శ్రీ ఐరావతేశ్వర దేవాలయం | Shri Airavatesvara Temple Darasuram Tamil Nadu


శ్రీ ఐరావతేశ్వర దేవాలయం తమిళనాడు లో ప్రసిద్ధ శివాలయం . ఈ ఆలయాన్ని  12వ శతాబ్దం లో రాజరాజ చోళుడు II నిర్మించాడు.  తమిళనాడు లో యునెస్కో వారు గుర్తించిన వాటిలో శ్రీ ఐరావతేశ్వర దేవాలయం ఒకటి. ఈ ఆలయం కుంభకోణానికి 4 కిమీ దూరం లో కలదు . ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం  ద్రావిడ నిర్మాణ శైలి కలిగుంది . 

ఆలయ స్థలపురాణం ప్రకారం :
ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. .

పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును "యమ తీర్థం" అని పిలుస్తారు.

మెట్లను తాకితే సప్త స్వరాలు : 
అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో "బలిపీఠం" ఉంది. దాని పీఠములో చిన్న గణేషుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో మూడు అందముగా చెక్కబదిన మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను తాకినపుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్డం వినబడుతుంది. 
Keywords : 
Airavatesvara Temple, Airavateshwar temple tamil nadu, airavateswar temple route, airavateswara temple information in telugu. 

Comments