పంచారామ క్షేత్రాలు పంచభూత లింగ క్షేత్రాలు ఎలా ఉన్నాయో తమిళనాట సుబ్రహ్మణ్య స్వామికి ఆరుపడైవీడు అనే క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలన్నీ తమిళనాడులోనే ఉండటం చేత మన తెలుగు వారికి పరిచయం తక్కువ, మనవాళ్ళు పళని వెళ్తుంటారు కదా ఆ పళని క్షేత్రం ఈ ఆరుపడైవీడు క్షేత్రం లోనేదే. ఆ ఆరు క్షేత్రాలు వరసగా 1. తిరుపరంకుండ్రం, 2. తిరుచెందూర్ , 3 పళని, 4. స్వామిమలై, 5. తిరుత్తణి, 6. పజముదిర్చోలై.
సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధ ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటైన తిరుప్పరంకుండ్రం గురించి తెలుసుకుందాం . ఈ ఆలయం మదురై నుంచి 8 కిమీ దూరం లో ఉంది. ఆరుపడైవీడు క్షేత్రాలలో ఈ క్షేత్రం లో మాత్రమే సుబ్రహ్మణ్యుడు కూర్చుని దర్శనం ఇస్తాడు. ఈ క్షేత్రం కొండను తొలచి నిర్మించినట్టు మనకు కనిపిస్తుంది. ఈ క్షేత్రం లో శిల్ప సౌందర్యం భక్తులను ఆకట్టుకొంటోంది. కొత్తగా వెళ్లేవారికి ప్రధాన దైవం ఎక్కడున్నారో తెలుసుకోవడం కాస్త కష్టమే. ఈ క్షేత్రం లోనే ఇంద్రుని కుమార్తె దేవసేనతో ( దేవయాని ) తో సుబ్రహ్మణ్యుడికి కళ్యాణం జరుగుతుంది. మనం కొండపైకి స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతలు అందరు కనిపిస్తారు. ఈ ఆలయం లో స్వామి వారికీ అభిషేకం చేయరు స్వామి వారి యొక్క శూలానికి మాత్రమే అభిషేకాలు చేస్తారు.
ఈ క్షేత్రం చేరుకోవడానికి మదురై నుంచి లోకల్ బస్సు లు ఉంటాయి. మదురై దగ్గరలో పళముదిర్చోళై అనే మరొక ఆరుపడైవీడు క్షేత్రం ఉంటుంది . చాలామంది మదురై వెళ్ళినకూడా ఈ క్షేత్రాలను చూడకుండానే వచ్చేస్తుంటారు.
ఆరుపడైవీడు క్షేత్రాలపై క్లిక్ చేసి ఆ క్షేత్రాల గురించి తెలుసుకోండి :
1 . పళని
2. తిరుత్తణి
3. స్వామిమలై
4. పళముదిర్చోళై
5. తిరుప్పరంకుండ్రం
6. తిరుచెందూర్
keywords :
Thiruparankundram, thiruparankundram temple timings on sunday
madurai to thiruparankundram temple distance,tiruchendur,pazhamudircholai murugan temple,swamimalai,thiruparankundram murugan dharisanam,thiruparankundram girivalam,six abodes of murugan