Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

భారతదేశంలో నమ్మశక్యం కాని 6 హిందూ దేవాలయాలు | 6 Most Amazing Temples in India

భారతదేశంలో నమ్మశక్యం కాని 6 హిందూ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?

భారతదేశంలో ఎన్నో ఆశ్చర్యపరిచే హిందూ దేవాలయాలు ఉన్నాయి. నమ్మలేని నిజాలతో కూడుకుని ఉన్న ఈ ఆలయాలను సందర్శించడం ఓ ప్రత్యేకమైన అనుభూతి.

భారతదేశం వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం. చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగునా అనేక దేవాలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉండడం విశేషం. సైన్స్ కు కూడా అంతుచిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవడం, ఆ ప్రదేశాలకు పర్యటించడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికర కధ ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికీ పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అటువంటి 6 హిందూ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. సంగీతాన్ని వినిపించే మెట్లు:
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో 'ఐరావతేశ్వర ఆలయం' ఉంటుంది. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు. ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపజేసే రాతి మెట్లు ఉన్నాయి. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిఘూడ రహస్యం. పరమ శివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్ధంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే ఏడు రకాల శబ్ధాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు స్వరాలను వినవచ్చు.

ఐరావతేశ్వర ఆలయం తమిళనాడు లోని దరాసురం అనే గ్రామీణ పట్టణంలో కలదు. దరాసురం ప్రముఖపట్టణమైన తంజావూరు కు 60 కి. మీ ల దూరంలో, చెన్నై మహానగరానికి 286 కిలోమీటర్ల దూరంలో మరియు మధురై పట్టణానికి 228 కిలోమీటర్ల దూరంలో కలదు. దరాసురం కు గల మరోపేరు రాజరాజపురం.
2. స-రి-గ-మ సంగీత స్తంభాలు:
కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం ఉంది. శిధిలమైన విట్టల బజార్ కు చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపిలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు. 15వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయంలో రంగ మండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటినే స-రి-గ-మ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డో-రె-మి-స సంగీత స్వరాలు వినిపిస్తాయి.

3. వేలాడే స్తంభం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వీరభద్ర దేవాలయం ఉంది. దీనినే లేపాక్షి ఆలయం అని కూడా అంటారు. అద్భుతమైన నిర్మాణ కళతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ పరిసరాల్లో ఉండే 70 స్తంభాలలో ఒకటి మాత్రం ఆశ్చర్యంగా గాలిలో ఉంటుంది. వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు. ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా వేలాడుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది.
ఎంతో మంది ఇంజనీర్లు ఈ మిస్టరీని చేధించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆలయం మొత్తం దేవతా ప్రతిమలు, నాట్యకారులు, సంగీతకారుల విగ్రహాలతో చెక్కబడి ఉంటుంది. ఈ ఆలయంలో అతి పెద్ద వీరభద్రుని విగ్రహం ఉంటుంది. 1583లో విరూపన్న, వీరన్న అనే సోదరులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంకు మరో చరిత్ర కూడా ఉంది. రావణుని చేతిలో గాయపడిన జటాయువు అనే పక్షి ఈ ప్రాంతంలోనే పడిందట. రాముడు ఆ పక్షిని చూసి ‘లే పక్షి’ అని పిలిచాడట. అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు స్థిరపడిందని కథనం.

లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది.
4. గ్రానైట్ దేవాలయం:
తంజావూర్ బృహదేశ్వర ఆలయానికో విశిష్టత ఉంది. సుమారు వెయ్యేళ్ల చరిత్రతో ఈ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్ప కళతో అలరారే ఆలయం 'బృహదీశ్వర దేవాలయం'. పంచంలోనే మొదటిసారిగా పూర్తి స్థాయి గ్రానైట్‌ తో నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయంలో చాలా భాగం గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది. అయితే దీనికి 60 కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడ కూడా గ్రానైట్ నిక్షేపాలు లేకపోవడం విశేషం. ఈ ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు. ఒకవేళ సుదూర ప్రాంతాల్లో గ్రానైట్ నిల్వలు ఉన్నా ఏక శిలా రాతిని తరలించడం మాత్రం అసాధ్యం. ఈ ఆలయం నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు.

బృహదేశ్వరాలయంలో మనకు తెలియని ఒక ప్రత్యేక ఉంది అది ఏమిటంటే- గోధూళి వేళ ఈ ఆలయ ‘ఛాయలు' కనిపించవు. సంవత్సరం పొడవునా.. ఏ రోజూ సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం. శాస్త్ర పరిశోధకులు.. పురాతత్వ శాస్తజ్ఞ్రులు ఏ రీతిన చూసినా.. ఇప్పటికీ వీడని మిస్టరీ గానే మిగిలింది.
తంజావూర్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఒక ప్రధాన రైల్వే జంక్షన్ గా తీర్చిదిద్దబడినది. ఇక్కడికి నిత్యం రైళ్లు పరుగెడుతూనే ఉంటాయి. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.
5. 22 బిలియన్ డాలర్ల ఖజానా గల ఆలయం:
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో 7 రహస్య ఖజానాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు అభ్యర్ధన మేరకు ఈ ఆలయంలోని 6 రహస్య ఖజానాలను తెరిచి ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంతపద్మ నాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద.
 వాటి విలువ సుమారు 22 బిలియన్ డాలర్లుగా తేలింది. 7వ ఖజానా ఇనుప ద్వారాలతో రెండు కోబ్రా నాగుల ప్రతిమలతో తెరిచేందుకు వీలు లేకుండా ఉంది. అయితే ఇది కొన్ని రహస్య మంత్రాల ద్వారా మాత్రమే తెరువబడుతుందని, కాదని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఉపద్రవం తప్పదనే నమ్మకం ఉంది. అనంతమై సంపద బయటపడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచబడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది.

తిరువనంతపురం కేరళ రాష్ట్ర రాజధాని. తిరువనంతపురంను త్రివేండ్రం అని కూడా అంటారు. చెన్నై-తిరువనంతపురం రైలు మార్గము. తిరువనంతపురము సెంట్రల్ స్టేషన్ నుండి 1 కి.మీ.
6. పూరీ ఆలయంపై గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా:
హిందూ భక్తులకు పూరీ జగన్నాధస్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనది. భారతదేశంలోని ఛార్ థామాలలో పూరీ ఒకటి. ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన జెండా చాలా ఆశ్చర్యకరంగా వుంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు వుంటే అటువైపే వీస్తూ వుంటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా జెండా రెపరెపలాడుతూ వుంటుంది. ప్రతి రోజూ ఓ పూజారి 45 అంతస్తులు గల ఈ ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తుంటాడు. సుమారు 1800 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది.
ఈ జెండాను ఏ రోజైనా మార్చని యెడల ఆలయాన్ని 18 రోజుల పాటు మూసివేస్తారు.ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది.
Related Temples:పూరీ ఆలయం, జెండా, తిరువనంతపురం, అనంత పద్మనాభస్వామి దేవాలయం, కేరళ, తంజావూర్, బృహదీశ్వర దేవాలయం, లేపాక్షి వేలాడే స్తంభం, శ్రీ విజయ విట్టల దేవాలయం, హంపి, ఐరావతేశ్వర ఆలయం, సంగీతాన్ని వినిపించే మెట్లు, Airavatesvara Temple, Brihadisvara Temple, Thanjavur, lepakshi stambham temple, Padmanabhaswamy Temple, anantha padmanabha, Shri Jagannath Temple, Puri,  Amazing Temples in India.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు