Drop Down Menus

List of Famous Temples Guntur District | Andhra Pradesh

మంగళగిరి:
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది. పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు.  మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి అంటే మనందరికీ ఎనలేని భక్తి. కోరికలు తీర్చే ఈ పానకాలస్వామికి మహా చరిత్ర వుంది. ఆయనను ఒక్కసారి దర్శించుకుని పానకం సమర్పిస్తే చాలు పాపాలు పోయి పుణ్యంకలుగుతుందని కోరికలు తీరిపోతాయని ప్రసిద్ధి.అయితే ఈ మంగళగిరి పానకాలస్వామికి మరోవిశిష్టత కూడా వుంది.ఆయనకు ఎంత పానకంపోయాలనుకుంటామో అందులో సగం తీసుకుని మిగతాది మనకు ఇచ్చేస్తారు. ఆ ఇచ్చిన ప్రసాదం సాక్షాత్తూ ఆ స్వామివారే ఇచ్చారని మహాప్రసాదంగా తీస్కోనివస్తాం.

ఎలా చేరాలి? 
రోడ్డు మార్గం:
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కి గుంటూరు నగరం ప్రధాన కేంద్రం. అందువల్ల, ఇక్కడ లభించే బస్సు సర్వీసులు అమోఘం. చెన్నై, కోల్ కత్తా అలాగే హైదరాబాద్ వంటి ఎన్నో జాతీయ రహదారులు ఈ గుంటూరు నగరానికి కలుస్తాయి. హైదరాబాద్ రహదారి ద్వారా ఢిల్లీ మరియు ముంబై నగరాలకు చేరుకోవచ్చు.

రైలు మార్గం:
గుంటూరులో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు అలాగే పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉండడానికి గల కారణం దక్షిణ రైల్వే శాఖ యొక్క నిర్వహణ. గుంటూరు లో ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్ ఇంకా విజయవాడ వంటి ఎన్నో పట్టణాల నుండి రోజువారి రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. టాక్సీ , బస్సు లేదా ఆటో రిక్షాల సేవలు ఈ రైల్వే స్టేషన్ సమీపంలో లభిస్తాయి.

వాయు మార్గం:
గుంటూరు లో విమానాశ్రయం లేదు. స్థానిక ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. ఇది 96 కి. మీ. ల దూరం ఇక్కడికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. హైదరాబాద్ లో ఉన్న ఈ విమానాశ్రయం ఎన్నో ప్రధాన నగరాలకి అలాగే పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉండడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనుసంధానమై ఉంది. ఇక్కడ నుండి ఒక ప్రైవేటు టాక్సీ ద్వారా గుంటూరు కి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి గుంటూరు కి చేరుకునేందుకు సుమారు నాలుగున్నర గంటల సమయం పడుతుంది.

ఆలయ దర్శన సమయాలు: 5.00 am to 1.00 pm and 4.00 pm to 8.00 pm.

కోటప్ప కొండ:
గుంటూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.ఈ గ్రామము మొదట కొండకావూరు అని పిలవబడేది , తర్వాత కోటప్పకొండ గా మారింది.  కోటప్పకొండ కి త్రికూట పర్వతం అనే మరో పేరుకూడా ఉన్నది. దీనికి కారణం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న మూడు శిఖరాలు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.

దర్శన సమయాలు:
ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది.

రవాణా సౌకర్యాలు:
కోటప్పకొండకు నరసరావుపేట పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు బస్సు ఉంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా లేక నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిపురాంతంకం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు.

మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం:
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం గుంటూరు జిల్లాలోని మాచెర్లలో కొలువై ఉన్న దేవాలయం.ఇది పట్టణంలో గల చంద్రవంకనది ఒడ్డున ఉంది. ఈ దేవాలయం క్రీ.శ 1113 లో శైవ దేవాలయంగ అనిర్మించబడింది. ఈ దేవాలయం బ్రహ్మనాయుడు కాలంలో వైష్ణవ దేవాలయంగా మార్చబడింది. దీనికి ప్రధాన కారణం అనేక మంది హిందువులు వైష్ణవ, శైవ మతములను విడిచి పెట్టి బౌద్ధ మతంలో చేరుతుండేవారు. ప్రజలు ఈ మత మార్పిడులను అర్థం చేసుకొనుటలో వివాదాలు ఎదుర్కొండేవారు. ఈ సమయంలో ఆదిశంకరాచార్యులు అద్వైత మతాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం దేవుడు ఒక్కడే, దేవుడు నీలోనే ఉన్నాడు అనే భావన ప్రబలినది. ఈ భావనల తరువాత హిందూ మతం నుండి బౌద్ధమతానికి వెళ్ళిపోయిన వారు తిరిగి హిందూ మతంలోనికి చేరి భౌద్ధ మతం భారత దేశంలో అంతరించిపోయింది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం ఆలయంలో ప్రధాన దేవతా మూర్తులు చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారు.. ఇది సుమారు 13 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయ ప్రధాన ద్వారం వద్ద ధ్వజస్తంభం దీనిపై స్వామి విగ్రహం చెక్క, కంచుతో చేయబడి ఉంది. దేవాలయ గాలిగోపురం ముందు ధ్వజస్తంభం ప్రక్కన బ్రహ్మొత్సవాల సమయం స్వామి వారి కళ్యాణానికి వినియోగించే కళ్యాణమండపం ఉంది. ప్రధాన దేవాలయం ముందు బలిపీఠం ఉంది. దీనిపక్కన దక్షణంలో కప్పక స్తంభం, ఉత్తరంన గిలకల బావి ఉన్నాయి. గర్భగుడి ముందు రంగ మండపంలో నాలుగు రాతి స్తంభాలు ఉన్నాయి. వాటి పై శ్రీ మధ్బాగవతము, శ్రీమన్నారాయణ అవతారము, శ్రీ మహాభారతం, శ్రీమద్ రామాయణం గాథలను చెక్కబడి ఉన్నాయి.

మాచర్ల, గుంటూరుకు 110 కి.మీ. దూరంలోను, నాగార్జునసాగర్‌కు 25 కి.మీ. దూరంలో ఉన్న ఒక పట్టణం.ఈ పట్టణం హైదరాబాదు నుండి 160 కి.మీ. దూరంలో ఉంది. వివిధ ప్రాంతాల నుండి మాచర్లను కలుపుతూ రోడ్డు మార్గాలు, రైలు మార్గం (గుంటూరు-మాచర్ల రైలు మార్గం) ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులే కాక, ప్రైవేటు బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి.

ఆలయ దర్శన సమయాలు :Temple Timings 06.00 am to 08:00 pm.

పొన్నూరు ఆంజనేయస్వామి:
పొన్నూరు, గుంటూరుకు 31 కి.మీ. దక్షిణాన ఉన్న ఒక చారిత్రక పట్టణము. మన పొన్నూరు లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి మరియు శ్రీ వెయ్యిలింగాల స్వామి వార్ల దేవాలయ ప్రాంగణంలో శ్రీ రాహు, కేతు మండపం నిర్మించడం జరిగినది. ఇక్కడి దేవతా మూర్తులు(రాహు, కేతు) సతీసమేతంగా ప్రతిష్టించటం విశేషం, ఇటువంటి అదృష్టం మన రాష్ట్రంలో కొన్ని దేవాలయాలలో మాత్రమే లభిస్తుంది. భక్తులు తమ దోషముల నివారణకు కింద తెలిపిన రోజులు, సమయములలో దేవాలయం సందర్శించ గలరు.

ఆలయ దర్శన సమయాలు : Temple Timings 06.00 am to 08:00 pm.

అమరేశ్వర స్వామి ఆలయం:
ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న చిన్న పట్టణం అమరావతి.  ఈ ప్రాంతాన్నిఇదివరకు ధరణికోట లేదా ధాన్య కటకం గా పిలిచేవారు. గుంటూరు నుండి 16 కిలోమీటర్ల దూరం లో ఉంది. స్వయంభు లింగం కలిగిన అమరేశ్వర స్వామి ఆలయం పేరు వల్ల అమరావతి గా ప్రసిద్ది చెందింది. స్కంద పురాణం లో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించబడినది. ఈ ప్రాంతం శాతవాహన రాజులకు క్రీ.పూ. 1 నుండి 3 వ శతాబ్దం వరకు రాజధానిగా వ్యవహరించింది.   వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యంగా ఈ ప్రాంతం నిలుస్తుంది. ఈ ప్రాంతం లో అమరేశ్వర ఆలయం పంచరామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న కృష్ణా నది ఈ ప్రాంతానికి మరింత పవిత్రత చేకూర్చింది. మహాశివుడికి అంకితమివ్వబడిన ఆలయం అమరేశ్వర టెంపుల్. ఇక్కడ 15 అడుగుల ఎత్తున్న పాలరాతి శివలింగం ఉంది. ప్రాణేశ్వర, అగస్తేశ్వర, కోసలేస్వర, సోమేశ్వర ఇంకా పార్థివేశ్వరలనబడే అయిదు లింగాల రూపం లో మహాశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్ముతారు. ద్రవిడియన్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన అమరావతి ఆలయానికి సంబంధించి ఎన్నో గాధలు ఉన్నాయి. ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. శ్రీ రామచంద్రుడే స్వయంగా ప్రతిష్టాపించిన లింగం అని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీ రామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్దిగాంచినది.

ఎలా వెళ్ళాలి? 
ఈ అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడానికి సమీప స్థలం ఏదంటే అది గుంటూరు . ఇది గుంటూరు నుండి 40 కి.మీ.ల దూరంలో కలదు. గుంటూరు, విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.

రైల్వే:
సమీప రైల్వే జంక్షన్లు విజయవాడ, గుంటూరులో ఉన్నాయి.

