Drop Down Menus

List of Vizianagaram District Famous Temples | Andhra Pradesh

పైడితల్లి అమ్మవారి ఆలయం:
శ్రీ పైడితల్లి అమ్మవారు దేవాలయం విజయనగరం పట్టణం నందున్న ఒక ప్రాచీన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ పైడితల్లి అమ్మవారు కొలువైయున్నారు. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సిరిమాను పండుగా లేదా  సిరిమానోత్సవం (సిరిమాను ఉత్సవం) అంగరంగ వైభవంగా జరుపుతారు, చుట్టుపక్కల పట్టణాలు మరియు గ్రామాల నుండి సుమారు 2-3 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవములో పాల్గొంటారు.

పురాణాల ప్రకారం 18 వ శతాబ్దపు ఆలయం, విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం మరియు, గజపతి వంశీయుడికి చెందిన దేవత "పైడిమాంబ" మరియు ఆమె రాజా 'రామరాజు' యొక్క సోదరి. 1756 లో విజయరామరాజు,  బొబ్బిలి  రాజుతో నిరంతర యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. 1757 జనవరి 23న బొబ్బిలిఫై దాడి చేయడానికి, విజయరామరాజుకి ఫ్రెంచ్ సైన్యాధిపతి జనరల్ డి.బుస్సి సహాయపడ్డాడు. బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి కోట దాదాపు పడగొట్టబడి, యుద్ధంలో అనేక మంది బొబ్బిలి  సైనికులు మరణించారు. రాజా విజయరామరాజు భార్య మరియు పైడిమాంబ (చెల్లెలు) మసూచి ఆనారోగ్యంతో బాధపడుతున్నారని, తెలియచెప్పి యుద్ధానికి దూరంగా ఉండటానికి విజయరామరాజును ఒప్పించ ప్రయత్నించారు.

ఉదయం 06:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు.
సాయంత్రం 1:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు తెరచి ఉండును

రవాణా :
By Road:
విజయనగరం పట్టణం నుండి 64 కిలోమీటర్ల దూరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయము ఉంది. ఏ.పి.ఎస్.ర్.టి.సి. వారు క్షేత్రానికి తరచుగా ఉండే విధంగా బస్సులను ఏర్పాటు చేశారు.

By Train:
ఈ ఆలయానికి సమీపంలో విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది.

By Air:
ఈ ఆలయానికి సమీపంలో విశాఖపట్నం విమానాశ్రయం ఉంది.

రామతీర్థం:
శ్రీ రామస్వామి వారి దేవస్థానం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలో రామతీర్థం గ్రామంలోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీరాముడు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు. ఇది ఉత్తరాంధ్ర భద్రాద్రిగా ప్రశస్తి పొందింది. ఇది విజయనగరం నకు ఈశాన్యంగా 12 కి.మీ దూరంలో ఉంది. శ్రీ రామచంద్రస్వామి కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం, సుందర ప్రకృతి లోగిలిలో అలరారుతోంది. చంపావతీ నదీసమీపాన నెలకొన్న ఈ ధామం నీలాచలం అను కొండను ఆనుకుని విరాజిల్లుతోంది. నీటిలో లభించటంవలన ఈ క్షేత్రానికి రామతీర్థం అని పేరొచ్చిందని కథనం. అతి ప్రాచీనమైన ఈ ఆలయం మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ క్రీ.శ. 469-496 మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఈ శాసనం వేసినట్లు, చరిత్ర కథనం

పురాణాల ప్రకారం శ్రీరామలక్ష్మణులు, సీతాదేవి వనవాసం సందర్భంగా రామతీర్థాన్ని సందర్శించారని, వారు కొండపై ఉన్నప్పుడు సీతకు దాహం వేయగా శ్రీరాముడు బాణం వేసి పాతాళగంగను కొండపైకి తెప్పించాడని, అప్పటి నుండి ఇప్పటికీ ఆ కొలనులో నీరు లభిస్తున్నదని, వేసవిలో కూడా ఏనాడు కొలనులో నీరు ఇంకిపోలేదని ఆలయవర్గాలు చెబుతున్నాయి. పాండవులు కూడా తమ వనవాసం సందర్భంగా రామతీర్థంలో కొంతకాలం గడిపారని ఐతిహ్యం.

 ఆలయ దర్శన సమయాలు : 5.00 AM and 8.00 PM.

ఎలావెళ్ళాలి?: నెల్లిమర్ల మండల కేంద్రం నుంచి అయిదు కి.మీ. దూరంలో రామతీర్థం ఉంది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి చీపురుపల్లి రోడ్డులో దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో నెల్లిమర్ల ఉంది.


పుణ్యగిరి శివక్షేత్రం:
శృంగవరపుకోట పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంలో పుణ్యగిరి శివ క్షేత్రం వుంది. మార్గంలో మొదట ధారగంగమ్మ లోయ, జలపాతాలు కనిపిస్తాయి. ఈ లోయలో వున్న అమ్మవారిని గిరిజన దేవతగా పూజిస్తారు. తరువాత కోటి లింగాల రేవులో ఉన్న శివలింగాల మీద పైనుంచీ నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తరువాత పుట్టధార వస్తుంది. ఈ ధార నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాల్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. కొండల మధ్య శ్రీఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయం అత్యంత మనోహరంగా వుంటుంది.

ఎలా వెళ్ళాలి?: విజయనగరం నుంచి ధర్మవరం మార్గంలో 30 కి.మీ., తాటిపూడి, జామి మార్గాల్లో 35 కి.మీ. దూరంలో శృంగవరపుకోట వుంది.

బొబ్బిలి వేణుగోపాలుడు
బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం బొబ్బిలి కోట సమీపంలో ఉంది. పురాతనమైన ఈ ఆలయంలో రుక్మిణీ, సత్యభామా సమేతుడిగా వేణుగోపాలుడు దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం స్వామి వసంతోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.

ఎలా వెళ్ళాలి?: విజయనగరం జిల్లా కేంద్రానికి సుమారు అరవై కి.మీ. దూరంలో బొబ్బిలి ఉంది.

 తోటపల్లి శ్రీ వెంకటేశ్వరుడు:
రెండవ తిరుపతిగా పేరు పొందిన ఆధ్యాత్మిక స్థలం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పక్కనే ప్రవహిస్తున్న నాగావళి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. సమీపంలో ఉన్న తోటపల్లి జలాశయాన్ని వీక్షించి ఆహ్లాదాన్ని పొందుతుంటారు. తోటపల్లిని ఆధ్యాత్మిక కేంద్రంగా రూ. రెండు కోట్లతో పర్యాటక శాఖ అభివృద్ధి చేసింది.

రామనారాయణం
విజయనగరం జిల్లా కేంద్రానికి అయిదు కిలో మీటర్ల దూరంలో రామనారాయణం ఉంది. పైనుంచి చూస్తే విల్లు ఆకారంలో కనిపించే ఈ ఆలయంలో శ్రీరామ కథను వివరించే చిత్రాలు, 60 అడుగుల ఆంజనేయ విగ్రహం ప్రత్యేక ఆకర్షణలు.

famous temples in vizianagaram district, temples in vizianagaram district andhra pradesh, haunted places in vizianagaram, bobbili tourist places, vizianagaram ramanarayanam temple images, ramanarayanam temple - vizianagaram wikipedia in telugu, govindapuram temple vizianagaram, vizianagaram ramathirtham temple

               
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Looking for right solution for your problems? Sai Baba Answers to get precise information for your problems. Tamil Typing offer great answers for all your questions. Sai Baba Live Darshan

    ReplyDelete

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.