Drop Down Menus

Sri Durgamata Temple, Rambagh | Attapur Hyderabad

శ్రీ దుర్గామాత ఆలయం, రాంబాగ్, అత్తాపూర్,హైదరాబాద్ :

హిందూ పురాణాల ప్రకారం మొట్ట మొదటి శక్తి శ్రీ ఆది పరాశక్తి. అమ్మ వారి అనుగ్రహం లేనిదే బ్రహ్మ , విష్ణు , రుద్రులు సైతం ఏ పని చేయలేరు. కావున ఏ పని పూర్తి కావాలి అమ్మవారి అనుగ్రహం తప్పని సరిగా ఉండాలి. అటువంటి ఆది పరాశక్తి ఆలయాలలో నేడు హైదరాబాద్ నందు అత్తాపూర్ లో  ఉన్న అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం.

ఆలయ చరిత్ర : 

శ్రీ దుర్గామాత ఆలయం సుమారు 400 సం || పూర్వముదిగా , కులికుతుబ్ షా మంతులైన అక్కన్న మాదన్నల కాలము నాటిదిగా చెప్పబడుతున్నది. ఈ ఆలయమంతయు రాతి గోడలచే స్తంభములచే నిర్మింపబడినది. ఈ ఆలయంలో జగన్మాతయైన శ్రీ మైసాసురమర్ధిని , శ్రీ యంత్రము మేరు రూపంలోనున్నవి. శ్రీ శివ యంత్రము శివలింగము శివపరివారము మరియు నందీశ్వరుడు మొదలగు దేవతామూర్తులు ప్రతిష్టాపన చేయబడి యున్నవి. ఈఆలయం విశేషణమెమనగా ఇక్కడ శ్రీ యంత్ర మహత్యమే అధికముగా ఉన్నట్లు పూజ్యులు తెలియజేయుచున్నారు. ఇక్కడ ప్రాచీన కాలం నాటి పుష్కరిణి కూడా కలదు.



శ్రీ దుర్గామాత ఆలయము గోల్కొండ నవాబుల మంత్రులైన అక్కన్న , మాదన్న కాలము నాటిదిగా చెప్పుచున్నారు. ఈ ఆలయము 1952 లో శ్రీ తుల్జా ప్రసాద్ గారి కాలములో అత్యున్నత స్థానములో   అభివృద్ధి చెంది ఉండెను.. వీరు శ్రీదేవి ఉపాసకులు మరియు జ్యోతిశాస్త్ర పండితులు శ్రీ బన్సిలాల్ రాటిగారు , మరియు గోవిందనారాయణ దూతగారు పస్తుయము శ్రీ బన్సిలాల్ రాటి వారి వంశము వారు వంశపారంపరముగా ఈ ఆలయమునకు తనమనధనములతో సేవలందించుచూ సహకరించుచూన్నారు. శ్రీ లక్ష్మీ నారాయణ రాటిగారు కూడ తన పూర్వుల వలె ప్రతి కార్యక్రమమునకు వచ్చి సహకరించుచున్నారు.

శ్రీ తుల్జా ప్రసాద్ గారి తర్వాత ఈ ఆలయము క్రమేపీ క్షీణదశకు రాసాగినది. వీరి తర్వాత వారి అల్లుడైన శ్రీ విశ్వనాథ ప్రసాదు గారు అర్చకులుగా నుండిరి. వీరి కాలములో దినదినము క్షీణ దశకు వచ్చినది. విశ్వనాథ ప్రసాద్ గారి చివరి కాలము అనగా 1975 నుంచి శ్రీ బిస పెంటయ్య  తండ్రి బిరయ్య హైదర్ గూడ గారు మరియు గోళయ్య ల నర్సింహ గారు కూడా ఆలయమునకు వెళ్ళి , అర్చకుల వారికి సహకరించేవారు. శ్రీ విశ్వనాథ ప్రసాద్ గారు అనారోగ్యముగా నున్నప్పటి నుండి క్రమక్రమముగా ఆలయ బాద్యతలు చేపట్టేవారు.



శ్రీ విశ్వనాథ ప్రసాద్ గారు గతించగా వారి తమ్ముడైన శ్రీరాంప్రసాద్ గారు అర్చకులుగా నుండిరి. కానీ అచీరకాలములో వారు కూడా దివంగతులైనరు. ఈ ఆలయము చాలా క్షీణ దశకు వచ్చినది.


ఈ ఆలయములో ఆగ్నేయ మూలయందు రెండు , నైరుతి దిశయందు ఒకటి , వాయువ్య దిశలో నొక గది వెరసి నాలుగు భూగర్భ గదులు ఉన్నవి. పూజ్యులు వీటిని ధ్యానమందిరములుగా తెలుపుచున్నారు. (ఇటీవల ఆలయములో దర్శించిన పూజ్యశ్రీ సద్గురు వీరానందస్వాముల వారు బెలూంగుహలు కొలిమిగుండ్ల మండలం కర్నూలు జిల్లా (ఆంధ్రప్రదేశ్) వారు వీటిని శుభ్రపరచి పునః ధ్యానగదులుగా వాడుటకు ప్రోత్సహించుచూన్నారు.)


ఈ ఆలయ శిఖరములు అనగా శ్రీ దుర్గామాత నవగ్రహ   మండపముల మీదనున్న శిఖరములు శ్రీ యంత్ర రూపములో నిర్మింపబడినవి. శ్రీ శివాలయము యొక్క శిఖరము శివయంత్ర రూపంలో నున్నది. ఈ ఆలయములో గోశాల మరియు యజ్ఞశాల ఏర్పాట్లు చేయబడినవి.


ఈ చుట్టూ ప్రక్కల నున్న ఆలయములలో అనగా శ్రీ రామాలయము , శ్రీ శివాలయము , శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయము లలో లేని ప్రశాంతత ఈ ఆలయములో లభించినట్లు పూజ్యశ్రీ ప్రకాశనరేంద్రస్వామి వారు తెలియచేసినారు. శ్రీవారు ఒక్కరోజు దినమంతయు ఈ మందిరములో గడిపి ప్రశాంతతో ధ్యానము చేయబడినది చాలా సంతోషంతో వెలుబుచ్చిన్నరు. ఈ ఆలయములో వారమునకో లేదా ఎవరికకైనా భక్తి కలిగి దీపము పెట్టవలయు నన్నుకున్నవారో దీపము పెట్టె స్థితిలో నుండెను.



1979 సం || లో హైదర్ గూడ ప్రణవ భక్తసమాజ సభ్యులైన శ్రీ సింగపురం యెల్లారెడ్డి గారు శ్రీ గోళయాల నరసింహ గౌడ్ గారు శ్రీ బిస పెంటయ్య గారు శ్రీ శెట్టి గారి వాసుదేవరావుగారు శ్రీ శెట్టి గారి మాధవరావుగారు , శ్రీ వనం నారాయణ రెడ్డిగారు శ్రీ నారాయణదాస్ హెడా గారు , శ్రీ కొంగళ్ళ లక్ష్మణ మూర్తి , గారు శ్రీ చేగురు సదానందరెడ్డి గారు , శ్రీ గందము శ్రీహరిగారు శ్రీ నరసింహ గారు శ్రీ అశోక్ ఆనందకుమార్ గారు , సర్ లక్ష్మయ్య గారు శ్రీ బోటి గూడెం సత్తయ్య గారు శ్రీ రావుల గండయ్య గారు , శ్రీ ఉత్తమసింగ్ గారు శ్రీ కె. నారాయణదాస్ గారు శ్రీ రామేశ్వర రావు గారు, శ్రీ నారగూడెం మల్లారెడ్డి గారు , శ్రీ గుమ్మ కొండ నాగిరెడ్డి గారు తదితర భక్తులు చేరి ఈ ఆలయములో ప్రతిరోజూ దీపారాధన చేయడము మరియు


వారమున కొకసారి ఆలయమును శుభ్రము చేయుట మొదలగు పనులు చేసి అమ్మవారి వస్త్రము ఉతికి , అరవేసి అదే వస్త్రమును పనులు చేసి , అమ్మవారికి కట్టించి పూజించేవారు. కొంత కాలం తరువాత శ్రీ సింగపురం యెల్లారెడ్డిగారి ప్రోత్సాహము , సహకారముతో భక్తులు రావడము అధికముగా అయినందున , ప్రతి ఆదివారం కుంకుమార్చనచేయడం ప్రారంభించబడినది. ప్రతి సం || వసంత , శరన్నవరాత్రోత్సవములు జరుపబడినవి.


కొంత కాలం తరువాత ఆదివారమునకు బదులు మంగళవారము సాయంత్రము కుంకుమార్చన చేయుచు వచ్చినారు. శ్రీ సింగపురం యెల్లారెడ్డిగారు కొంతమంది భక్తులకు అమ్మవారి సహస్రనామములు , అర్చన విదానము మొదలగునవిస్వయముగా తాను దగ్గర ఉండి నేర్పించినారు. వారి వద్ద నేర్చుకున్న వారిలో కొందరు శ్రీ బిస పెంటయ్య గారు శ్రీ యం. నరహరిగారు, శ్రీ యం. లక్ష్మయ్య గారు , శ్రీ రావుల గండయ్యా గారు తదితరులున్నారు.


