Bhagavad Gita 13th Chapter 13-23 Slokas and Meaning in Telugu | భగవద్గీత 13వ అధ్యాయం 13-23 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత త్రయోదశోఽధ్యాయః
అథ త్రయోదశోఽధ్యాయః |

జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వామృతమశ్నుతే |
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ‖ 13 ‖


భావం : ఏది తెలుసుకోదగ్గదో, దేనిని తెలుసుకుంటే మానవుడు మోక్షం పొందుతాడో, అనాది అయిన ఆ పరబ్రహ్మన్ని గురించి చెబుతాను. దానిని సత్తనికాని, అసత్తనికాని వివరించడం వీలులేదు.


సర్వతఃపాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖమ్ |
సర్వతఃశ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ‖ 14 ‖
భావం : అది అంతటా చేతులూ, కాళ్ళూ, తలలూ, ముఖాలూ, చెవులూ కలిగి సమస్త జగత్తుని ఆవరించి వున్నది. 

సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ‖ 15 ‖
భావం : ఆ బ్రహ్మం అన్నీ ఇంద్రియాల గుణాలనూ ప్రకాశింపచేస్తున్న సర్వేంద్రియాలూ లేనిది, దేనినీ అంటకపోయినా అన్నింటికీ ఆధారం, గుణాలు లేనిదైన గుణాలను అనుభవిస్తుంది.   

బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ ‖ 16 ‖
భావం : అది సర్వ భూతల వెలుపల, లోపలకూడా వున్నది. కదలదు, కదులుతుంది. అతి సూక్ష్మ స్వరూపం కావడం వల్ల తెలుసుకోవడానికి శక్యం కాదు. అది ఎంతో దూరంలోను బాగా దగ్గరలోనూ వున్నది.   


అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ |
భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ‖ 17 ‖
భావం : ఆబ్రహ్మం ఆకారమంతా ఒక్కటే అయినప్పటికీ సర్వప్రాణులలోనూ ఆకారభేదం కలిగిన దానిలాగ కనపడుతుంది. అది భూతాలన్నిటిని పోషిస్తుంది, భుజిస్తుంది, సృజిస్తుంది. 

జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ‖ 18 ‖
భావం : అది జ్యోతులన్నీటిని ప్రకాశింప చేస్తుంది. అజ్ఞానాంధకారనికి అతితమూ, జ్ఞానస్వరూపమూ, జ్ఞానంతో తెలుసుకోదగ్గదీ, జ్ఞానంతో పొందదగ్గదీ అయి అందరి హృదయలలో అధీష్టించి వున్నది.   

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః |
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ‖ 19 ‖
భావం : ఇలా క్షేత్రం,జ్ఞానం, జ్ఞేయం, గురించి క్లుప్తంగా చెప్పడం జరిగినది. నా భక్తుడు ఈ తత్వాన్ని తెలుసుకొని మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు. 

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాది ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ‖ 20 ‖
భావం : ప్రకృతి పురుషుడు ఈ ఉభయులకి ఆదిలేదని తెలుసుకో,వికారలూ, గుణాలు ప్రకృతి నుంచి పుడుతున్నాయని గ్రహించు.  
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే |
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ‖ 21‖
భావం : శరీరం, ఇంద్రియాల ఉత్పత్తికి ప్రకృతే హేతువనీ, సుఖదఃఖాలను అనుభవించేది పురుషుడని చెబుతారు.   

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్గుణాన్ |
కారణం గుణసంగోఽస్య సదసద్యోనిజన్మసు ‖ 22  ‖
భావం : ప్రకృతిలో వుండే పురుషుడు ప్రకృతి పట్ల కలిగే గుణాలను అనుభవిస్తాడు. ఆ గుణాలపట్ల కల ఆసక్తిని బట్టే పురుషుడు ఉచ్చనీచజన్మలు పొందుతాడు. 

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః |
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్పురుషః పరః ‖ 23 ‖
భావం : ఈ శరీరంలో అంటీ అంటనట్లుగా వుండే పరమపురుషుణ్ణి సాక్షి, అనుమతించేవాడు, భరించేవాడు, అనుభవించేవాడు, మహేశ్వరుడు, పరమాత్మ అని చెబుతాడు.
13వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 13th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS