Bhagavad Gita 5th Chapter 21-29 Slokas and Meaning in Telugu | భగవద్గీత 5వ అధ్యాయం శ్లోకాలు భావాలు  

శ్రీమద్ భగవద్ గీత పన్చమఽధ్యాయః
అథ పంచమోఽధ్యాయః |

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ |

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ‖ 21 ‖


భావం : ప్రపంచ సుఖాలమీద ఆసక్తి లేనివాడు 
ఆత్మానందం అనుభవిస్తాడు. అలాంటి బ్రహ్మనిష్ట కలిగిన వాడు శాశ్వతమైన ఆనందం పొందుతాడు.

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |

ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ‖ 22 ‖
భావం : కౌంతేయ! ఇంద్రియలోలత్వం అనుభవించే బాహ్య సుఖాలు దుఃఖహేతువులు, క్షీణికాలు. అందువల్ల నిర్మల బుద్ది కలిగిన వాడు వాటిని ఆశించలేడు. 

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్|కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ‖ 23 ‖
భావం : కామ క్రోధల వల్ల కలిగే ఉద్రేకాన్ని జీవితకాలంలో అణగద్రోక్కిన వాడే యోగి, సుఖవంతుడు. 

యోఽంతఃసుఖోఽంతరారామస్తథాంతర్జ్యోతిరేవ యః|
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ‖ 24 ‖
భావం : ఆత్మలోనే ఆనందిస్తూ, ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే ప్రకాశిస్తూ,వుండే యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మనందం పొందుతాడు. 

లభంతే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః|

ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ‖ 25 ‖

భావం : సంశయాలను తొలగించుకొని, మనో నిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు పాపాలన్నిటీని పోగొట్టుకొని బ్రహ్మ సాక్షాత్కార్యం పొందుతారు.

కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్|

అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ‖ 26 ‖

భావం : కామక్రోధాలను విడిచిపెట్టి, మనస్సును జయించిన, ఆత్మజ్ఞాన సంపన్నులైన సన్యాసులకు సర్వత్ర మోక్షం కలుగుతుంది.

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువోః |
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ‖ 27‖
యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః |విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ‖ 28 ‖
భావం : బాహ్య విషయాల మీద ఆలోచనలు లేకుండా దృష్టిని కనుబొమ్మలమధ్య నిలిపి, ముక్కు లోపల సంచరించే ప్రాణపాన వాయువులను సమానం చేసి, ఇంద్రియాలనూ, మనస్సునూ, బుద్దినీ వశపరచుకొని, మోక్షమే పరమ లక్ష్యంగా ఆశ, క్రోధం, భయం విడిచిపెట్టిన ముని అనంతరమూ ముక్తుడై వుంటాడు. 

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ‖ 29 ‖
భావం : యజ్ఞలకూ, తపస్సుకూ, భోక్తవని, సర్వ లోకాలకూ ప్రభువుననీ, సమస్త ప్రాణులకూ మిత్రుడననీ నన్ను తెలుసుకున్నవాడు పరమశాంతి పొందుతాడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
కర్మసంన్యాసయోగో నామ పంచమోఽధ్యాయః ‖5 ‖5వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 5th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments