Drop Down Menus

Bhagavad Gita 11th Chapter 23-33 Slokas and Meaning in Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 23-33 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత ఏకాదశోఽధ్యాయః

అథ ఏకాదశోఽధ్యాయః |

రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్|

బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ‖ 23 ‖


భావం : మహాబాహూ ! ఎన్నో ముఖాలు, కళ్ళు, చేతులు, తోడలు, పాదాలు, కడుపులు, కోరలతో, భయంకరంగా వున్న నీరూపం చూసి లోకులంతా ఎంతో భయపడుతున్నారు. అలాగే నేనూ భయపడుతున్నను. 


నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో ‖ 24 ‖
భావం : ఆకాశనీ అంటుతూ, అనేక రంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను.


దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసంనిభాని|

దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ‖ 25 ‖
భావం : కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగ కనవస్తున నీ ముఖాలు నాకు దిక్కు తోచకుండా చేశాయి. దేవేశా! జగన్ని వసా దిగులుపడి వున్న నన్ను అనుగ్రహించు. 

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః|

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః ‖ 26 ‖
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని|

కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ‖ 27 ‖
భావం : ఎంతోమంది రాజులతోపాటు ఈ దృతరాష్ట్రుడి పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అలాగే మనపక్షానికి చెందిన ప్రముఖయోధులూ వాడి కొరలతో భయంకరాలైన నీ నీళ్ళోలోకి వడివడిగా ప్రవేశితున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ల సందులో ఇరుకుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు. 


యథా నదీనాం బహవోఽంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి|

తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ‖ 28 ‖
భావం : అనేక నది ప్రవాహాలు సముద్రంవైపు పరుగెడుతున్నట్లే ఈ నరలోక వీరులంతా ప్రజ్వలిస్తూన్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు.

యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః|

తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ‖ 29 ‖
భావం : చావు కోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే నశించడం కోసం మహావేగంగా నీ నోళ్ళలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు. 

లేలిహ్యసే గ్రసమానః సమంతాల్లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః|

తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ‖ 30 ‖
భావం : విష్ణుమూర్తీ! మండుతున్న నీ నోళ్ళతో ఈ సర్వ లోకాలను మింగుతూ రుచి చూస్తున్నావు. జగత్తునంతటిని నీ తేజస్సు తో నింపి తీవ్రమైన కాంతితో దాన్ని తపింపచేస్తున్నావు.

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోఽస్తు తే దేవవర ప్రసీద|

విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ‖ 31 ‖
భావం : దేవదేవ ఉగ్రరూపంలో వున్న నీ వెవరవో చెప్పు. నీకు నమస్కారం. నన్ను అనుగ్రహించు. ఆది పురుషుడైన నిన్ను గురించి తెలుసుకోదలచాను. నీ ప్రవృత్తి నాకు అర్ధం కావడం లేదు.
శ్రీభగవానువాచ |

కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|

ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ‖ 32 ‖
భావం : శ్రీ భగవానుడు: ఈ లోకసంహారానికి విజృంభించిన కాలస్వరూపుణ్ణి నేను ప్రస్తుతం ఈ ప్రపంచంలో ప్రజలను సంహరించడమే నా సంకల్పం. నీవు యుద్దం చేయకపోయినా శత్రుసైన్యంలోని వీరులంతా వినాశనం పొందడం ఖాయం.

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్|

మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ‖ 33 ‖
భావం : సవ్యసాచీ! అందువల్ల నీవు యుద్దానికి సిద్దమై పేరు ప్రఖ్యాతలు పొందు. శత్రువులను జయించిన సమవృద్దమైన రాజ్యాన్ని అనుభవించు వీళ్ళందరిని ముందే నేనే చంపేశాను. నీవు నిమిత మాత్రంగా  నిలబడు. 


11వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 11th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.