ఆరుపడైవీడు క్షేత్రం పళముదిర్చోళై | Pazhamudircholai Temple Information History Timings


ఆరుపడైవీడు క్షేత్రాలలో పళముదిర్చోళై క్షేత్రం మూడవదిగా చెబుతారు. ఈ క్షేత్రం మధురై నుంచి 19 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ క్షేత్రం కొండపైన ఉంటుంది కొండ క్రింద 108 వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన అళగర్ కోయిల్ ఉంటుంది. మనం ముందుగా ఈ క్షేత్రం దర్శించుకుని కొండపైకి వెళ్తాము . కొండపైకి వెళ్ళడానికి దేవాలయం వారి బస్సు ఉంటుంది.  ఈ క్షేత్రం లోనే స్వామి వారు చిన్న తనం లో ఆడుకొనేవారని చెబుతారు. 

స్థలపురాణం : 
ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు చిన్నతనంలో ఆడుకొనే వారని చెప్తారు. ఇక్కడే వల్లీ మాత కూడా ఉండేదని చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తులలో ఒకరైన అవ్వయ్యార్ ని సుబ్రహ్మణ్యుడు పరీక్షించిన స్థలం ఈ క్షేత్రం. తమిళనాట అవ్వయ్యార్ అని ఒక తల్లి ఉండేది. ఒకనాడు ఆమె చాలా దూరం ప్రయాణించి అలసి పోయింది. బాగా ఎండగా ఉండడం వలన, నీడ కోసం ఒక పళ్ళ చెట్టు క్రిందకి వచ్చింది. ఆమె అప్పటికే చాలా ఆకలి, దప్పికలతో ఉంది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిల్లవాడు అవ్వయ్యార్ ని చూసి పళ్ళు కావాలా అని అడుగుతాడు. ఆమె కావాలి అనగానే, ఆ పిల్ల వాడు “నీకు వేయించిన పళ్ళు కావాలా, లేక వేయించకుండా కావాలా?” అని అడుగుతాడు. ఇతనెవరో మరీ తెలియని వాడిలా ఉన్నాడు, పళ్ళు వేయించినవి కావాలా అంటాడేమిటి అనుకొని, పిల్లాడితో మాట్లాడే ఓపిక లేక, వేయించిన పళ్ళు ఇమ్మంటుంది అవ్వయ్యార్. వెంటనే ఆ పిల్లవాడు చెట్టును బలంగా కుదిపితే కొన్ని పళ్ళు క్రింద మట్టిలో పడతాయి. అవి తీసి ఆమె మట్టి దులపడం కోసం నోటితో ఊదుతూ ఉంటే అవి నిజంగా వేడిగా, వేయించినట్లు భావం కలుగుతుంది ఆమెకు. అప్పుడు వాటిని ఊదుకుంటూ (మట్టి తొలగడానికి) పళ్ళను తింటుంది. ఈ లీల చేసినది మామూలు పిల్లవాడు కాదు, ఎవరో మహాత్ముడు నాకు పాఠం చెప్పడానికే ఈ లీల చేశాడు అని అనుకుని పైకి చూడగానే, ఆ పిల్లవాడు మాయమై సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అవుతారు. ఆమె జ్ఞాన భిక్ష పెట్టమని స్వామిని ప్రార్థిస్తుంది.

కొండపైన : 
స్వామి వారి దర్శనం అయ్యాక కొండపైన అమ్మవారి క్షేత్రం ఉంటుంది. కొండపైన చాల కోతులు ఉంటాయి.ఇక్కడో విశేషం ఏమిటంటే కొండపైన పారే నీళ్లను మాత్రమే స్వామి వారి అభిషేకానికి వాడతారు . చాలామంది భక్తులు ఆ నీళ్లను డబ్బాలలో పట్టుకుని ఇంటికి తీస్కుని వెళ్తుంటారు . 

పళముదిర్చోళై  నుంచి మదురై వెళ్ళడానికి లోకల్ బస్సు లు ఉంటాయి.  మధురై వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ బస్సు పాస్ తీసుకుంటే మనం పళముదిర్చోళై  మరియు తిరుపరకుండ్రం చూసిరావచ్చు . పాస్ రోజంతా పనిచేస్తుంది. మదురై నుంచి ముందుగా పళముదిర్చోళై  వెళ్లి తిరిగి బస్సు స్టాండ్ కి వచ్చి తిరుపరకుండ్రం వెళ్లే బస్సు ఎక్కాలి. 

ఆరుపడైవీడు క్షేత్రాలపై క్లిక్ చేసి ఆ క్షేత్రాల గురించి తెలుసుకోండి : 
1 . పళని 
2. తిరుత్తణి
3. స్వామిమలై
4. పళముదిర్చోళై 
5. తిరుప్పరంకుండ్రం
6. తిరుచెందూర్

keywords : 
arupadaiveedu , swamymalai , palani , tiruttani , tiruchendur, palamudircholai , murugan temples, subrahmanya swamy temples, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS