Bhagavad Gita 13th Chapter 1-12 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత


ŚRĪMAD BHAGAVAD GĪTA TRAYODAŚOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత త్రయోదశోఽధ్యాయః
atha trayodaśoadhyāyaḥ |
అథ త్రయోదశోఽధ్యాయః |

arjunauvacha|
అర్జునాఉవాచా| 

ప్రకృతిం పురుషంచైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ |
ఏత ద్వేదితు మిచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ||1||


భావం : అర్జునుడు: కేశయా! ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష.  

śrībhagavānuvācha |
శ్రీభగవానువాచ |
idaṃ śarīraṃ kaunteya kśhetramityabhidhīyate |
etadyo vetti taṃ prāhuḥ kśhetraGYa iti tadvidaḥ ‖ 2 ‖

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ‖ 2 ‖

భావం : శ్రీ భగవానుడు : కౌంతేయా ! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు.  

kśhetraGYaṃ chāpi māṃ viddhi sarvakśhetreśhu bhārata |
kśhetrakśhetraGYayorGYānaṃ yattajGYānaṃ mataṃ mama ‖ 3 ‖

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |

క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ ‖ 3 ‖

భావం : అర్జునా! క్షేత్రలన్నీటిలోనూ  వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం.   
tatkśhetraṃ yachcha yādṛkcha yadvikāri yataścha yat |
sa cha yo yatprabhāvaścha tatsamāsena me śṛṇu ‖ 4 ‖

తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |

స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ‖ 4  ‖

భావం : ఆ క్షేత్రం ఆకారవికరాలు, పుట్టుపూర్వోత్తరాల గురించి క్షేత్రజ్ఞుడి స్వరూప , స్వభావ ప్రభావాల గురించి క్లుప్తంగా చెబుతాను విను. 

ṛśhibhirbahudhā gītaṃ Chandobhirvividhaiḥ pṛthak |
brahmasūtrapadaiśchaiva hetumadbhirviniśchitaiḥ ‖ 5 ‖

ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ |

బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ‖ 5 ‖

భావం : ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వాన్ని చాటి చెప్పారు వేరు వేరుగా 
వేదాలు, సహేతుకంగా, సందేహరహితంగా, సవివరంగా, బ్రహ్మసూత్రాలూ ఈ స్వరూపపాన్ని నిరూపించాయి. 

mahābhūtānyahaṅkāro buddhiravyaktameva cha |
indriyāṇi daśaikaṃ cha pañcha chendriyagocharāḥ ‖ 6 ‖
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |

ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ‖ 6 ‖
ichChā dveśhaḥ sukhaṃ duḥkhaṃ saṅghātaśchetanā dhṛtiḥ |
etatkśhetraṃ samāsena savikāramudāhṛtam ‖ 7 ‖
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |

ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ‖ 7 ‖


భావం : పంచభూతాలు, అహంకారం, బుద్ది, మూలప్రకృతి, పది ఇంద్రియాలు, మనస్సు, ఐదు విషయ ఇంద్రియాలు, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియాల సమూహం, తెలివి, ధైర్యం వికరాలతో పాటు వీటి సముదాయాన్ని సమగ్రాహంగా క్షేత్రమని చెబుతారు.   
amānitvamadambhitvamahiṃsā kśhāntirārjavam |
āchāryopāsanaṃ śauchaṃ sthairyamātmavinigrahaḥ ‖ 8 ‖
అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవమ్ |

ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ‖ 8 ‖
indriyārtheśhu vairāgyamanahaṅkāra eva cha |
janmamṛtyujarāvyādhiduḥkhadośhānudarśanam ‖ 9 ‖
ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ |

జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ‖ 9 ‖
asaktiranabhiśhvaṅgaḥ putradāragṛhādiśhu |
nityaṃ cha samachittatvamiśhṭāniśhṭopapattiśhu ‖ 10 ‖
అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు |

నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు ‖ 10 ‖
mayi chānanyayogena bhaktiravyabhichāriṇī |
viviktadeśasevitvamaratirjanasaṃsadi ‖ 11 ‖
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |

వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది ‖ 11 ‖
adhyātmaGYānanityatvaṃ tattvaGYānārthadarśanam |
etajGYānamiti proktamaGYānaṃ yadatoanyathā ‖ 12 ‖
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోఽన్యథా ‖ 12 ‖

భావం : తనని తాను పొగడుక పోవడం, కపటం లేకపోవడం, అహింసా, సహనం, సరాళత్వం, సద్గురు సేవ, శరీరాన్ని మనస్సును పరిశుద్దంగా వుంచుకోవడం, స్థిరత్వం, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాల పట్ల విరక్తి కలిగి వుండడం, అహంకారం లేకపోవడం, పుట్టుక, చావు, ముసలితనం, రోగం, అనే వాటివల్ల కలిగే దుఖాన్ని దోషాన్ని కలిగి గమనించడం, దేనిమీద ఆసక్తి లేకపోవడం, శుభా శుభాలలో సమభావం కలిగి వుండడం, నా మీద అనన్యమూ, అచంచలమూ, అయిన భక్తి కలిగి ఉండడం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం, జనసమూహం మీద ఇష్టం లేకపోవడం, ఆత్మ ధ్యానంలో నిరంతరం నిమగ్నమై వుండడం, తత్వజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించడం - ఇదంతా జ్ఞానమని చెప్పబడింది. దీనికి విరుద్ద మయింది అజ్ఞానం.
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 13th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments