Bhagavad Gita 13th Chapter 24-35 Slokas and Meaning in Telugu | భగవద్గీత 13వ అధ్యాయం 24-35 శ్లోకాల భావాలు


శ్రీమద్ భగవద్ గీత త్రయోదశోఽధ్యాయః
అథ త్రయోదశోఽధ్యాయః |

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ |

సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే ‖ 24 ‖


భావం : ఇలా పురుషుణ్ణి గురించి, గుణాలతో వున్న ప్రకృతిని గురించి తెలుసుకున్న వాడు ఎలా జీవించినా పునర్జన్మ పొందడు.

ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా |

అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ‖ 25 || 
భావం : ధ్యానయోగం ద్వారా కొంతమంది, జ్ఞానయోగం వల్ల మరికొంతమంది, కర్మయోగంతో ఇంకొంతమంది పరమాత్మను తమలో దర్శిస్తున్నారు. 


అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |

తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ‖ 26 ‖
భావం : అలా తెలుసుకొలేని మరికొంతమంది, గురువుల ఉపదేశం పొంది ఉపాసిస్తారు. వినడంలో శ్రద్ద కలిగినవాళ్లు కూడా సంసారరూపమైన మృత్యువు నుంచి ముక్తి పొందుతారు.


యావత్సంజాయతే కించిత్సత్త్వం స్థావరజంగమమ్ |

క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ ‖ 27  ‖
భావం : అర్జునా! ఈ ప్రపంచంలో పుడుతున్న చరాచరాత్మకమైన ప్రతి వస్తువూ ప్రకృతి పురుషుల కలయికవల్లనే కలుగుతున్నదని తెలుసుకో. 


సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ |

వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ‖ 28 ‖
భావం : శరీరాలు నశిస్తున్న తాను నశించకుండా సమస్త ప్రాణులలోనూ సమానంగా వుండే పరమాత్మను చూసేవాడే సరైన జ్ఞాని. 

సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |

న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ‖ 29 ‖
భావం : పరమాత్మను సర్వత్ర సమానంగా వీక్షించేవాడు తన్ను తాను హింసించుకొడు. అందువల్ల అతను మోక్షం పొందుతాడు. 


ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |

యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి ‖ 30 ‖
భావం : ప్రకృతి వల్లనే సమస్తకర్మలు సాగుతున్నాయని, తానేమీ చేయడం లేదనీ తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని.


యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి |

తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ‖ 31‖
భావం : వేరువేరుగా కనిపించే సర్వ భూతాలు ఒకే ఆత్మలో వున్నాయనీ, అక్కడ నుంచే విస్తరిస్తున్నాయనీ గ్రహించినప్పుడు మానవుడు బ్రహ్మపదం పొందుతాడు.  


అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః |

శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ‖ 32 ‖
భావం : అర్జునా! శాశ్వతుడైన పరమాత్మ పుట్టుక లేనివాడు, గుణరహితుడూ కావడం వల్ల దేహంలో వున్న దేనికి కర్త కాడు. కనుక కర్మఫలమేదీ అతనిని అంటదు. 


యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే |

సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ‖ 33 ‖
భావం : అంతటా వ్యాపించివున్న సూక్ష్మమైన ఆకాశం దేనినీ అంటనట్లు శరీరమంతటా వున్న ఆత్మ కలుషితం కాదు.  


యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః |

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ‖ 34 ‖
భావం : అర్జునా! సూర్యుడోక్కడే ఈ సమస్త లోకాన్ని ప్రకాశింప చేస్తున్నట్లే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రమంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు.   

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుషా |

భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ ‖ 35 ‖
భావం : ఇలా క్షేత్ర క్షేత్రజ్ఞుల భేదాన్ని ప్రకృతి గుణాలనుంచి ప్రాణులు మోక్షం పొందే విధానాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకున్న వాళ్లు పరమపదం పొందుతారు. 


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోఽధ్యాయః ‖ 13 ‖

13వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 13th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments