శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.
"శ్రీముఖలింగం" పేరులోనే చక్కని అర్ధం ఉంది. "శ్రీముఖలింగం" అనే పదానికి "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని అర్ధం. ఈ దేవాలయం లోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తరువాత ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ.
ముఖలింగం ఎలా చేరుకోవాలి ? శ్రీకాకుళం ఆర్ టి సి బస్ స్టాండ్ నుండి ప్రతి గంట గంట కు ముఖలింగం కు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ప్రయాణ సమయం 2 గంటలు. గుడి కి సమీపాన వైజాగ్ ఎయిర్ పోర్ట్ కలదు మరియు ఆముదాలవలస (45 కి. మీ.) సమీపాన ఉన్న రైల్వే స్టేషన్.
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి:
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలోఅరసవల్లి అనే ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉన్నది. ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయం. ఇది మన దేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైనది. ఇక ఈ ఆలయంలో సూర్య భగవాడుని పూజించిన వారు అన్ని కష్టాలూ తొలిగిపోయి హర్షంతో వెలుతారు కాబట్టి ఈ గ్రామాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. ఆ హర్షవెళ్లే కాలక్రమంలో అరసవెళ్లి అయ్యిందని చెబుతారు.
ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి 9, 10,11, 12 తేదీల్లో అదే విధంగా అక్టోబర్ 1,2,3,4 తేదీల్లో స్వామివారిని ఆదిత్యుని తొలికిరణాలు ఇక్కడ స్వామివారిని తాకుతాయి. మొదట పాదాలమీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన విషయాన్ని చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీని వల్ల సర్వపాపాలు తొలిగి పోతాయని భక్తులు నమ్ముతారు.
ఆలయ దర్శన సమయాలు:
సర్వదర్శనం,ఇతర కార్యక్రమాలు
> ఉదయం 6.00 గం.ల. నుండి 12.30 గం.ల. వరకు
> సాయత్రం 3.30 గం.ల. నుండి రాత్రి 8.00 గం. వరకు
> సుప్రభాతం - ఉదయం 5 గం.కు
> నిత్య అర్చన - ఉదయం 5.30 గం.కు
> మహానివేదన - మధ్యాహ్నం 12.30 గం.కు
ఆలయానికి చేరుకొనే మార్గాలు:
బస్సు ద్వారా
శ్రీకాకుళం జిల్లా ముఖ్య కేంద్రమైన శ్రీకాకుళానికి అన్ని ప్రాంతాలనుండి విరివిగా బస్సులు లభిస్తాయి. విశాఖపట్నం నుండి ప్రతి 30 నిమిషాలకు నాన్‌స్టాప్ బస్సు సౌకర్యం ఉంది.
రైలు ద్వారా
శ్రీకాకుళానికి సుమారు 13 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇచట అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఆగుతాయి. ఈ రైల్వే స్టేషను నుండి విరివిగా బస్సులు శ్రీకాకుళానికి ఉంటాయి. నేరుగా అరసవిల్లి వద్దకు చేరుకోవచ్చు.
విమానం ద్వారా
శ్రీకాకుళానికి సుమారు 106 కి.మీ దూరంలో విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి బస్సుల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు.
శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం - శ్రీకూర్మం:
శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానంశ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.
పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు:
> కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో మూలాలు.
> మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం.
> విష్ణు ప్రముఖ దశావతారాలలో 2 వ అవతారం.
> విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది, రెండు ద్వజస్థంబాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి.
> రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో ఒకటి.
> అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలతో ఉన్న దేవాలయాలులో ఒకటి.
> దుర్గా మాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం., ఇతర వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.
> దీని శిఖరం రాతి శిల్పం - గాంధార శిల్పకళా అని అంటారు., ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాలు క్రింద వృథాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్తంభాలు ఉన్నాయి.
> వారణాసి (కాశి) వెల్లడానికి సొర్ంగ మార్గం ఉంది, ప్రస్తుతం దీన్ని మూసివేసారు.
> వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె, మరణించినవారి అంతిమ కర్మలు, మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు .
> ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహా ప్రభు అనేక గొప్ప రాజులు, సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు .--కె.యల్.రావు
ఆలయానికి ఈ విధంగా చేరుకోవొచ్చు:
శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండు నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టిసీ బస్సులు ఉన్నాయి. ఉదయం 6.00గంటలనుండి, రాత్రి 8.00గంటల వరకు నడుస్తాయి. అంతేకాక ఆటోలు, టాక్సిలు ఉన్నాయి.
ఆలయ దర్శన సమయాలు : 05:00AM - 02:00PM - 05:30PM - 08:30PM
వాసుదేవ ఆలయం - మందస:
సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది. ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఎర్రని ఇసుక రాయితో ఒరిస్సా శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు మరియు ఒరిస్సా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ తాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆల యం తప్పక సందర్శించతగినది.దగ్గరలో ఉన్న స్టేషన్ పలాస (18 కిమీ). జాతీయ రహ దారి 5 నుండి కేవలం 5 కి.మీ.లు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 100 కి.మీ.లు. విశాఖపట్నం నుండి 200 కి.మీ.లు.
ఆలయ దర్శన సమయాలు : 6 am - 11 am, 4:30 pm - 7:30 pm
ఎండల మల్లికార్జునస్వామి రావివలస:
రావివలస, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన టెక్కలి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. శ్రీశ్రీశ్రీ ఎండల మల్లన్నగా పేరు పడిన ఇక్కడి దైవం మల్లికార్జునస్వామివారు. ఈ దేవుని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యముగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం.
అరుదైన చారిత్రక సంఘటనలకు, ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు తెలుగునేల. ప్రాచీనకాలం నాటి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి. అవన్నీ స్వయంభూ లింగాలు కూడా. అయితే స్వయంభూ శివలింగాలలో అతిపెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది. మన దేశంలోనే పెద్దదైన ఈ శివలింగం మన రాష్ట్రంలో ఉండడం విశేషం. టెక్కలికి 6 కి.మీ. దూరంలో ఉన్న గ్రామంలో వెలసిన స్వామియే మల్లికార్జునుడు, ఆ గ్రామమే రావివలస. ఈ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభూ లింగం గురించి కొద్దిమందికే తెలుసు. దాని ఎత్తు 55 అడుగులు. అందువల్ల ఇచ్చడ గోపురం ఉండదు. ఆ దైవం ఎప్పుడు ఎండలో ఉండాల్సిందే. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది.
ఎలా వెళ్ళాలి?: శ్రీకాకుళం నుంచి టెక్కలి దాదాపు 33 కి.మీ. దూరంలో ఉంది, అక్కడి నుంచి మూడు కి.మీ. దూరంలో రావివలస ఉంది.
ఆలయ దర్శన సమయాలు : 4.30am-6am 7.45pm
శాలిహుండం:
శాలిహుండం శ్రీకాకుళం జిల్లా, గార మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గార నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. శ్రీకాకుళం లో హిందూ దర్మం తో పాటు బౌద్దంమతం కూడా బాగా వర్ధిలింది అని శాలిహుండం ద్వారా మనకు తెలుస్తుంది.శాలిహుండం ఒక చరిత్రాత్మక విశిష్టిత కలిగిన బౌద్ధ క్షేత్రం.శాలిహుండం శ్రీకాకుళం జిల్లా లో గార మండలం లో ఉంది.
ఈ బౌద్ధ క్షేత్రం వంశధార నది ఒడ్డున వున్న బౌద్ద ఆరామాలు మరియు శిథిలమైన పురాతన దేవాలయాలతో ఉన్న పర్యటక ప్రాంతం.శాలిహుండం కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందటానికి మంచి అవకాశం ఉన్న అందమైన చరిత్రాత్మ బౌద్ధ క్షేత్రం.ఈ క్షేత్రాన్ని మొదట 1919 లో గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుగొన్నారు.
2011 లోబుద్దుని ఏకశిలా విగ్రహం తవ్వకాలలో బయటపడింది. పరిచారికలు వింజామరలు విసురుతుండగా బుద్ధుడు వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఏక శిలావిగ్రహం వెలుగు చూసింది. ప్రస్తుతం బుద్ధుని కొండ గుట్ట పైన నుయ్యి వంటి ప్రదేశం మాదిరే వేణుగోపాలుని కొండ పై కూడా పడమటి భాగ శిఖరాగ్రాన ఉండి అక్కడ ఈ విగ్రహం వెలుగుచూసింది.
శాలిహుండం శ్రీకాకుళం కి 20KM దూరంలో ఉంది. శ్రీకాకుళం నుండి గార కి ప్రతి 30 నిమిషాలికి బస్సులు ఉన్నాయి .అక్కడి నుండి 3KM దూరంలో ఉంది.
famous temples in srikakulam district, srikakulam tourist places in telugu, srikakulam famous food, srikakulam temples history, beaches in srikakulam, tourist places in vizianagaram district, tourist places in rajam, arasavalli
Tags
Srikakulam