Drop Down Menus

List of Visakhapatnam District Famous Temples List | Andhra Pradesh

వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం:
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.

ఇక్కడ స్వామి స్వయంభువుగావెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (మే నెలలో) వస్తుంది.

రవాణా సౌకర్యం

సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా వుంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.

దర్శన వేళలు:

* ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం

* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.

* మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం

* మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు

* సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం

* రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.

* రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం

* రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు

* మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.

భీమిలి నరసింహ స్వామి ఆలయం:
నారాయణుని దశావతారాలలో నర, మృగ మిశ్రమ రూప అవతారం ఇదొక్కటే. మన రాష్ట్రంలో నారసింహ మూలక్షేత్రాలు, 32 క్షేత్రాల పరంపరలో, చివరిదిగా విరాజిల్లుతున్న క్షేత్రం, భీమునిపట్నంలోని ప్రహ్లాద వరద శ్రీకాంత నృసింహస్వామి దివ్యసన్నిధి. లక్ష్మీనారాయణ స్వరూపంగా నృసింహుడు అలరారే ఈ దేవస్థానంతోపాటు, భీమసేన ప్రతిష్ఠిత భీమేశ్వరాలయం గూడా ఇక్కడే ఉంది.

భీమిలి నరసింహ స్వామి ఆలయం పావురాళ్ళబోడు వద్ద నరసింహస్వామి కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం కలదు. నారాయణుని దశావతారాలలో నర, మృగ మిశ్రమ రూప అవతారం ఇదొక్కటే. లక్ష్మీనారాయణ స్వరూపంగా నృసింహుడు అలరారే ఈ దేవస్థానంతోపాటు, భీమసేన ప్రతిష్ఠిత భీమేశ్వరాలయం గూడా ఇక్కడే ఉన్నది.

చేరుకొను విధానం:
భీమిలీ నుండి విశాఖకు తరచూ ఆర్.టి.సి. సిటి బస్సులు 999, 900 టి, 900 కే నడుస్తుంటాయి. 24 కి.మీ.ల పొడవున్న ఈ బీచ్ రోడ్డు భారతదేశంలోని పెద్ద బీచ్ రోడ్డులలో ఒకటిగా చెబుతారు. ద్విచక్రవాహనాల పైన కూడా విశాఖ నుండి భీమిలికి చేరు కొవచ్చు. విశాఖ నుండి తరచు అద్దె కారులు అందుబాటులోవుంటాయి.

ఉప్మాక అగ్రహారం - శ్రీ వేంకటేశ్వర స్వామి:
ఉపమాక లేదా ఉప్మాక అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం. ఈ ఊరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధిచెందినది. ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్దనుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాగున్నాడు. తన వద్దకు వచ్చి మొరపెట్టుకొన్న బ్రహ్మదేవునికి విష్ణువు హయగ్రీవ మూలమంత్రం ఉపదేశించి, గరుడాచలం వద్ద "బంధుర" అనే సరస్సు దగ్గర తపస్సు చేయమని చెప్పాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారము ధరించి సోమకుని చంపి వేదాలను తెచ్చి బంధుర సరస్సు వద్దనున్న బ్రహ్మకు ఇచ్చాడు. బ్రహ్మ తపస్సు చేసిన క్షేత్రం ఉపమాక పేరుతో ప్రసిద్ధమౌతుందని, అక్కడ ఆచరించిన పూజ, తపస్సు, దాన, పుణ్యాదిక కర్మలు ఇతోధికంగా ఫలప్రదాలవుతాయని విష్ణువు ఆనతిచ్చాడు. కశ్యపుడు కూడా ఇక్కడ తపస్సు చేసి విష్ణువు అనుగ్రహం పొందాడు. కలియుగంలో వేంకటాద్రినుండి వేట నెపంతో తాను ఈ క్షేత్రానికి వస్తానని, శ్రీలక్ష్మీ సమేతుడై తాను ఉపమాకలో గూఢంగా నివశించువాడనని విష్ణువు చెప్పాడు. గరుత్మంతుడు కూడా ఇక్కడ తపస్సు చేసి తాను పర్వతరూపంలో స్వామివారి ఆవాసంగా ఉండేలా వరం పొందాడు. ఇలా ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి అనేక గాధలున్నాయి. క్రీ.శ. 6వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతి శ్రీకృష్ణభూపాలుడు స్వామివారికి ఆలయం నిర్మించాడని కూడా స్థల గాధలలో చెబుతారు.

ఆలయం విశేషాలు, ఉత్సవాలు
ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. పాంచరాత్రాగమం ప్రకారం ఇక్కడ పూజాదికాలు జరుగుతాయి. సంతానార్ధులైనవారు ఇక్కడ స్వామిని దర్శించుకొంటే సత్సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ధనుర్మాస ఉత్సవాలు: ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెలరోజులు జరుగుతాయి.
శ్రీరామ అధ్యయన ఉత్సవాలు: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి.
కళ్యాణ మహోత్సవం: ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.

సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి.

పాడేరు మోదకొండమ్మ;
పాడేరు మోదకొండమ్మ తల్లిని మొక్కుకుంటే కోరిన కోర్కెలు కచ్చితంగా తీరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించే దేవత మోదకొండమ్మ, ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు నిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు.


ఎలా వెళ్ళాలి?: విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో పాడేరు ఉంది. విశాఖ నుంచి ప్రతి గంటకూ బస్సులు అందుబాటులో ఉంటాయి.

పవిత్ర పుణ్యధామం పంచదార్ల:
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం ధారభోగాపురం సమీపంలో వున్న పంచదార్ల పుణ్యక్షేత్రం ఐదు పుణ్యధారలతో విరాజిల్లుతుంది. ఇక్కడి రాధామాధవస్వామి ఆలయ గర్భంలో ఐదు ధారలు నిత్యం ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ఐదు ధారలలో ప్రధానమైనది ఆకాశ గంగగా పిలిచే ఆకాశధార. భక్తులు ఈ ఆకాశధార వద్ద పుణ్య పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. అనంతరం ఫణిగిరిపై వెలసిన శ్రీఉమాధర్మలింగేశ్వరస్వామిని, సహస్రలింగేశ్వరస్వామిని, రాధామాధవస్వామిని దర్శించుకుంటారు.


ఎలా వెళ్ళాలి?: విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు అచ్యుతాపురం మీదుగా ధారభోగాపురం జంక్షన్‌కు అక్కడి నుంచి ఆటోల ద్వారా లేదా కాలినడకన గాని సులువుగా పంచదార్ల పుణ్యక్షేత్రం చేరుకోవచ్చు.

బురుజుపేట - శ్రీ కనకమహాలక్ష్మి దేవాలయం:
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విలసిల్లుతున్నది. భక్తులపాలిట కల్పవల్లిగా ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవ తనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూంటారు. విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీకనక మహాలక్ష్మీ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గానీ, గోపురం గానీ ఉండదు. అంతేకాదు, అమ్మవారికి వామ హస్తం (ఎడమ చేయి) కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు.

గురువారం ప్రీతికరమైన రోజు:
అమ్మవారి సేవలకు " గురువారం " ప్రీతికరమైన రోజు. ఆ రోజు తెల్లవారినది మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి , తీర్థ, ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆరాధిస్తారు.

నిత్యపూజలు: 
ఉదయం పూజ:ఉ. 5 గం, మధ్యాహ్నం పూజ: ఉ 11.30 గం, ప్రదోష పూజ : సా. 6 గం. సర్వదర్శనం ఉ. 6 గం. నుండి 
వార్షిక ఉత్సవాలు : మార్గశిర మాసంలో నెలరోజుల పాటు జరుగుతాయి.

ఇలా చేరుకోవాలి: 
అమ్మవారి దేవస్థానానికి చేరుకోడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్‌ల నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చారిత్రాత్మక ప్రాంతం ఇది. 
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి పాత పోస్టాఫీసుకు వెళ్లే మార్గంలో ప్రతీ సిటీ బస్సు అమ్మవారి ఆలయం వద్ద నిలుస్తుంది. 
అలాగే విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. 
అలాగే రైల్వే స్టేషన్‌ నుంచి దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో కొలువైన అమ్మవారికి ఆలయం ప్రయాణం పరంగా అత్యంత సులభ తరంగా ఉంటుంది.

పురాతన క్షేత్రం పద్మనాభం:
విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం అనంతపద్మనాభస్వామి దేవాలయానికి పురాతనమైన చరిత్ర ఉంది. దీన్ని పాండవుల తల్లి కుంతీదేవి ప్రతిష్ఠించారన్న పురాణ కథ ప్రచారంలో ఉంది. కొండ దిగువన కుంతీమాధవస్వామి దేవాలయం ఉంది. పద్మనాభం ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. 1521లో ఆలయంలో కొంతభాగాన్ని పునరుద్ధరించారు.


ఎలా వెళ్ళాలి?: విశాఖపట్నం, విజయనగరం ప్రధాన రహదారిలోని ఆనందపురం జంక్షన్‌కు సుమారు 17 కి.మీ. దూరంలో పద్మనాభం ఉంది.

అనకాపల్లి - శ్రీ నూకాలమ్మ అమ్మ వారు:
"శ్రీ నూకాంబిక" అమ్మవారి దేవాలయం లేదా "శ్రీ నూకాలమ్మ" అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం, ఇది విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి వద్దగల గవరపాలెం గ్రామంలో ఉన్నది, ఇక్కడ 'శ్రీ నూకాంబిక' అమ్మవారు (శక్తి) కొలువైయున్నారు. ఈ ఆలయం విశాఖపట్నంలోని అతి ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి. ఉగాది ముందుగా వచ్చే అమావాస్య రోజున ఇక్కడ జరిగే జాతర ఉత్సవం చాల ప్రాముఖ్యమైనది, ఇది ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది, అంతే కాకుండా దీపావళి, మకర సంక్రాంతి, వినాయక చతుర్థి, శ్రీ దేవి నవరాత్రులు చాల ఘనంగా మరియు వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీ శ్రీ నూకాంబిక”  అమ్మవారి ఆలయం 1450 ఏ.డి. లో అప్పలరాజు నిర్మించారు. అప్పలరాజు స్థానిక పాలకులను ఓడించి వారి రాజ్యాలను స్వాధీనం చేసుకొని, 'ఆర్కాట్ నవాబు'కు బహుమతిగా ఇచ్చాడు. నవాబ్ తిరిగి అప్పలరాజుకు, సబ్బ వరం ప్రాంతం, అనకాపల్లి  తన ప్రధాన కార్యాలయంగా పరిపాలించాడు. అతను ఒక కోటను నిర్మించాడు మరియు దక్షిణాన తన 'కులదేవత', "కాకతాంబికా" అని పిలిచే దేవత కోసం  ఆలయం నిర్మించాడు. అప్పలరాజు మరణించిన తరువాత, విజయనగర రాజులు రాజ్యం మరియు కోటను స్వాధీనం చేసుకున్నారు. వారు ఈ దేవతని "నూకాంబిక"గా మార్చారు. స్థానికులు ఈ దేవతను "నూకలమ్మ"గా పిలుస్తున్నారు.

ఆలయ సమయాలు:
ఉదయం 06:00 గం. నుంచి మధ్యాహ్నం 12:00 గం. వరకు మధ్యాహ్నం 12:30 గం. & సాయంత్రం 4:00 గం.  వరకు  సాయంత్రం 4:30 గం..నుంచి రాత్రి8:00 గం. వరకు తెరచి ఉండును.

రవాణా:
By Road:
ఏ.పి.ఎస్.ర్.టి.సి. వారు ప్రతిరోజు తరచుగా అనకాపల్లి వెళ్లే బస్సులను ఏర్పాటు చేసియున్నారు. ఈ ఆలయం జాతీయ రహదారి నుండి 500 మీటర్ల దూరం లో ఉంది. రహదారులలో బాగా నల్లటి తారు రోడ్లు వేయబడ్డాయి మరియు ఈ పట్టణం జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున, అన్ని ప్రాంతాల నుండి తరచుగా వచ్చే బస్సులు అనకాపల్లి పట్టణానికి చేరుకోవచ్చును .

By Train:
చెన్నై-హౌరా వెళ్లే రైలు మార్గాన అనకాపల్లి రైల్వే స్టేషన్ ముఖ్యమైనది కావున అన్ని రైళ్లు ఇక్కడ ఆగుతాయి మరియు స్టేషన్ నుండి ఆలయం 1.5 కి.మీ దూరంలో ఉన్నది.

By Air:
ఈ ఆలయానికి దగ్గరగా విశాఖపట్నం జాతీయ విమానాశ్రయం 35 కి.మీ దూరంలో కలదు.

kotilingeshwara temple, visakhapatnam, kotilingeshwara temple vizag address, famous shiva temples in visakhapatnam, lord shiva temple visakhapatnam, andhra pradesh, famous temples in andhra pradesh, famous temples in india, places to visit in vizag, visakhapatnam tourist guide

               
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.