శ్రీ రెడ్డిగారి సహకారముతో మందిరమునకు వచ్చు భక్తులకు ఉచితముగా యంత్రము , కుంకుమానిచ్చి కుంకుమార్చనలో పాల్గొనునట్లు 1988 లో ప్రవేశపెట్టినారు. తదుపరి శ్రీ దుర్గామాత ఆలయ సేవ సమితి సభ్యుల సహకారంతో వివిధ కార్యక్రమములు జరుపబడినవి.


శ్రీ సింగపురం యెల్లారెడ్డి కీ|| శే|| సింగపురం సాయిరెడ్డి రుక్కమ్మల పుణ్య దంపతులకు మొదటి సంతనముగా నిరుపేద కుటుంబంలో జన్మించి , తొమ్మిది రేకుల పీఠధిపతియైన శ్రీ శ్రీ శ్రీ కిషన్ ప్రభువు యొక్క శిష్యుడైన శ్రీ శ్రీ శ్రీ రామదాసుగారి శిష్యుడై ఉపదేశము తీసుకొని , వారి ప్రధమ శిష్యునిగా ఖ్యాతిగాంచి , రామదాసు తరువాత తొమ్మిదిరేకుల పీఠాధిపత్యము వహించి ,


తరువాత అతని సోదారుడగు (గురు సంతనములో ) శ్రీశ్రీశ్రీ పూజ్యనీయులైన లక్ష్మయ్య ఆమనగల్లు పీఠధిపత్యమును వారికి వదిలి తిరిగి వారి స్వగ్రామమైన హైదర్ గూడ వచ్చి వారి తల్లిదండ్రుల సేవ జేయుచ్చు ప్రణవ భక్త సమాజములో గురువుగా పూజాలందుకొని పురాతనమైన శిధిలావస్థలో నున్న గజముఖ అభిశేఖరుని శివలయమును సమాజము యొక్క సహకారముతో పునరుద్దరింపజేసి అక్కడ ప్రతి మహాశివరాత్రికి ఘనంగా పూజలు జరిపించి అభివృద్ధిలోనికి తెచ్చినారు.



వారి తదుపరి శ్రీ గౌ || కీ || శే || గోళయాల నరసింహ ప్రణవ భక్త సమాజము యొక్క కార్యదర్శిగా ఉండి , సమాజము నుండి అనివార్య కారణాలవలన వైదొలిగి , శ్రీ బిస పెంటయ్య సహకారముతో క్షీణవస్థలో నున్న దుర్గామాత మందిరామును 1979లో అభివృద్ది పరచుటకు నిర్ణయించుకొని వారు ఇరువురు పట్టుదలతో అభివృద్ది పరచి పూజా కార్యక్రమములు చేయుట ప్రారంభించిరి.


అట్టి పూజ కార్యక్రమములను అభివృద్ది పరచుట కొరకు శ్రీ శ్రీ శ్రీ పూజ్యనీయులైన సింగపురం యెల్లారెడ్డి గారి సహకారము కోరగా డానికి అంగీకరించి పూజలను ప్రారంభించి ఘనంగా పూజలు జరుగునట్లు అభివృద్ధి పరచినారు. తరువాత 6-5-95 లో శ్రీ శ్రీ శ్రీ సింగపురం యెల్లారెడ్డి గురుసాన్నిధ్యముజెందినరు అని చెప్పుటకు చింతించుచున్నాము.


ఆలయమునందు జరుగు పూజలు మరియు ఇతర కార్యక్రమాలు :

1979న సం || నుండి ఈ ఆలయములో కుంకుమార్చన జరుపబడుచున్నది. 4 ఏప్రిల్ 1988 సం || నుండి ప్రతి మంగళవారము ఆలయమునకు వచ్చు భక్తులకు ఉచితముగా కుంకుమార్చన చేసుకొనుటకు అన్నీ సదుపాయములు కల్పించబడినవి.

* ఆలయములో సభ్యత్వము పొందిన వారికి ప్రతి దినము అర్చకులు సభ్యుని పేర గోత్రణమములతో కుంకుమార్చన చేయబడుచున్నది.

* పర్వదినముల సందర్భమున ముఖ్య అతిధులను ఆహ్వానించి సన్మానింపబడుచున్నది.

* అన్నదాన కార్యక్రమములో పాల్లోనూ భక్తులకు వస్త్రములిచ్చి సన్మానింపబడుచున్నది.

* నవరాత్రుల సందర్భమున సభ్యత్వము పొందిన వారిలో కొంత మందిని అమ్మవారి స్వరూపంగా భావించి సన్మానింపబడుచున్నది.

*ప్రతి మాసములో అమావాస్యయైన మొదటి మంగళ వారము రోజు శ్రీ లలితా యజ్ఞము , కుంకుమార్చన , అన్నదాన కార్యక్రమము జరుపబడుచున్నది.


*ప్రతి శనిత్రయోదశికి యజ్ఞము జరుపబడుచున్నది. యజ్ఞంలో పాల్గొను భక్తులకు భోజన వసతి కల్పించబడినది.

* సం || లో వచ్చు వసంత , శరన్నవరాత్రోత్సవ కార్యక్రమములు ఘనముగా జరుపబడుచున్నవి.

* ప్రతి శివరాత్రి రోజున రుద్రాభిషేకము చేయబడుచున్నది. కార్యకర్తలచే జాగరణ కార్యక్రమము చేయబడుచున్నది.

* శరత్ పూర్ణిమ కార్యక్రమము చేయబడుచున్నది. వసంత పంచమిరోజు వసంతోత్సవము జరుపబడుచున్నది.

* వివిధ పర్వదినములయందు ఆలయమునకు పీఠాధిపతులను సాధువులను ముఖ్య ఆతిధులుగా ఆహ్వానించి వారిచే సత్సంగము , భక్తి విషయములను , భారతీయ సంస్కృతి లేక ఆ పర్వదిన ప్రముఖ్యమును గాని భక్తులకు వివరించబడుచున్నది.

* ప్రతి కార్తీక మాసములో దీపావళి తరువాత వచ్చు రెండవ ఆదివారం రోజున కార్యక్రమము జరుపబడుచున్నది.


* ఫాల్గుణ పూర్ణిమ రోజున హోళీ పండుగ జరుపబడుచున్నది.

* ఆలయ సభ్యులను ( అనగా శ్రీ దుర్గామాత సేవా సమితి సభ్యులు మరియు ఇతర భక్తులను) ప్రతియేటా విహార యాత్రలకు తీసుకొనిపోబడుచున్నది.

* గోమాత సేవ చేయువరికి ఇక్కడ సదుపాయము చేయబడినది. కొంతమంది భక్తులు ఆర్ధికముగా సహకరించుచున్నారు. గోమాతకు ప్రతిదినము సుమారు రు.50/- ఖర్చు అగుచున్నది. గోమాత సేవార్ధము ఆర్దికముగా సహకరించుటకు ప్రోత్సహింపబడుచున్నది.

* 1991 సం || మహిళలు ఆలయసభ్యులుగా చేరి అర్చన తదితర కార్యక్రమములలో సహకరించుచూన్నారు. అట్టివారిలో శ్రీమతి బి. సావిత్రి చంద్రశేఖర్ , శ్రీమతి టి మాధవి , శ్రీనివాస్ , శ్రీమతి జయలక్ష్మి నారాయణ , శ్రీమతి కె. లలితా లక్ష్మణ మూర్తి , శ్రీమతి కె. భారతి నారాయణదాస్ , శ్రీమతి యస్ . నాగమణి యాదయ్య , శ్రీమతి యస్ . బాలమణి , మల్లేష్ మొదలగువారు అమ్మవార్కి సేవ చేయడము మొదలు పెట్టినారు.

* ప్రస్తుతము ఆలయ దైనందిన కార్యక్రములో మహిళా కార్యకర్తలుగా శ్రీమతి కె. పుష్పశ్రీరాములు , శ్రీమతి యస్. నాగమణి , యాదయ్య , శ్రీమతి కె. భారతి నారాయణదాస్ , శ్రీమతి యస్ బాలామణి , మల్లేష్ , శ్రీమతి జి. శోభారాణి బక్కరెడ్డి , శ్రీమతి తోడి మణి అరుణ , శ్రీమతి సి. స్వరప సదానందరెడ్డి , శ్రీమతి బి. వసంత నాగేందర్ రెడ్డి , శ్రీమతి కె. లలిత లక్ష్మణ మూర్తి , శ్రీమతి తాటి మంజుల యాదయ్య , శ్రీమతి శాలిని చన్బసప్ప మరియు కుమారి రాజ్యలక్ష్మీ మొదలగువారు పని చేయుచున్నారు.


ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరములు :

శ్రీ దుర్గామాత ఆలయ సేవా సమితి వారు ఈ ఆలయ కార్యక్రమములతో పాటు పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగముగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరములను గూడ నిర్వహించుచూన్నారు. ఆలయ సేవా సమితి వారి ఆహ్వానము నందుకొని " మానవ సేవాయే మాధవ సేవగా " భావించి చార్మినార్ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు వారు ఉచిత వైద్య శిబిరములను నిర్వహించి బీదబడుగు ప్రహాలకు మరియు ఈ ఆలయ పరిసర గ్రామ ప్రజలకు సేవలందించినందులకు ప్రజల తరపున, ఈ ఆలయ సేవా సమితి  తరపున మా హృదయ పూర్వక అభినందనలు తెలియజేయచున్నాము.

మాకు ముఖ్యముగా డాక్టర్ జి . వెంకటయ్య , యం. డి. ఆయుర్వేదిక ప్రొఫెసర్ చార్మినార్ వారి సహాయ సహకరములు విరివిరిగా లభించూచున్నానందున ఈ కార్యక్రమములు విజయవంతముగా జరిగినది.


ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధులు స్త్రీ , శిశు వ్యాధులు , తదితర వ్యాధులన్నీటికి పరీక్షలు జరిపి ఉచితముగా మందులు యిచ్చినారు. నేత్ర నిపుణుల గూడ పరీక్షలు చేసి మందులు యిచ్చినారు. శాస్త్ర చికిత్స  అవసరమనుకున్న వారికి సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించుకోనూటకు సలహా నోసంగినారు. అవసరమనిపించిన వార్కి ఉచితముగా అద్దాలు కూడా అందజేసినారు.

చెవి , ముక్కు , గొంతు మరియు దంత వ్యాధి నుండి బాధపడుతున్న వారికి గూడ పరీక్షలు చేసి మందులు యిచ్చినారు. ఈ ఉచిత వైద్య శిబిరములకు సగటు 300 మంది లబ్ధిపొందినారు. ఈ ఆలయ పరిసర గ్రామముల నుండి అనగా హైదర్ గూడ , ఉప్పరపల్లి , అత్తాపూర్ , నందిమూసలయ్యాగూడ , తదితర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వ్యాధిగ్రస్థూలు పాల్గొనినారు.



10-1-2000 న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరమునకు గౌరవనీయులు శ్రీమతి కె. పుష్పలిలా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖమాత్యులు ముఖ్య అతీతులుగా విచ్చేసి ఈ కార్యక్రమమును ప్రారంభించిన్నారు. సే కొండకళ్ళ కాంతారెడ్డి మాజీ సర్పంచు అత్తాపూర్ కూడా ఈ  శిబిరమునకు  విచ్చేసినారు.

భక్తుల సహాకారముతో జరిగిన అభివృద్ది కార్యక్రమములు :

* ఈ ఆలయమునకు సింహద్వారము ఒక భక్తుని సహకారముతో నిర్మింపబడినది.

* తేదీ 12-11-1990లో వర్షపు తాకిడికి ఆలయ ఈశాన్య భాగమునందుగల సత్రము గోడ పడిపోగ పునః నిర్మాణము చేయబడినది. దీనికి శ్రీ దేవిలాల్ రాటి ఆర్ధిక సహకారం అందించినారు.

* తేదీ  20-5-1991 లో ఆలయ ప్రాంగణములో శ్రీదేవి లాల్ రాటి మూసాబౌలీ బండలు వేయించినారు.



* 12-12-1992 లో ఆలయ దక్షిణ భాగమునందుగల సత్రములో బండలను శ్రీ దేవిలాల్ రాటి వేయించినారు.

* 5-6-1993 లో ఆలయ పడమర భాగమునందుగల  సత్రములో బండలను శ్రీ బిస పెంటయ్య గారు వేయించిన్నారు.

* 6-4-1994 లో ఆలయ ఆగ్నేయ భాగమున నున్న గది వర్షమునకు పడిపోగ శ్రీ బిస పెంటయ్య గారు కట్టించినారు.

* 12-12-1994లో ఆలయపూ తూర్పుభాగమున నున్న సత్రములో శ్రీ ఎరువ బాలకృష్ణా రెడ్డి మరియు యాదిరెడ్డి హుడా కాలనీ బండలు వేయించినారు.



* 10-3-1995న గర్భగుడిలోని శ్రీ యంత్రము చుట్టూ టైల్స్ శ్రీ శ్రీకాంత్ లారీ మెకానిక్ వేయించినారు.

* 10-10-1995 లో ఆలయ గర్భగుడిలో పాలిష్ బండలు శ్రీ యాదయ్య లారీ మెకానిక్ రాంబాగ్ వేయించినారు.

* 3-9-1996 లో ఆలయ యజ్ఞగండంఉ ఉత్తరభాగము శ్రీసంతోష్ కుమార్ గొల్లకిడికి వేయించినారు.

* 3-5-1997 లో ఆలయ ఈశాన్య భాగమున గొట్టపు బావిని వేయించి చేతి పంపును శ్రీ సంతోష్ కుమార్ , శ్రీ నరసింగరావు మరియు శ్రీ శర్మ గొల్లకిడికి  గారు  బిగించినారు.


* 10-12-1997 న శ్రీ యంత్రము చుట్టూ పాడైన టైల్స్ తిరిగి శ్రీ బిస పెంటయ్య గారు వేయించారు.

* 1-3-1998 లో ఆలయ ముఖ ద్వారము పై ద్వాజము ఏర్పాటు చేయించినారు.

* 15-9-1998న ఆలయ గర్భగుడి ముఖద్వారము ముందు గ్రిల్ కౌంటర్ ను శ్రీమతి గుమ్మకొండపుష్పమ్మ నాగిరెడ్డి హైదర్ గూడ పెట్టించినారు.

* 1-6-2000 న ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి బావిలోని పూడిక తీయబడినది. మరియు 15-7-2000 లో బావికి జెట్ పంపు అమర్చబడింది.

* 1-8-2000 లో ఆలయ ప్రహరీగోడ కట్టబడింది. దీనికి ఖర్చు 97000/- శ్రీ బిస పెంటయ్య గారి వద్ద అరువుగా తీసుకొనబడినది.

* తేదీ 26-7-2001 న నారాయణ, జంగమ్మ గారి పుణ్య దంపతుల సుపుత్రుడైన శ్రీ కొంగళ్ళ శ్రీశైలం సత్యమ్మ , హైదర్ గూడ గారు , నవగ్రహ మండప నిర్మాణమునకు భూమి పూజ చేసినారు.

* 25-1-2002 లో నవగ్రహ మండపం నిర్మించబడినది.

* 15-2-2002 న నవగ్రహ , నాగదేవత విగ్రహముల స్థాపితము చేయబడినవి. నవగ్రహ , నాగదేవత విగ్రహాలను శ్రీ యేండ్రా నర్సింహ హైదర్ గూడ వారు వారి స్వంత ఖర్చులతో తయారు చేయించినారు.

* 4-5-2003 న పశ్చిమదిశదీ ప్రహరీగోడ కూలిపోగా కట్టించబడినది.

* 15-9-2003 న శివాలయము ముందు ఉన్న గోడలు తీసివేసి , పాలిష్ బండలు వేయించబడినవి.



* 26-2-2004న నవగ్రహ హవన గుండం కట్టించి బండలు వేయించుట, మట్టి  పోయించుట , తూర్పు దిక్కున ఉన్న ప్రహరీగోడకు చిన్న గేటు పెట్టించుటకు రు.  24,430/- ఖర్చు కాగా సదరు  మొత్తమును శ్రీ బిస పెంటయ్య వద్ద నుండి అరువుగా తీసుకొనబడినది.

* 01-01-2004 న కాపలదారుని గది , కార్యాలయపు గది నిర్మించుటకు, శరన్నవ రాత్రులకు ఆలయమునకు సున్నము , రంగులు వేయించుటకు మరియు నవరాత్రులకైనా ఖర్చు 84,845 /-  శ్రీ బిస పెంటయ్య వద్ద నుండి అరువుగా తీసుకొనబడినది.



* 2-8-2005 నుండి 28-11-2005 వరకు ఆలయపు క్రింది భాగమున గల సత్రములకు గోడలు కట్టించుట , బండలు వేయించుట, కిటికీలు , దర్వాజలకు , మట్టి లారీలు , దిస్ మేంటల్ లారీలకు , లెవల్ చేయించుటకు , సున్నం వేయించుటకు , మొదలగు అయినా ఖర్చు అందరూ భరించిరి.

ఆలయ దర్శించే సమయం :

Morning : 6.00AM to 12.00PM

Evening : 3.00PM to 8.00PM

ఇంతటి ముఖ్యమైన ఆలయ సంచారం అందించిన ఆలయ అర్చకులు శ్రీ పవన్ శర్మ గారికి ధన్యవాదలు.

ఇతర విశేషాలు  :

విహార తీర్ధ యాత్రలు :

కార్యనిర్వహకుల ఆధ్వర్యమున విహారయాత్రలకు వెళ్ళిన స్థలములు :

1. ప్రధామముగా 1998 లో శ్రీ గండి మైసమ్మ ఆలయమునకు

2. 1999 లో శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయము , యాదాద్రి , యాదగిరిగుట్టకు

3. 26-8-2001 లో శ్రీ ఏడు పాయాల దుర్గామాత ఆలయమునకు

4. 22-09-2001 లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయమునకు

5. 2003 లో తుల్జా పూర్ శ్రీ తుల్జా భవానీ , శ్రీ పాండురంగ స్వామి ఆలయమునకు

6. 19-06-2004 న శ్రీ లలితా తపోవనం జడ్చర్ల కు

7. 16-6-2005న అలంపూర్ శక్తి పీఠమును , బెలూంగుహలు , మాగంటి పుణ్య క్షేత్రం మరియు శ్రీ బ్రహ్మము గారి మఠంనకు పోవుట జరిగినది.

8. 2019న అలంపూర్ శక్తి పీఠము, కర్నూల్ వద్ద గల శ్రీ వీరానంద స్వామి ఆశ్రమం.

ఈ దేవాలయంలో గోశాల కలదు. వాటిని చక్కటి వాతావరణంలో ఉంచి వాటికి తగిన ఆహారం సమకూర్చడం జరుగుతుంది. కానీ మనలో చాలా మందికి ఏ వర్ణము గల గోవులని దానము చేయడం వల్ల ఏ ఫలితాలు లాభిస్తాయో తెలియదు. వాటి వివరాలు ఈ క్రింద తెలుపబడినాయి.

ఆలయ ముఖ్యమైన మహిళా కార్యకర్తలు :


భిన్న భిన్న వర్ణములు గల గోవులను దానము చేయుట వాటి ఫలితములు :

1. కృష్ణ వర్ణము గల గోవును దానము చేయుట వలన స్వర్గ ప్రాప్తి కలుగును.

2. శ్వేత వర్ణ గోదానము వలన కులాభివృద్ది కలుగును.

3. రక్త వర్ణ గోదానము వలన సుందర రూపము ప్రాప్తి కలుగును.

4. పీత వర్ణ గోదానము వలన దారిద్ర్య నాశనము కలుగును.

5. నలుపు తెలుపు గో దానము వలన పుత్ర ప్రాప్తి  కలుగును.

6. నీల వర్ణము గో దానము వలన ధర్మభివృద్దికలుగును.

7. కపిల గో దానము వలన సమస్త పాపముల నుండి విముక్తి కలుగును.

గోమాత లో దేవతా స్థానములు :

గో మాత శరీరము నందు సకల దేవతలు నివాసముందురు. ఆవి మన పురాణములు ఈ విధంగా తెలియజేయుచున్నవి.



1. కొమ్ముల మూలము నందు : బ్రహ్మ విష్ణువులు ఉందూరు.
2. కొమ్ముల చివర : సర్వతీర్ధములు
3. తల మధ్య భాగమున : మహాదేవుడు
4. నుదురు నందు : గౌరి దేవి ఆవాసముండును
5. ముక్కు నందు : షణ్ముఖుడు
6. ముక్కు పుటములు : కంభలాశ్వతరుడు
7. చెవుల యందు : అశ్విని దేవతలు
8. నేత్రములు : సూర్యచంద్రులు
9. దంతములు : వాయుదేవుడు
10. నాలుకయందు : వరుణదేవుడు
11. హలంకారము : సరస్వతిదేవి
12. పెదవుల యందు : సంధ్యాధ్వయం
13. గ్రీవము యందు : ఇంద్రుడు
14. జంఘా యోర్ధం : ధర్మదేవత
15. ఖురామధ్యే : గంధర్వులు
16. ఖురాగ్రాము నందు : పన్నగములు
17. ఖురాపార్వతములందు : అప్సరసలు
18. పృష్టిము నందు : ఏకాదశ రుద్రులు
19. శ్రణితటి యందు : పితృ దేవతలు
20. కేశమూలందు సూర్యరశ్మి

ఈ ప్రాంతానికి చేరుకునే విధానం :

బస్ రూట్ : 

హైదరాబాద్ లో గల కోఠి  నుంచి  అన్నీ రోజులు ప్రతి 2 గంటలకి ఒక బస్ 94U కలదు.

సికింద్రాబాద్ లో నుంచి  అన్నీ రోజులు ప్రతి 40 నిమిషాలకి ఒక బస్ 300 బస్ కలదు.

రైలు ప్రయాణం : 

దేశంలోని అన్నీ ప్రాంతాల నుంచి మొదట సికింద్రాబాద్ కి చేరుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్ లో నుంచి  అన్నీ రోజులు ప్రతి 40 నిమిషాలకి ఒక బస్ 300 బస్ లో చేరుకొని హైదర్ గూడ నందు దిగి నడుచుకుంటూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

శ్రీ దుర్గామాత ఆలయం రాంబాగ్ చుట్టూ ప్రక్కల గల ఇతర ఆలయాల సమాచారం :

1. ప్రణవభక్త సమాజము హైదర్ గూడ .
2 వీరాంజనేయ భక్త సమాజము ఉప్పర పల్లి
3. శ్రీ రఘువీరభక్త సమాజము అత్తాపూర్ ,
4.  శ్రీ రామ భక్త సమాజము రాంబాగ్ ,
5. శ్రీ సాయి బాబా ఆలయ కమిటీ హుడా.

వీరు అందరూ ఆయా ప్రాంత కమిటీలుగా ఏర్పడి ఆ ప్రాంత ఆలయ అభివృద్ది కి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నరు.

1. శ్రీ దుర్గామాత ఆలయం , రాంబాగ్ , అత్తాపూర్ నందు కలదు.  ఈ ఆలయంలో

1. శ్రీ యంత్రం
2. ఈశ్వరాలయం
3. క్రింద నాగదేవత ఆలయం
4. నవగ్రహ మండపము , గోశాల , కోనేరు కలవు.

2. హైదర్ గూడ గ్రామంలో ప్రణవభక్త సమాజము వద్ద నున్న శ్రీ వీరంజనేయస్వామి ఆలయం.

3. శ్రీ పోచమ్మఆలయాలు  రెండు హైదర్ గూడ గ్రామలో లో కొంచం లోపల నున్నవి. ఈ ఆలయంలో దసరా మరియు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

4. హైదర్ గూడ గాంధీ విగ్రహంనాకు ఉత్తర దిశలో దుర్గమ్మ ఆలయం.

5. శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం కలదు. ఈ ఆలయంలో  శ్రీ గణపతి , శివాలయం కూడా ఉన్నవి.

6. శ్రీ గాంధీ విగ్రహమునకు దక్షిణా భాగమున శ్రీ మైసమ్మ ఆలయం కూడా కలదు.

7. శ్రీ లక్ష్మీ నగర్ లో  ఏనుగుల మైసమ్మ ఆలయము ఉన్నది.(శ్రీ శెట్టిగారి పాండయ్యా గారి పొలములో)

8. రాధ కృష్ణా నగర్ లో శ్రీ సంతోషిమాత ఆలయము.

9. ఎర్రబోడ దారిలో పుస్తకాల చౌరస్తా వద్ద బంగారు మైసమ్మ గుడి కలదు.

10. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఎర్రబోడ కొండ పై కలదు.

11. ఏనుగల మైసమ్మ అమ్మవారి ఆలయం ఎర్రబోడ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పశ్చిమ భాగమున ఉన్నది.

12. శ్రీ సీతరామ ఆలయం అత్తాపూర్ ప్రధాన రహదారి యందు కలదు.

13. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కిషన్ బాగ్ నందు కలదు.

14. కిషన్ బాగ్ నందు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది. ఈ స్వామి ఆలయం క్రింద నీరు ఎల్ల వెల్లాల ప్రవహిస్తూ ఉంటుంది.

15. శ్రీ సాయి బాబా నూతన ఆలయం హుడా కాలనీ ప్రధాన రహదారి యందు కలదు.

16. శ్రీ మల్లన్న స్వామి ఆలయం హుడా కాలనీ యందు ప్రధాన రోడ్డుకి ఎడమ పక్కన కలదు.

17. చిన్న అనంత గిరి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు.
ఈ ఆలయంలో శ్రీ గణపతి , దుర్గా దేవి , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నవి.

18. శ్రీ కాలహనుమాన్ ఆలయం Croma Shop వెనుక కలదు. ఈ ఆలయంలో పెద్ద కోనేరు , నవగ్రహ మండపం , అన్నపూర్ణ దేవి ఆలయం , నాగదేవత ఆలయం , పెద్ద శ్రీ కృష్ణా గోశాల కూడా ఉన్నవి.

19. ఉప్పర్ పల్లి ప్రాంత నందు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం చింతల్ మెంట్ లో కలదు.

20. ఉప్పర్ పల్లి ప్రధాన రోడ్డు నందు కోర్టు వద్ద శ్రీ శివాలయం కూడా ఉన్నది.


Telangana District Wise Temples



Key Words : Sri Durgamata temple, Temple Timings, Attapur Surrounding Temples, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.