విమానయానం:
దేశవ్యాప్తంగా గమ్యస్థానాలకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం ద్వారా గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రాజధాని ప్రాంతానికి సేవలు అందిస్తుంది.

ఆలయ దర్శన సమయాలు : Morning: 6.00 am to 12.00 noon. Evening: 4.00 pm to 8.00 pm

కాకాని మల్లికార్జునుడు:
శ్రీరామచంద్రుడు, ఇంకా అనేక పురాణ పురుషులేగాక, శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం గుంటూరు జిల్లాలో వున్నది.   ఇక్కడవున్న మల్లికార్జునుని, భ్రమరాంబను  శ్రీశైలంలో నెలవైన మల్లికార్జనుడు, భ్రమరాంబల అంశలంటారు.  దీనికి నిదర్శనముగా శ్రీశైల స్ధల పురాణములో శ్రీ మల్లికార్జునుని అంశావతారములను వివరించేటప్పుడు కాకానియొక్క ప్రశస్తి కూడా చేయబడింది. ఈ దేవాలయ ప్రాంగణంలో రాహు-కేతు గ్రహ మండపంలో గ్రహ పూజలు జరుగుతాయి.  సర్పదోషమున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

ఈ ఆలయంలో ఇంకా విఘ్నేశ్వరుడు, భద్రకాళి, వీరభద్రులు, పెద్ద నందీశ్వరుడు, శివతాండవమూర్తి, మహిషాసురమర్ధని, సుబ్రహ్మణ్యస్వామి వగైరా దేవతామూర్తులని, కళ్యాణ మండపాన్ని  చూడవచ్చు. సంతానములేనివారు, రోగగ్రస్తులు ఒక మండలంరోజులు దీక్షతో రోజూ స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి కష్టాలు తొలిగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.  శివక్షేత్రమైనా సత్యన్నారాయణ వ్రతాలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతాయి.  ఇక్కడ వాహన పూజలు విశేషంగా జరుగుతాయి.

రవాణా సౌకర్యం:
5వ నెంబరు రహదారి సమీపంలో, గుంటూరుకి 7 కి.మీ. ల దూరంలో  గుంటూరు – విజయవాడ మధ్య వుండటంవల్ల గుంటూరు, మంగళగిరి, విజయవాడనుంచి బస్సు సౌకర్యం బాగా వున్నది.

 ఆలయ దర్శన సమయాలు: 5.00 AM to 1.30 PM and 4.00 PM to 8:00 PM.

బాపట్ల - భావ నారాయణ స్వామి :
శ్రీశ్రీశ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయము తెలుగు రాష్ట్రములోని ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇది సుమారు 1400 సంవత్సరాలకు పూర్వము చోళుల చే నిర్మితమైనది. శైవమునకు పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవమునకు కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. భావనారాయణ స్వామి దేవాలయాలు మొత్తం ఐదు. అందువల్లే వీటిని పంచ భావన్నారాయ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ ఐదు క్షేత్రాలు వరుసగా బాపట్ల, పొన్నూరు, భావరేవరపల్లి, సర్పవరం, పట్టిసీమ.

ఈ దేవాలయంలో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. ఇక ఈ దేవాలయంలో విగ్రహం మునికాళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. ఇటువంటి విగ్రహం భారత దేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న మరో మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇక మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు.

ఎలా చేరుకోవాలి :
బాపట్లకు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుంచి నిత్యం నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి. అదే విధంగా దక్షిణ భారతదేశంలోని చాలా నగరాల నుంచి రైలు సౌకర్యాలు ఉన్నాయి. బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి భావనారాయణ స్వామి దేవాలయం కేవలం అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఆటోలు అందుబాటులో ఉంటాయి.

 ఆలయ దర్శన సమయాలు: 06.00 am to 08:00 pm.

సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం పొన్నూరు:
గుంటూరు సమీపంలోని పొన్నూరులో వెలసిన సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం మరో ఐదు దేవతలకు నిలయం కావడం ఆలయ విశిష్టత. ఈ ఆలయాన్ని జగద్గురు జగన్నాధస్వామి వారి ఆధ్వర్యంలో 1938లో ఈ ఆలయ శంకుస్థాపన జరిగింది. ఇక్కడ ప్రధాన దైవమైన సహస్ర లింగేశ్వర స్వామితో పాటుగా శ్రీవీరాంజనేయ స్వామి, శ్రీగరుక్మంత స్వామి, శ్రీదశావతారాల స్వామి, శ్రీకాలభైరవ స్వామి మరియు శ్రీస్వర్ణ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఆలయంలో శ్రీపార్వతీ దేవి, శ్రీషణ్ముఖ స్వామి పూజలందుకొంటున్నారు.

రవాణా సౌకర్యం:
ఈ ఆలయానికి రవాణా సౌకర్యం ఉంది.గుంటూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆలయ దర్శన సమయాలు:  06.00 am to 08:00 pm
tourist places in guntur and vijayawada, guntur special places,famous shiva temples in krishna district, famous temples in andhra pradesh, temples near guntur

                                                         

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments