కొలని దోపరికి గొబ్బిల్లో యదు | Annamayya Keerthanalu


కొలని దోపరికి గొబ్బిల్లో యదు |
కుల స్వామికిని గొబ్బిల్లో ||

కొండ గొడుగుగా గోవుల గాచిన |
కొండొక శిశువునకు గొబ్బిల్లో |
దండగంపు దైత్యుల కెల్లను తల |
గుండు గండనికి గొబ్బిల్లో ||

పాప విధుల శిశుపాలుని తిట్టుల |
కోపగానికిని గొబ్బిల్లో |
యేపున కంసుని యిడుమల బెట్టిన |
గోప బాలునికి గొబ్బిల్లో ||

దండివైరులను తరిమిన దనుజుల |
గుండె దిగులునకు గొబ్బిల్లో |
వెండిపైడి యగు వేంకట గిరిపై |
కొండలయ్యకును గొబ్బిల్లో ||

More Annamayya Keerthanas Click Here Below Link:
అన్నమయ్య కీర్తనలు 
annamayya rachanalu in telugu, annamayya keerthanalu book pdf, tallapaka annamacharya sankeerthanalu, annamayya wikipedia, annamayya krutulu, annamayya jeevitha charitra, annamayya keerthana telugu songs, annamayya srungara keerthanalu, annamayyacharya keerthanalu telugu poems, annamacharya keerhanalu, అన్నమయ్య కీర్తనలు 

Comments