తిరుమల సీనియర్ సిటిజెన్ దర్శనం రూల్స్ | Tirumala Senior Citizen Darshan Rules Updates | Hindu Temples Guide
తిరుమల తిరుపతి దేవస్థానం వారు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఆ దర్శనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం .
తిరుమల తిరుపతి దేవస్థానం వారు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఆ దర్శనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం .
Tirumala Senior Citizen Darshan Rules Video
సీనియర్ సిటిజెన్ వయస్సు ఎంత ఉండాలి ?
చాల యూట్యూబ్ ఛానల్ లో 60 సంవత్సరాలని ప్రచారం చేస్తున్నారు అది నిజం కాదు. దేవస్థానం వారు ప్రత్యేక దర్శనానికి 65 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించారు.
దర్శనం ఏ సమయం లో ఉంటుంది ?
ప్రస్తుతం దర్శనం మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తున్నారు. 1:30 pm కు లైన్ లోకి వెళ్ళాలి .
దర్శనం టికెట్స్ కొండపైన ఇస్తున్నారా ?
దర్శనం టికెట్స్ ఇప్పుడు కొండపైన ఇవ్వడం లేదు. ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలి .
ఎన్ని రోజులు ముందుగా బుక్ చేసుకోవాలి ?
మూడు నెలల ముందుగా బుక్ చేసుకోవాలి . ప్రతి నెల 22వ తేదీ లేదా 23న విడుదల చేస్తున్నారు. ప్రతి నెల ముందుగానే హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ లో తెలియచేస్తాము.
టికెట్ బుకింగ్ కు ఏమి కావాలి ?
మీ ఆధార్ కార్డు మరియు మీతో పాటు వచ్చేవారి ఆధార్ కార్డు ఉండాలి . మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
టికెట్ ధర ఎంత ?
ఇది ఉచిత దర్శనం. డబ్బులు అవసరం లేదు
సీనియర్ సిటిజెన్ తో పాటు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లవచ్చా ?
ప్రస్తుత రూల్స్ ప్రకారం భార్య భర్తలకు మాత్రమే అవకాశం కల్పించారు. భార్య వయస్సు కనీసం 50 సంవత్సరాలు ఉండాలి . మ్యారేజ్ సర్టిఫికెట్ అడగడం లేదు కాబట్టి చాలామంది 50 దాటినా వారిని తోడుగా తీసుకుని వెళ్తున్నారు.
టికెట్ బుక్ చేసుకుని సమయం లో వరసగా రెండు రోజులు సీనియర్ సిటిజెన్ దర్శనం బుక్ చేసుకోవచ్చా ?
ఈ విధంగా బుక్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో టీటీడీ వారు 90 రోజులు వ్యవధి ఉండాలని నిబంధన పెట్టారు.
90 రోజులు గ్యాప్ బుకింగ్ చేసుకున్న తేదీ నుంచా లేదా దర్శనం నుంచా ?
మీరు దర్శనం చేసుకున్న తేదీ నుంచి 90 రోజులు వ్యవధి ఉండాలి.
సీనియర్ సిటిజెన్ దర్శనం చేసుకున్న రోజు కానీ లేదా మరుసటి రోజు కానీ వేరే దర్శనం చేసుకోవచ్చా ?
చేసుకోవచ్చు . మీరు సీనియర్ సిటిజెన్ కోట దర్శనం తప్ప మిగిలినవి అన్ని చేసుకోవచ్చు .
మీకు ఇంకా ఏదైనా అదనపు సమాచారం కావాలంటే 8247325819 కు మెసేజ్ చేయండి.
మీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala senior citizen darshan rules, tirumala darshan rules, tirumala updates, hindu temples guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
వికలాంగుల కోటాలో వెళ్లే వారికి తోడుగా భర్త లేదా భార్య కాకుండా వారి కొడుకునో కూతురినో తోడు తీసుకు వెలవొచ్చా చెప్పగలరు
ReplyDelete