Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhagavad Gita 11th Chapter 12-22 Slokas and Meaning in Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 12-22 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత ఏకాదశోఽధ్యాయః
అథ ఏకాదశోఽధ్యాయః |



దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |

యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః ‖ 12 ‖

భావం : ఏకకాలంలో ఆకాశంలో వేలమంది సూర్యులు వెలుబడిన కలిగే కాంతి ఆ మహత్ముడి విశ్వరూపతేజస్సుకు సాటికావచ్చు. 


తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా |

అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా ‖ 13 ‖
భావం : అప్పుడు అర్జునుడు దేవదేవుడి దేహంలో ఒకేచోట ఎన్నో విధాలుగా విభజించబడివున్న సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు.


తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః |

ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ‖ 14 ‖

భావం : అనంతరం అర్జునుడు ఆశ్చర్యచకితుడై శరీరంలో పులకరించగా భగవంతుడికి తలవంచి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు. 

అర్జున ఉవాచ |

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్|

బ్రహ్మాణమీశం కమలాసనస్థమృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ‖ 15 ‖
భావం : అర్జునుడు : దేవా! నీ దేహంలో సమస్త దేవతాలూ, చరాచరజగత్తునూ కమలాసనంలో వున్న బ్రహ్మనూ, సర్వఋషులనూ, దివ్యసర్పాలను చూస్తున్నాడు.



అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోఽనంతరూపమ్|

నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ‖ 16 ‖
భావం : విశ్వేశ్వరా! విశ్వరూప! అనేక భుజాలు, కడుపులు,ముఖాలు, కళ్ళు కలిగిన నీ అనంతరూపాన్ని అంతటా చూస్తున్నాను. నీ తుదీ, మొదలు, మధ్య మాత్రం నాకు కానరావడం లేదు. 


కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్|

పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ ‖ 17 ‖
భావం : కిరీటం, గదా, చక్రం ధరించి దశదిశలా కాంతి పుంజం లాగ వెలుగొందుతూ, చూడడానికి సాధ్యపడకుండా సూర్యగ్ని కాంతికి సమానంగా ప్రజ్వలిస్తూన్న అంతూ దరీ లేని నిన్ను అంతటా చూస్తున్నాను.


త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|

త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే ‖ 18 ‖
భావం : నీవు తెలుసుకోదగ్గ పరబ్రహ్మవనీ, సమస్త జగత్తుకి మూలాధారమైన వాడవనీ, నాశనం లేనివాడవనీ, సనాతన ధర్మ సంరక్షకుడవనీ, పురాణపురుషుడవనీ నేను భావిస్తున్నాను.


అనాదిమధ్యాంతమనంతవీర్యమనంతబాహుం శశిసూర్యనేత్రమ్|

పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్ ‖ 19 ‖
భావం : ఆదిమధ్యంతాలు లేనివాడవు, అపరిమితమైన సామర్ధ్యం కలవాడవు. ఎన్నో చేతులు కలవాడవు, చంద్ర సూర్యులు కన్నులుగా కలవాడవు, ప్రజ్వలిస్తూన్న అగ్ని లాంటి ముఖం కలవాడవు. నీ తేజస్సుతో ఈ జగత్తు నంతటిని తపించేస్తున్నవాడవు అయిన నీవు నాకు సాక్షాత్కారిస్తున్నావు.

ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|

దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ‖ 20 ‖
భావం : మహాత్మా భూమికి ఆకాశానికి మధ్యవున్న ఈ ప్రదేశంలో దిశదశలూ నీతో నిండి వున్నాయి. అధ్బుతం, అతి భయంకరం అయిన నీ ఈ విశ్వరూపం చూసి మూడు లోకలూ గడగడ వణుకుతున్నాయి.

అమీ హి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి|

స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ‖ 21 ‖
భావం : ఈ దేవతా సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొంత మంది భీతిలో చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధుల సమూహాలు, మంగళ వాక్యాలు పలికి సంపూర్ణ స్తోత్రాలతో నిన్ను పొగతున్నారు.

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|
గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ‖ 22 ‖
భావం : రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు విశ్వే దేవతలు, అశ్విని దేవతలు, మారుత్తులు, పితృదేవతలు, గంధర్వయక్షసిద్ది అసురసంఘలు - వీళ్ళంతా నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు.   

11వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 11th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు