ఏడు పడగల విగ్రహం కొంత స్పష్టతతో కనిపిస్తుంది.
విఘ్నేశ్వర, నాగలింగ శిల్పాలు
లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణమండపానికి పక్కన ఒకే రాతి మీద మలచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలున్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల వున్నది, ప్రధాన ఆలయానికి సరిగ్గా వెనకవైపు అవుతుంది.
శివాలయం
లేపాక్షికి 200 కిలోమీటర్ల దూరంలో మధ్యయుగాలనాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఉండే శివలింగాన్ని పెద్ద పాము చుట్టుకుని ఉన్నట్లుగా ఉండే శివలింగం ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో చక్కటి శిల్పకళా చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలు ఉంటాయి.
ఆధారం లేని స్తంభం
ఇది నాట్య మంటపంలో ఉంది. బ్రిటీష్ ఇంజనీర్లు కొంతమంది ఈ స్తంభం యొక్క రహస్యంకనుగొనాలి అని దీన్ని జరిపే ప్రయత్నం చేసారంట మొత్తం మంటపంలోని మిగిలిన స్తంభాలు కదిలేసరికి మొత్తం మంటంపం కూలుతుందేమో అని వదిలేసారంట. అలా దీనికి ఆధారం లేనప్పటికి మొత్తం మంటపానికి ఇదే ఆధారం అన్నమాట.
మహాశివలింగం
ఏడు శిరస్సుల నాగు ఛత్రంగా ఉన్న మహా లింగం. నంది దగ్గర నుంచి చూస్తే ఈ నాగు శిరస్సు కనపడుతుంది. ఆలయం నిర్మాణం ప్రారంభించినప్పుడు మొదట వినాయకుడితో ప్రారంభించారంట.
వసతి
లేపాక్షి లో స్నాక్స్, వాటర్ బాటిల్ షాప్ లు తక్కువ. కనుక పర్యాటకులు వెంట ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ వెంట తీసుకువెళ్లడం మంచిది. హిందూపూర్, లేపాక్షి కి సమీప పట్టణం. ఇక్కడ హోటల్స్, లాడ్జీలు, రెస్టారెంట్లు కలవు. వసతి కి కూడా హిందూపూర్ సూచించదగినది. గౌతమీపుత్ర శాతకర్ణి లో నటించిన బాలకృష్ణ ఎం ఎల్ ఏ గా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇదే !!
లేపాక్షి ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం : హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి హిందూపూర్ కు బస్సులు కలవు. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులలో, జీపులలో ప్రయాణించి లేపాక్షి వెళ్ళవచ్చు.
రైలు మార్గం : లేపాక్షి కి సమీపాన హిందూపూర్ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి. హిందూపూర్ లో దిగి, అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో, జీపులలో లేపాక్షి చేరుకోవచ్చు.
వాయు మార్గం : బెంగళూరు లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్నది. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని లేపాక్షి సులభంగా చేరుకోవచ్చు.
Tags
Anantapur